తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Minister Vidadala Rajini | పదవి దక్కినా తిట్లు తప్పడం లేదు..

Minister Vidadala Rajini | పదవి దక్కినా తిట్లు తప్పడం లేదు..

HT Telugu Desk HT Telugu

11 April 2022, 19:51 IST

google News
    • మంత్రి పదవి దక్కక అలకలు, ఆందోళనలు, నిరసనలు చూస్తున్నాం. ఏపీ క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కని పలువురు ఆశావహులు అలకబూనితే మంత్రి పదవి దక్కినా, అందులోను కీలకమైన వైద్య ఆరోగ్య, వైద్య విద్య శాఖలు దక్కినా విడదల రజనిపై విమర్శలు తప్పలేదు.
విడదల రజని
విడదల రజని

విడదల రజని

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రజని కాబినెట్ జాబితా వెలువడిన తర్వాత ఆదివారం రాత్రి ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. "తన మీద నమ్మకం ఉంచి, మంత్రి వర్గంలో చోటు కల్పించిన జగన్ అన్నకు కృతజ్ఞతలు, అందరి కోసం తాను మరింత శ్రమిస్తానని"పేర్కొన్నారు. ఆమె 4685 పైగా స్పందనలు వచ్చాయి. సాధారణంగా ఎవరికైనా మంత్రి పదవి లభించింది అంటే అభినందనలు తెలుపుతారు. అయితే నిరంతరం సోషల్ మీడియా ప్రమోషన్ కి ప్రాధాన్యత ఇచ్చే విడదల రజనికి మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.

గుంటూరు జిల్లాలోనే కాకుండా సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ట్రోల్స్ నడిచాయి. ఆమె ట్వీట్ ని కోట్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఇలా నిరసన తెలిపిన వారిలో ఎక్కువ మంది వైసీపీకి చెందిన హ్యాండిల్స్ ఉండటం విశేషం. విడదల రజని వ్యవహార శైలి మీద జిల్లా నేతలతో పాటు, కార్యకర్తల్లో వ్యతిరేకత ఉండటంతో ఆమె ట్వీట్ మీద విమర్శలు గుప్పించారు.

సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రచారాలు చేసే హ్యాండిల్స్ నుంచి సైతం సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు బహిరంగంగా నిరసన తెలిపారు. " సెల్ఫ్ పబ్లిసిటీ తగ్గించాలి, సీఎం భజన వల్లే పదవి వచ్చిందని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మంత్రి పదవికి రజని అనర్హురాలని, 2018లో టీడీపీలో ఉండి ఏమి మాట్లాడారో తమకు గుర్తుందని, రజనికి మంత్రి పదవి ఇవ్వడం ఇష్టం లేదని, మహా నటి, పబ్బం గడుపుకోడానికి ఎంతకైనా తెగిస్తారని వివిధ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి విమర్శలు గుప్పించారు.మంత్రి పదవి దక్కిన ఆనందం దక్కకుండా పోయిన వారిలో రజని ఒక్కరే ఉండి ఉంటారు. చిలకలూరిపేట నుంచి గెలిచిన తర్వాత పార్టీలో మొదటి నుంచి ఉన్న మర్రి రాజశేఖర్ వంటి వారిని అణగదొక్కేందుకు ప్రయత్నించడం పార్టీ క్యాడర్ అసంతృప్తి కి కారణం అయ్యింది.

తదుపరి వ్యాసం