Vegetables Nutrition: ఈ కూరగాయలను అతిగా ఉడికించి తింటే ఎలాంటి లాభం లేదు, సగం ఉడికాక తినేయండి
24 August 2024, 8:00 IST
Vegetables Nutrition: కూరగాయలను తరచుగా ఉడికించి తింటారు, ఇది వాటిని తినడం సులభం చేస్తుంది, కానీ కొన్ని కూరగాయలు వంటలో ఉండే పోషక అంశాలను కోల్పోతాయి.
కూరగాయలను ఎలా వండితే ఆరోగ్యం?
తాజా కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిని వండుకుని తినడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. అయితే వాటిని వండే పద్దతిపై వాటిలో పోషకాలు ఎంత మేరకు ఉంటాయో తెలుస్తుంది. మీరు అతిగా వాటిని ఉడికించడం, వేయించడం చేస్తే వాటిలోని పోషకాలు దాదాపు ఆవిరైపోతాయి. అలాంటి వంటకం తిన్నా కూడా ఎలాంటి ఉపయోగం లేదు. ముఖ్యంగా కొన్ని కూరగాయలు అతిగా వండితే వాటి వల్ల శరీరానికి ఎలాంటి పోషకాలు అందవు. వాస్తవానికి, కూరగాయలను వండేది వాటి రుచిని పెంచడానికి. అలాగే వాటిలో ఏవైనా బ్యాక్టిరియాలు ఉంటే అవి వేడి చేయడం వల్ల నిర్వీర్యం అవుతాయి. కానీ కొందరు వాటిని అతిగా ఉడికించేస్తారు. అలాగే నూనెలో అతిగా వేయించేస్తారు ఇలా చేయడం వల్ల కొన్ని కూరగాయల్లోని పోషకాలు తగ్గిపోతాయి. ఏ కూరగాయలను అతిగా ఉడికించకూడదో తెలుసుకోండి.
పాలకూర
పాలకూరలో ఐరన్, విటమిన్ సి, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. అయితే పాలకూరను ఎక్కువ మంట మీద అధికంగా ఉడికించినట్లయితే పాలకూరలో ఉండే విటమిన్ సి తగ్గిపోతుంది. పాలకూరలో ఉండే విటమిన్ సి ఆవిరై పోకుండా ఉండాలంటే పాలకూరను చిన్న మంట మీద తక్కువ సమయం ఉడికించాలి. అప్పుడే పాలకూరలోని పోషకాలు సగమైన శరీరానికి అందుతాయి.
బ్రోకలీ
బ్రోకలీలో యాంటీఆక్సిడెంట్లతో పాటు విటమిన్లు సి, విటమిన్ కె నిండుగా ఉంటాయి. బ్రొకోలీని తినడానికి ముందు ఉడికించి తింటే అందులోని విటమిన్ సిలో సగం తగ్గిపోతుంది. కాబట్టి బ్రొకోలీని చాలా తక్కువ సేపు చిన్న మంట మీద ఉడికించాలి.
కాలీఫ్లవర్
బ్రోకలీ మాదిరిగానే, కాలీఫ్లవర్‌ను అతిగా ఉడికించడం వల్ల కూడా పోషకాలను కోల్పోవాల్సి ఉంటుంది. ఒకే కుటుంబానికి చెందిన బ్రోకలీ, కాలీఫ్లవర్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటిని అధికంగా వేయించడం, ఉడకించడం వల్ల ఈ రెండింటిలోని పోషకాలు ఆవిరైపోతాయి.
టమోటాలు
టమోటాలను చాలా త్వరగా వండేయచ్చు. అయినా కూడా కొంతమంది వాటిని ఎక్కువసేపు ఉడికిస్తారు. టమోటాలలో లైకోపీన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. కాబట్టి టమోటాలను కూడా అప్పుడప్పుడు పచ్చిగా తినడం వల్ల విటమిన్ సి ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. వండినప్పుడు వాటిని అధిక సమయం పాటూ ఉడికించకూడదు.
పచ్చి బఠానీలు
పచ్చిబఠానీలలో విటమిన్ ఎ, సి, కె పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది బఠానీలను ఉడికించిన తరువాత వండుతారు. అలా చేయడం వల్ల బఠాణీలలో ఉండే విటమిన్ సి, విటమిన్ బి తగ్గిపోతాయి.
క్యారెట్లు
క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ వంటి పోషకాల పూర్తి ప్రయోజనాన్ని మీకు కావాలంటే వాటిని పచ్చిగానే తినాలి. వీటిని వండి తినడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.
క్యాప్సికం
క్యాప్సికంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీనిని అధిక మంటపై ఉడికించినప్పుడు, విటమిన్ సి మొత్తం తొలగిపోతుంది. కాబట్టి బెల్ పెప్పర్ ఎప్పుడూ పచ్చిగా తినేందుకు ప్రయత్నించాలి. లేదా తక్కువ సమయం పాటూ వాటిని వండాలి.
టాపిక్