తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thursday Motivation : మీ గతాన్ని జడ్జ్ చేయకుండా.. మీ​పై నమ్మకముంచేవాడే నిజమైన స్నేహితుడు..

Thursday Motivation : మీ గతాన్ని జడ్జ్ చేయకుండా.. మీ​పై నమ్మకముంచేవాడే నిజమైన స్నేహితుడు..

05 January 2023, 6:32 IST

    • Thursday Motivation : మన జీవితంలో ఎలాంటి స్నేహితులు కావాలో తెలుసా? మన గతాన్ని అర్థం చేసుకుని.. మనం భవిష్యుత్తులో బాగుపడతామని నమ్మి.. మనం ఎలా ఉంటే అలా మనల్ని యాక్సెప్ట్ చేసే మిత్రులు ప్రతి ఒక్కరికి అవసరం. బాధలో ఉంటే వెన్నుతట్టడమే కాదు.. తప్పు చేస్తుంటే చాచి కొట్టేవాళ్లే నిజమైన స్నేహితులు.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Thursday Motivation : మనం ఎంతమందితో కలిసి ఉన్నా.. ఎందరితో మాట్లాడుతున్నా.. కేవలం కొందరినే మన ఫ్రెండ్స్ అని చెప్పుకుంటాము. ఎందుకంటే వాళ్లు మాత్రమే మనతో పాటు.. మన పరిస్థితులను అర్థం చేసుకుని.. మనతోపాటే ఉంటారు. కొందరు స్నేహితులని చెప్పుకుంటూ ఉంటారు కానీ.. మనకి అవసరమైన సమయంలో.. వాళ్ల వాళ్ల రీజన్స్ చూపించుకుంటూ దూరంగా ఉంటారు. అలాంటి వారు ఎప్పటికీ నిజమైన స్నేహితులు కాలేరు.

ట్రెండింగ్ వార్తలు

Male Infertility : మీ స్మార్ట్ ఫోన్ ఈ ప్రదేశంలో పెడితే సంతానోత్పత్తి సమస్యలు

How To Die Properly : చచ్చాక ఎలా ఉంటుందో చూపించే పండుగ.. పిచ్చి పీక్స్ అనుకోకండి

New Broom Tips : కొత్త చీపురుతో ఇంట్లోకి దుమ్ము రావొచ్చు.. అందుకోసం సింపుల్ టిప్స్

Parenting Tips : కుమార్తెలు భయపడకుండా జీవించేందుకు తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు

ఇలా ఉంటేనే స్నేహితులవుతారని చెప్పలేము. కానీ మన స్నేహితులు ఎవరైనా మన గతాన్ని స్వాగతిస్తూ.. జడ్జ్ చేయకుండా.. మన భవిష్యత్తు బాగుండాలి కోరుకుంటారు. వాళ్లు ముందు ఎలా ఉన్నా సరే.. ఫ్రెండ్స్ ఎప్పుడూ జడ్జ్ చేయరు. మనతో పాటు మన అవసరాలు.. పరిస్థితులను అర్థం చేసుకుంటారే తప్పా.. ఇగ్నోర్ చేయరు. అలా చేస్తున్నారంటే వాళ్లు అసలు మన స్నేహితులే కాదు. అయినా జీవితంలో నిజమైన స్నేహితులను కలిగి ఉండాలంటే అదృష్టం కూడా ఉండాలి. ఎందుకంటే నిజమైన స్నేహం అంత సులువుగా దొరకదు. ©

అతను/ఆమె మీ జీవితంలోని అన్ని రహస్యాలను పంచుకునేటప్పుడు మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా.. ఒక అద్దంలో చెప్పుకున్నట్లు దొరికే ఫ్రెండ్ ఉన్నారంటే మీరు నిజంగా అదృష్టవంతులనే చెప్పాలి. మిమ్మల్ని అవమానిస్తారనో.. లేదా అనే దాని గురించి ఎవరికైనా చెప్తారనో చింతించాల్సిన అవసరం ఉండదు. మీ గతాన్ని అర్థం చేసుకునే వ్యక్తి మంచి స్నేహితుడు మీ జీవితంలో ఉన్నట్లే. అమ్మో ఈ విషయం చెప్తే వీళ్లు నన్ను జడ్జ్ చేస్తారంటే.. అది స్నేహం కాదు. స్నేహం పేరిట ఫార్మాలటీగా ఉండడం.

మీ గతం ఎంత అధ్వాన్నంగా ఉన్నా.. మీ దృక్కోణం నుంచి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి స్నేహితులు కచ్చితంగా ప్రయత్నిస్తారు. అంతేకాకుండా మీరు దానిని నుంచి బయటపడి.. జీవితంలో ముందుకు సాగడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు. మీరు ఎలా ఉంటే అలానే మిమ్మల్ని అంగీకరిస్తారు. జీవితంలో జరిగే సంఘటనలు అందరికీ ఒకే విధంగా ఉండవని అర్థం చేసుకునే వ్యక్తులు దొరకడం చాలా ముఖ్యం. మీరు బాధ పడితే ఓదార్చి.. సంతోషంగా ఉన్నప్పుడు ఆనందాన్ని రెట్టింపు చేస్తూ.. మీ కష్టాలను పంచుకుంటూ.. మీరు తప్పు చేస్తే దండించే స్నేహితులను జీవితంలో ఎప్పుడూ వదులుకోకండి. అలాంటి ప్యూర్ సోల్స్ మీకు ఎక్కడా దొరకరు. కాబట్టి మంచి మిత్రులను ఎప్పుడూ వదులుకోకండి.

తదుపరి వ్యాసం