Foods for Vein Health। రక్తనాళాల ఆరోగ్యం, రక్త ప్రసరణకు మీ డైట్ ఇలా ఉండాలి!-eat these foods for vein health and improve blood circulation ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Foods For Vein Health। రక్తనాళాల ఆరోగ్యం, రక్త ప్రసరణకు మీ డైట్ ఇలా ఉండాలి!

Foods for Vein Health। రక్తనాళాల ఆరోగ్యం, రక్త ప్రసరణకు మీ డైట్ ఇలా ఉండాలి!

HT Telugu Desk HT Telugu

Foods for Vein Health: రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, మీ రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడానికి మీరు ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిదో ఇక్కడ తెలుసుకోండి.

Foods for Vein Health (istock)

Foods for Vein Health: మన శరీరంలో రక్తనాళాలు అనేవి చాలా ముఖ్యమైనవి, ఇవి మన శరీరంలో రక్తాన్ని ఒకచోట నుండి ఒకచోటకి సరఫరా చేస్తాయి. ఆక్సిజన్, పోషకాలను చేరవేస్తాయి, పనులు చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. రక్తనాళాలు బలహీనపడటం, లేదా వాటిలో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే అనేక సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే.. సమతుల్య, పోషకమైన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటే, అది రక్త ప్రసరణను మెరుగుపరచడమే కాకుండా, సిరలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, మీ రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడానికి మీరు ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిదో ఇక్కడ తెలుసుకోండి.

విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు

మీ రోజువారీ ఆహారంలో విటమిన్ సి చేర్చడం చాలా ముఖ్యం. ఇది మీ రక్త నాళాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలు, పైనాపిల్, నారింజ, క్యాప్సికమ్, మిరియాలు, కాలీఫ్లవర్, క్యాబేజీ, మొలకలు వంటివి ఎక్కువగా తినండి. ఈ ఆహారాలు ప్రసరణను మెరుగుపరచడంలో, వాపును తగ్గించడంలో, మీ రక్తనాళాల గోడలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

ఫ్లేవనాయిడ్ సమ్మేళనాలు కల ఆహారాలు

ఈ సమ్మేళనాలు అనేక మొక్కల ఉత్పత్తులలో కనిపిస్తాయి, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఉల్లిపాయలు, ద్రాక్ష, పీచెస్, బెర్రీలు, టమోటాలు, పాలకూర, బ్రోకలీ, యాపిల్స్, ఆస్పరాగస్ వంటి వాటిలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. గ్రీన్ టీ తాగితే కూడా రక్తనాళాలు శుభ్రపడతాయి.

పీచు పదార్ధాలు

జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో పీచు పదార్థాలు ఉత్తమంగా సహాయపడుతాయి. అంతేకాకుండా ఫైబర్ తినడం వలన రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. వోట్స్, యాపిల్స్, ఫ్లాక్స్ సీడ్, క్యారెట్, బెర్రీలు, బార్లీ, కాయధాన్యాలు, చియా విత్తనాలు, బ్రౌన్ రైస్ వంటి ఆహారాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది.

గింజలు- విత్తనాలు

వివిధ రకాల గింజలు, విత్తనాలు అనేక పోషకాలకు మూలంగా ఉంటాయి. వీటిలో నియాసిన్, విటమిన్ B3 , విటమిన్ E తో వంటి మూలకాలతో పాటు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పేరుకు పోయిన కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి, ప్రసరణలో అడ్డంకులను నివారిస్తాయి, తద్వారా రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. పొద్దుతిరుగుడు విత్తనాలు, అవిసె గింజలు, చియా గింజలు, గుమ్మడికాయ గింజలు వంటివి తింటూ ఉండాలి.

నీరు

రక్తం ప్రవాహం సరిగ్గా జరగాలంటే నీరు అవసరం. మీ శరీరంలో తగినంత నీరు ఉంటే, అది మీ రక్తనాళాలకు మద్దతు ఇచ్చే కండరాలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది. మీ రక్తాన్ని పలుచగా చేయడానికి కూడా నీరు బాధ్యత వహిస్తుంది, తద్వారా రక్త ప్రసరణను సులభం చేస్తుంది, శరీరంలో రక్తం గడ్డకట్టే అవకాశాన్ని తగ్గిస్తుంది. కాబట్టి రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. ప్రతిరోజూ కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తప్పకుండా త్రాగాలి.

సంబంధిత కథనం