తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Exercise For Eyes : కంటి సమస్యలను నివారించేందుకు ఇలా చేయండి

Exercise For Eyes : కంటి సమస్యలను నివారించేందుకు ఇలా చేయండి

Anand Sai HT Telugu

28 February 2024, 5:30 IST

google News
    • Yoga For Eyes : కంటి ఆరోగ్యం బాగుండాలి. లేదంటే సమస్యలు చాలా వస్తాయి. కళ్లు బాగుండేందుకు కొన్ని రకాల వ్యాయామాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..
కంటి ఆరోగ్యానికి వ్యాయామాలు
కంటి ఆరోగ్యానికి వ్యాయామాలు (Unsplash)

కంటి ఆరోగ్యానికి వ్యాయామాలు

కళ్ళు శరీరంలో అత్యంత సున్నితమైన భాగం. కానీ ఒత్తిడి అంతా ఈ కళ్లపైనే. ఆఫీసులో రోజంతా కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ముందు పని చేస్తాం. తీరిక సమయంలో టీవీ లేదా మొబైల్‌లో చూస్తుంటాం. ఎక్కువ సమయం తెరపైనే చూస్తూ జీవితం నడుస్తూ ఉంది. ఫలితంగా రకరకాల కంటి సమస్యలు వస్తాయి.

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలని వైద్యులు చెప్పినట్లే కళ్లకు కూడా కొన్ని వ్యాయామాలు చేయాల్సిందే. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. మీ దృష్టిని మెరుగుపరచడానికి కొన్ని సాధారణ యోగా భంగిమలపై ఆధారపడవచ్చు, కంటి నొప్పి, నీరు కారడం మొదలైన సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కంటి సంరక్షణ కోసం ఎలాంటి వ్యాయామాలు చేయాలో చూడండి.

రెండు చేతుల్లో అరచేతులను కాసేపు రుద్దండి, వాటిని వేడి చేయండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని, మీ చేతులను మీ కళ్ళపై ఉంచండి. రెండు చేతుల రాపిడి వల్ల అరచేతుల్లో ఏర్పడే వేడి, కళ్లకు వేడిని ఇస్తుంది. లోతైన శ్వాస తీసుకోండి. మీ చేతులను మీ కళ్ళపై కొన్ని నిమిషాలు పట్టుకోండి. ఇది అలసిపోయిన కళ్లకు ఉపశమనం కలిగించి కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది.

వెన్నెముకను కచ్చితంగా నిటారుగా ఉంచి కూర్చోండి. ఐబాల్‌ను 10 సార్లు వృత్తాకార కదలికలో తిప్పండి. ఆ తర్వాత కొన్ని నిమిషాల పాటు కళ్లు మూసుకుని ఉండండి. మీ కళ్ళను చాలా నెమ్మదిగా కదిలించండి. ఈ వ్యాయామం కంటి కండరాలను సడలించడానికి, రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది. ఎప్పుడూ ఒకే వైపు చూసేవారికి ఇలా చేయడం వలన లాభం ఉంటుంది. కంటికి మంచి జరుగుతుంది.

నిటారుగా కూర్చోండి. మీ చేతులను మీ ముందు చాచి, మీ బొటనవేళ్లను అడ్డంగా ఉంచండి. థంబ్స్ అప్ లాగా పెట్టాలి. కాసేపు ఈ వేలిని చూడండి. ఆ తర్వాత దూరంగా ఉన్న వస్తువును కాసేపు చూడండి. దీన్ని చాలా సార్లు బొటనవేళ్లతో చేయండి. మీ చూపులను దూర వస్తువుల వైపునకు మార్చడం కొనసాగించండి. ఈ వ్యాయామం కంటి కండరాలను బలపరుస్తుంది, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మోకాళ్లను వంచి చీలమండల మీద కూర్చుకోవాలి. ఈసారి శరీరాన్ని ముందుకు వంచాలి. ఛాతీ తొడలపై ఉండే విధంగా శరీరాన్ని వంచండి. మీ నుదిటిని నేలపై ఉంచండి. రెండు చేతులను ముందుకు చాచండి. మీ కళ్ళు మూసుకుని నెమ్మదిగా ఊపిరి పీల్చుకోండి. ఈ వ్యాయామం మెడ, భుజం, కంటి ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.

నేలపై బోర్లా పడుకోండి. రెండు చేతులను సమానంగా ముందు పెట్టుకోండి. మీ అరచేతులు నేలకు తాకాలి. ఈ స్థితిలో మీ చేతులను ఉపయోగించి తల, ఛాతీని వీలైనంత వరకు పైకి ఎత్తండి. కొంచెం పైకి చూడాలి. తొడలు నేలను తాకి ఉంటాయి. ఈ భంగిమ మెడ, భుజాలు, కళ్ళకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది.

కంటిని ఆరోగ్యంగా చూసుకోవాలి. అప్పుడే మంచిది. లేదంటే చిన్న వయసులోనే దృష్టి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. తర్వాత చాలా ఇబ్బందులు పడతారు.

తదుపరి వ్యాసం