Egg Recipe: టేస్టీ టేస్టీ క్యాప్సికం ఎగ్ ఫ్రైడ్ రైస్, పిల్లలకు బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ-capsicum egg fried rice recipe in telugu best lunch box recipe for kids ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Egg Recipe: టేస్టీ టేస్టీ క్యాప్సికం ఎగ్ ఫ్రైడ్ రైస్, పిల్లలకు బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ

Egg Recipe: టేస్టీ టేస్టీ క్యాప్సికం ఎగ్ ఫ్రైడ్ రైస్, పిల్లలకు బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ

Haritha Chappa HT Telugu

Egg Recipe: స్కూళ్లు మొదలైపోయాయి. వారికి లంచ్ బాక్స్ రెసిపీగా క్యాప్సికం ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రయత్నించండి. ఇది పిల్లలకు నచ్చడం ఖాయం. దీన్ని చేయడం చాలా సులువు.

క్యాప్సికం ఎగ్ ఫ్రైడ్ రెసిపీ

Egg Recipe: ఎగ్ ఫ్రైడ్ రైస్ పేరు చెప్తేనే నోరూరిపోతుంది. దీన్ని మరింత పోషకాహారంగా మార్చాలంటే క్యాప్సికం తురుమును చేరిస్తే సరిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రాత్రిపూట తేలికపాటి ఆహారాన్ని తినాలనుకునే వారు ఈ క్యాప్సికం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒక కప్పు తింటే చాలు త్వరగా పొట్ట నిండిపోతుంది. రాత్రంతా ఆకలి వేయకుండా ఉంటుంది. శక్తి నిరంతరం అందుతుంది. ఈ కాప్సికం ఎగ్ ఫ్రైడ్ రైస్ మంచి లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు లంచ్ బాక్స్ లో ఇది పెడితే వారు ఇష్టంగా తింటారు. దీన్ని చేయడం కూడా చాలా సులువు.

క్యాప్సికం ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

వండిన అన్నం - ఒక కప్పు

కోడిగుడ్లు - రెండు

క్యాప్సికం - ఒకటి

ఉల్లిపాయ - ఒకటి

మిరియాల పొడి - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - ఒక స్పూను

సోయాసాస్ - ఒక స్పూను

క్యాప్సికం ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ

1. కోడిగుడ్డుతో చేసిన వంటకాలను పిల్లలు ఇష్టంగా తింటారు. వారికి లంచ్ బాక్స్ లోకి ఎగ్ రెసిపీలను ప్రయత్నించండి.

2. ఇక్కడ మేము క్యాప్సికం ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఇచ్చాము. ఇది పిల్లలకు డిన్నర్ రెసిపీ గానే కాదు లంచ్ బాక్స్ రెసిపీగా వినియోగించుకోవచ్చు.

3. దీనికోసం ముందుగా క్యాప్సికంను సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

5. నూనె వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేయించుకోవాలి.

6. ఆ తర్వాత క్యాప్సికం ముక్కలను వేసి బాగా వేయించాలి.

7. వేరే గిన్నెలో కోడిగుడ్లను వేసి బాగా గిలక్కొట్టి ఆ మొత్తం మిశ్రమాన్ని క్యాప్సికం ముక్కల్లో వేసుకోవాలి.

8. రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడిని కూడా చల్లుకొని ఆ మిశ్రమాన్ని కలుపుకోవాలి.

9. ఇది మొత్తం వేయించుకున్నాక ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని అందులో కలిపి పులిహార లాగా కలుపుకోవాలి.

10. సోయాసాస్ ఒక స్పూన్ వేసి కలుపుకోవాలి. మంట చిన్నగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే అన్నం మాడిపోయే అవకాశం ఉంది.

11. పైన మరికొంత మిరియాల పొడి చల్లుకుంటే టేస్టీగా ఉంటుంది.

12. టేస్టీ క్యాప్సికం ఎగ్ ఫ్రైడ్ రైస్ ను పిల్లలకు లంచ్‌లో లేదా డిన్నర్లో తినిపిస్తే వారు ఇష్టంగా తింటారు. ఇది ఆరోగ్యకరమైన హెల్తీ రెసిపీ కూడా .

క్యాప్సికం తినడం వల్ల ఆరోగ శరీరానికి విటమిన్ సి అధికంగా అందుతుంది. చర్మం తేమవంతంగా ఉంటుంది. క్యాప్సికంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు ఎక్కువే కాబట్టి క్యాప్సికంను వారంలో రెండు మూడు సార్లు తినడం చాలా అవసరం. మీకు ఈ రెసిపీలో కాప్సికంతో పాటు కోడిగుడ్డును కూడా వేసాము. కోడిగుడ్డు సంపూర్ణ ఆహారంగా చెబుతారు. దీన్ని తినడం వల్ల తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు శరీరానికి అందుతాయి. కాబట్టి ఈ రెండూ కలిపి వండిన క్యాప్సికం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒక పోషకాహారంగా చెప్పుకోవాలి. టేస్ట్‌లో ఇది అదిరిపోతుంది.