తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hero Electric Scooter: హీరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ధర, మైలేజ్ ఎంతంటే!

Hero Electric Scooter: హీరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ధర, మైలేజ్ ఎంతంటే!

HT Telugu Desk HT Telugu

29 September 2022, 20:06 IST

    • దేశ ఆటోమొబైల్ వేగంగా పురోగమిస్తుంది. మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, హీరో మోటార్ కార్ప్ కూడా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయాలని నిర్ణయించింది. వచ్చే వారం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయవచ్చు.
Hero Vida Electric Scooter
Hero Vida Electric Scooter

Hero Vida Electric Scooter

పెరుగుతున్న పెట్రోల్ ధరల దృష్ట్యా ఉంచుకుని వాహనాదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆటో మెుబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టాయి. తాజాగా ప్రముఖ ఆటో మెుబైల్ సంస్థ హీరో మోటోకార్ప్ కూడా EV సెక్షన్‌లోకి అడుగుపెట్టింది. కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ( (hero first electric scooter)ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ స్కూటర్ అక్టోబర్ 7 (hero electric scooter launch date)న విడుదల కానుంది . ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ ఈ విభాగంలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ స్కూటర్‌కు సంబంధించి హీరో మోటోకార్ప్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే, పలు నివేదిక ప్రకారం, కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడా పేరుతో విడుదల చేయబోతోంది. ఈ స్కూటర్‌కు హీరో విడా, విడా ఈవీ, ఇ విడా అనే పేర్లు పెట్టే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Coconut Chutney: మూడు పప్పులు కలిపి ఇలా కొబ్బరి పచ్చడి చేస్తే అన్నంలో అదిరిపోతుంది

Banana Milk Shake: బనానా మిల్క్ షేక్ ఇలా తాగితే వేసవి తాపం నుంచి బయటపడవచ్చు

Coconut water: కొబ్బరి బోండా నుండి నేరుగా కొబ్బరినీళ్లు తాగకూడదట, ఎందుకో తెలుసుకోండి

Sweating Benefits: చెమట పట్టడం లేదని ఆనందపడకండి, చెమట పడితేనే కిడ్నీలు రాళ్లు చేరవు

అక్టోబర్ 7 లాంచ్

కంపెనీ ఇటీవలే తన 10వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా, కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల ప్రకటనకు ముందు, కంపెనీ ఈ స్కూటర్ ఓవర్ వ్యూను చూపించింది. ఈ స్కూటర్ గురించి కంపెనీ ఇంకా ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. స్కూటర్ అక్టోబర్ 7 న విడుదల చేయనున్నట్లు మార్కెటు నిపుణులు అంచనా వెస్తున్నారు. ఇతర EV స్యూటర్స్‌కు భిన్నంగా ఈ స్కూటర్‌ను డిజైన్ చేశారు. హీరో మోటార్ కార్ప్ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు, ధర ఏమిటో? వివరంగా తెలుసుకుందాం.

ఫీచర్లు

ఈ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక ఫీచర్లు అందించబడ్డాయి. 2000W BLDC మోటార్‌తో పాటు 3 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను పొందుపరుచారు. ఈ బ్యాటరీ ప్యాక్‌లో సాధారణ ఛార్జింగ్‌తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్‌ను పొందవచ్చు. దీనితో పాటు, 5-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ట్రిప్ మీటర్, డిజిటల్ క్లాక్, బ్లూటూత్ కనెక్టివిటీ, యాప్ ఆధారిత ఫీచర్లు, LED హెడ్ లైట్, LED టెయిల్ లైట్, LED టర్న్ సిగ్నల్ ల్యాంప్, అండర్ సీట్ స్టోరేజ్, USB ఛార్జింగ్ పోర్ట్ మొదలైనవి అందుబాటులో ఉన్నాయి. ఇక స్కూటర్ రేంజ్, స్పీడ్ చూస్తే 75 నుండి 100 కిలోమీటర్ల పరిధి ఉండబోతోంది. గంటకు 55 నుంచి 60 కిలోమీటర్ల గరిష్ట వేగం ఉంటుంది. ఈ స్కూటర్‌లో మూడు డ్రైవ్ మోడ్‌లను అందించారు. దీనితో పాటు, అనేక ఇతర ఫీచర్లు ఈ స్కూటర్లలో ఉండనున్నాయి.

ధర ఎంత ఉంటుంది?

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను హీరో ఇంకా వెల్లడించలేదు. అయితే, పలు నివేదికల ఆధారంగా, కంపెనీ ఈ స్కూటర్‌ ధర 1 లక్షలోపు వరకు ఉండవచ్చు. ఈ స్కూటర్ Ola సంస్థ ఎలక్ట్రిక్ స్కూటర్లు Ola S1, బజాజ్ చేతక్, TVS iTube లకు పోటీగా ఉంటుంది.