తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ayurvedic Remedies For Blood Sugar Control : బ్లడ్ షుగర్​ను ఈ డ్రింక్స్​తో కంట్రోల్ చేసేయండిలా..

Ayurvedic Remedies for Blood Sugar Control : బ్లడ్ షుగర్​ను ఈ డ్రింక్స్​తో కంట్రోల్ చేసేయండిలా..

16 September 2022, 11:02 IST

google News
    • Control Blood Sugar : బ్లడ్ షుగర్​ను కంట్రోల్ చేయడానికి చాలా మంది చాలా ప్రయత్నిస్తారు. అయితే ఆయుర్వేదం ద్వారా దీనిని సులువుగా కంట్రోల్ చేయవచ్చు అంటున్నారు నిపుణులు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పలు పానీయాలు తాగితే ఆటోమేటిక్​గా బ్లడ్ షుగర్ అదుపులోకి వస్తుంది అంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రక్తంలో చక్కెర స్థాయిలను ఇలా కంట్రోల్ చేయండి
రక్తంలో చక్కెర స్థాయిలను ఇలా కంట్రోల్ చేయండి

రక్తంలో చక్కెర స్థాయిలను ఇలా కంట్రోల్ చేయండి

Control Blood Sugar : బ్లడ్ షుగర్ గురించి ఆందోళన చెందుతున్నారా? అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ డ్రింక్స్​ను తాగేయండి. రక్తంలో చక్కెరను అనేక విధాలుగా తగ్గించడానికి ప్రయత్నిస్తాము. అయితే ఆయుర్వేదం ద్వారా ఈజీగా దానిని కంట్రోల్ చేయవచ్చు అంటున్నారు నిపుణులు. కొన్ని మసాలా దినుసులతో దానిని అదుపులోకి తీసుకురావచ్చు అంటున్నారు.

వైద్యుల సలహా మేరకు మందులతో బ్లడ్ షుగర్ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. దీనితో పాటు కొన్ని జీవనశైలి అలవాట్లపై శ్రద్ధ పెట్టాలని నిపుణులు కోరుతున్నారు. దానిలో భాగంగా బ్లడ్ షుగర్ సమస్యల నుంచి బయటపడటానికి యోగా వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం. ఆయుర్వేదంలో బ్లడ్ షుగర్ కంట్రోల్ అవ్వడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మెంతులు

మెంతులు మధుమేహానికి మాత్రమే కాకుండా.. ఊబకాయం, కొలెస్ట్రాల్ సమస్యలకు కూడా అనేక ప్రయోజనాలను అందిస్తాయి. మెంతులు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, గ్లూకోస్ టాలరెన్స్‌లో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

మిరియాలు

చక్కెర స్థాయిని తగ్గించడంలో మిరియాలు చాలా మేలు చేస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల షుగర్ స్పైక్‌లను దూరం చేసుకోవచ్చు. ఇందులో పైపెరిన్ ఉంటుంది. ఇది చక్కెరను అదుపులో ఉంచుతుంది. ఉదయాన్నే లేచి మిరియాలను ఒక కప్పు నీటిలో వేసి మరింగించి.. ఖాళీ కడుపుతో తాగండి.

దాల్చినచెక్క

రక్తంలో చక్కెరను నియంత్రించడంలో దాల్చిన చెక్క చాలా సహాయపడుతుంది. దాల్చిన చెక్క కామోద్దీపనను పోగొట్టడానికి మంచిగా సహాయపడుతుంది. కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో అర చెంచా మెంతులు, పసుపు, దాల్చిన చెక్కలను మరిగించి ఆ నీటిని ఒక గ్లాసు తాగాలి. దాల్చినచెక్కను పౌడర్​ను కూడా వేసుకోవచ్చు.

అల్లం

యాంటీ డయాబెటిక్ పదార్థంగా అల్లం పనిచేస్తుంది. ఇందులో మధుమేహాన్ని నియంత్రించే గుణాలు చాలా ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది చక్కెర వేగవంతమైన వ్యాప్తిని తొలగిస్తుంది. మీరు అల్లం టీ తయారు చేసి.. ఉదయం ఖాళీ కడుపుతో తాగవచ్చు.

(ఈ పోస్ట్‌లో అందించిన సమాచారం ఆత్మాశ్రయమైనది. సమాచారం ఖచ్చితత్వాన్ని ధృవీకరించడానికి నిపుణుడిని సంప్రదించండి.)

టాపిక్

తదుపరి వ్యాసం