తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Blood Donation Benefits: రక్తదానం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Blood Donation Benefits: రక్తదానం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

HT Telugu Desk HT Telugu

19 September 2022, 20:30 IST

    • Blood Donation Benefits: మన దేశంలో 37 శాతం మంది మాత్రమే రక్తదానం చేయడానికి అర్హులు, అయితే వారిలో ప్రతి సంవత్సరం 10 శాతం కంటే తక్కువ మంది మాత్రమే రక్తదానం చేస్తున్నారు. రక్తం మనకు ప్రకృతి ప్రసాదించిన అత్యంత విలువైన బహుమతి. రక్తదానం చేయడం అంటే ఓ మనిషికి జీవనదానం చేయడమే
Blood Donation Benefits
Blood Donation Benefits

Blood Donation Benefits

రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు:

ట్రెండింగ్ వార్తలు

Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

Men Skin Care Drinks : మెరిసే చర్మం కావాలంటే రోజూ ఉదయం వీటిలో ఏదో ఒకటి తాగండి

Sunday Motivation: ప్రపంచాన్ని గెలిచిన విజేతల విజయ రహస్యాలు ఇవే, ఫాలో అయిపోండి

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

నేటికీ రక్తదానం (Blood Donation)పై అనేక అపోహలు ఉన్నాయి. రక్తదానం చేయడం వల్ల బలహీనతకు దారితీస్తుందని చాలా మంది అనుకుంటుంటారు. అలాగే అనేక వ్యాధులకు దారితీస్తుందని అపోహ పడుతుంటారు. అయితే రక్తదానం అనేది మనందరి సమాజ బాధ్యత. ఆసుపత్రికి వెళ్ళే ప్రతి ఏడుగురిలో ఒకరికి రక్తం అవసరమవుతుంది. కొన్నిసార్లు రక్తం దొరక్క చాలా మంది మరణిస్తున్నారు. భారతదేశంలోనే కాదు అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా రక్తదానం చేయడంలో చాలా పెద్ద నిరాకరిస్తున్నారు.

పలు అద్యాయనాల ప్రకారం మన దేశంలో కేవలం 37 శాతం మంది మాత్రమే రక్తదానం చేయడానికి అర్హులు, అయితే వారిలో ప్రతి సంవత్సరం 10 శాతం కంటే తక్కువ మంది రక్తదానం చేస్తున్నారు. రక్తం మనకు ప్రకృతి ప్రసాదించిన అత్యంత విలువైన బహుమతి. రక్తదానం చేయడం అంటే ఓ మనిషికి జీవనదానం చేయడమే. మనం ఇచ్చే రక్తం ఆ రోజు కాకపోయిన మరో రోజు ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది. అయితే ప్రాధన్యత గల అంశంపై చాలా మందిలో అవగాహన కొరవడింది. రక్తదానం మన శరీరానికి ఎలాంటి హాని కలిగించదని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు, కానీ అది మనకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది . రక్తదానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది

ఎక్కువగా బరువు పెరిగినట్లయితే, రక్తదానం చేయడం ద్వారా బరువును కోల్పోవచ్చు. దీనితో పాటు రక్తదానం చేయడం వల్ల సత్తువ కూడా పెరుగుతుంది. ఏదైనా ఆరోగ్య ప్రమాదాన్ని నివారించడానికి రక్తదానం చేసే ముందు వైద్యుడిని సంప్రదించడం అవసరం.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

రక్తదానం చేయడం వల్ల మొత్తం శారీరక ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. రక్తదానం చేసినప్పుడు, ఎర్ర రక్త కణాలకు ఉత్పత్తి చేసే ప్లీహము సరికొత్త శక్తితో పనిచేయడం ప్రారంభిస్తుంది. రక్త ప్లాస్మా మన రోగనిరోధక కణాలైన ల్యూకోసైట్‌లను కూడా పెంచుతుంది. ఇవి చాలా తీవ్రమైన వ్యాధుల నుండి మనలను రక్షిస్తాయి.

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

మీరు క్రమం తప్పకుండా రక్తదానం చేస్తే, శరీరంలో ఐరన్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. రక్తంలో అధిక స్థాయిలో ఐరన్ ఉంటే రక్తనాళాలను అడ్డుకుంటుంది. రక్త ప్రసరణ దెబ్బతీంటుంది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. హెమోక్రోమాటోసిస్ (ఐరన్ ఓవర్‌లోడ్) అనే వ్యాధికి కారణమవుతుంది. రక్తదానం చేయడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

రక్తంలో ఇనుము పేరుకుపోకుండా ఉండేందుకు రక్తదానం చాలా మంచి మార్గం. రక్తంలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది

రక్తదానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటిలో అతిపెద్ద ప్రయోజనం మానసిక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడం. మీరు రక్తదానం చేసినప్పుడు, గొప్ప సహాయం చేసిననే మంచి అనుభూతి మీకు కలుగుతుంది. ఇది మిమ్మల్ని రిఫ్రెష్‌గా, ఆనందాన్ని కలిగిస్తుంది. ఎవరొక్కరూ అత్యపరిస్థితిలో ఉన్నప్పుడు రక్తం అవసరం అవుతుంది. ఆ అత్యవసర పరిస్థితుల్లో మీరు రక్త దానం చేస్తే ఒకరి ప్రాణాన్ని కాపాడవచ్చు. దీని నుండి వచ్చే ఆనందం మీ మానసిక ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది. మానసికంగా మీరు చాలా దృఢంగా ఉంటారు.

తదుపరి వ్యాసం