తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Healthy Kitchen: మీ వంటింట్లో ఉండే ఈ వస్తువులే ఇంట్లోవారి అనారోగ్యాలకు కారణం, ఈ రోజే వాటిని మార్చండి

Healthy kitchen: మీ వంటింట్లో ఉండే ఈ వస్తువులే ఇంట్లోవారి అనారోగ్యాలకు కారణం, ఈ రోజే వాటిని మార్చండి

Haritha Chappa HT Telugu

04 December 2024, 14:00 IST

google News
  • Healthy kitchen: సగానికి పైగా వ్యాధులు చెడు ఆహారం వల్ల వస్తాయి. వంటగదిలో ఉండే కొన్ని రకాల వస్తువుల మీకు అనారోగ్యాన్ని ఇస్తుంది. ఆ వస్తువులేంటో తెలుసుకుని ఈ రోజే వాటిని మార్చేయండి.

వంటింట్లో మార్చుకోవాల్సిన ఉత్పత్తులు ఇవే
వంటింట్లో మార్చుకోవాల్సిన ఉత్పత్తులు ఇవే (Shutterstock)

వంటింట్లో మార్చుకోవాల్సిన ఉత్పత్తులు ఇవే

మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపేది మీరు తినే ఆహారమే. మనం తీసుకునే ఆహారం మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. నేడు అనారోగ్యకరమైన ఆహారం జీవనశైలిలో భాగమై పోయింది. దీని వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం, కొలెస్ట్రాల్, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. ఈ వ్యాధులన్నింటిలోనూ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యం కోసం వంటింట్లో వాడే కొన్ని వస్తువులు అనేక వ్యాధులకు కారణం అవుతాయి. కాబట్టి వంటింట్లో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. మీరు తినే ఆహారాల్లో మార్పులు చేసుకోవాలి. కొన్ని ఆహారాలకు బదులు ఇతర ప్రత్యామ్నాయాలు చేర్చుకోవాలి.

పంచదార

చక్కెరను వైట్ పాయిజన్ అని పిలుస్తారు. పంచదార వల్ల ఆరోగ్యానికి కీడు జరుగుతుందని తెలిసి కూడా ప్రతి ఇంటిలో చక్కెరను వాడే వారు ఎంతో మంది. అల్ట్రా-ప్రాసెస్ పద్దతిలో తయారుచేసిన పంచదార మన శరీరానికి, చర్మానికి ఎంతో ప్రమాదకరం. అటువంటి పరిస్థితిలో, మీరు మీ వంటగది నుండి చక్కెరను తొలగించాలి. దానికి బదులుగా బెల్లం, కొబ్బరి చక్కెర, స్టెవియాను ఉపయోగించాలి.

కూరగాయలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. మార్కెట్ నుండి తీసుకువచ్చిన తాజా సీజనల్ కూరగాయలను తినడానికి ప్రయత్నించండి. అవసరమైన పోషకాలను అందించడం ద్వారా మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవి పనిచేస్తాయి.

ఇన్‌స్టెంట్ జ్యూసులు

జ్యూస్ ను తాగడం చాలా సులువు. ఇది ఆరోగ్యకరమైనది కూడా. ప్రతిరోజూ తాజా జ్యూసులు చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ప్రజలు తరచుగా మార్కెట్లో ఉండే పండ్ల జ్యూసులను కొంటూ ఉంటారు. జ్యూసుల ప్యాకెట్లు, బాటిళ్లు తెచ్చి ఫ్రిజ్ లో పెట్టుకుని తాగుతూ ఉంటారు. ఇది ఆరోగ్యకరమైన ఎంపిక కాదు. ప్యాకేజ్డ్ జ్యూసులలో పంచదార, కృత్రిమ రంగులు, రుచులు కలుపుతారు. ఇవి మన ఆరోగ్యానికి మంచిది కాదు. వీలైనంత వరకు తాజా రసం లేదా పండ్లను తినడానికి ఇష్టపడతారు.

ప్రాసెస్డ్ నూనె

మార్కెట్లో దొరికే శుద్ధి చేసిన నూనెను అధికంగా ఇళ్లలో వంటకు ఉపయోగిస్తారు. శుద్ధి చేసిన నూనెలో పోషక విలువలు తక్కువగా ఉంటాయి. మార్కెట్లో అమ్మే నూనెలలో అనేక రకాల రసాయనాలు, అధిక పాలీ అన్చు శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా హానికరం. వీటికి బదులు మీరు కోల్డ్ ప్రెస్డ్ వెజిటబుల్ ఆయిల్ ఉపయోగించడం మంచిది. సమీపంలోని క్రషర్ నుండి స్వచ్ఛమైన నూనెను కొన్ని తెచ్చుకోవడం ఉత్తమం.

మైదా పిండి

ప్రతి ఇంట్లోనూ మైదా పిండిని వాడుతూ ఉంటారు. దీని తయారీలో ప్రాసెసింగ్ పద్ధతి వాడుతూ ఉంటారు. అలాగే బెంజీన్ వంటి రసాయనాలు కూడా కలుపుతారు. ఈ పిండి తెల్లగా, సన్నగా రావడానికి అధికంగా ప్రాసెస్ చేస్తూ ఉంటారు. దీనివల్ల పోషకాలు చాలా వరకు నశిస్తాయి. అలాగే వాటిని ఎక్కువ కాలం నిల్వ చేయడానికి కూడా అనేక రకాల రసాయనాలను కలుపుతారు. కాబట్టి మైదా పిండి పూర్తిగా వాడడం మానేయాలి. దీనికి బదులు గోధుమ పిండి వాడుకోవాలి.

తదుపరి వ్యాసం