Reduce Blood Sugar : మధుమేహాన్ని ఇలా సింపుల్‌గా దూరం చేసుకోండి..
07 July 2022, 14:06 IST
- Reduce Blood Sugar : మధుమేహం రాకపోతే పర్లేదు కానీ.. వస్తే మాత్రం దాని వల్ల కలిగే ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు. చాలా మంది ఈ దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సమస్యను.. సింపుల్ పద్ధతిలో ఎలా జయించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహం ఇలా కూడా తగ్గించుకోవచ్చు
Reduce Blood Sugar : మధుమేహం భారతదేశంలో అత్యంత ఎక్కువగా ప్రబలుతున్న దీర్ఘకాలిక ఆరోగ్య వ్యాధులలో ఒకటి. దీని వలన కంటి సమస్యలు, మూత్రపిండాల వ్యాధులు, నరాలు దెబ్బతినడం, గుండె జబ్బులు వంటి సమస్యలు రావడం గురించి అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం చాలా అవసరం. మధుమేహం వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి డైట్ చేయాలి.. రాకుండా ఎలా మనల్ని మనం కాపాడుకోవాలనే విషయాలపై మనకు అవగాహన ఉండాలి. రోజువారీ జీవితంలో మార్పులతో మధుమేహాన్ని జయించవచ్చు అంటున్నారు వైద్యులు. వీటిని పాటించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
మధుమేహానికి ఆయుర్వేదం..
ఆయుర్వేద మూలికలు మధుమేహాన్ని తగ్గించడంలో కచ్చితంగా సహాయపడతాయి. ఉసిరి, జామున్ గింజలు, కాకరకాయ మిశ్రమంతో కూడిన రసాలు.. సహజంగా మీ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. అంతేకాకుండా ఈ రసాలు మీలోని శక్తి స్థాయిలను పెంచడంతో పాటు.. మెరుగైన జీవక్రియను అందిస్తాయి. మెరుగైన ఫలితాల కోసం.. ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించి.. తర్వాత మీరు వీటిని తీసుకోవాలని నిర్ధారించుకోండి.
ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం
ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం టైప్-2 మధుమేహం ఉన్నవారిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ప్రీ-డయాబెటిస్ ఉన్నవారు కూడా ఆరోగ్యకరమైన బరువును ఉంచుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా బరువు తగ్గడం వల్ల మధుమేహం వ్యాధి అభివృద్ధి చెందకుండా ఉంటుంది. బరువు తగ్గడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి.
మధుమేహం ఉంటే వ్యాయామం పక్కా చేయాల్సిందే..
ఈ బిజీ, చురుకైన జీవితాల్లో.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. రోజూ కనీసం గంట పాటు శారీరక శ్రమలు చేయడం మంచిది. మధుమేహం ముందస్తు ఆగమనాన్ని ఆలస్యం చేయడంలో వ్యాయామం సహాయపడుతుంది. మధుమేహమే కాదు హైపర్‌టెన్షన్, అధిక కొలెస్ట్రాల్ వంటి వాటిని దూరం చేసుకోవడంలో.. వ్యాయామం చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా హెల్తీ లైఫ్ కావాలనుకునేవారు వ్యాయామం చేయడమే మంచిది.
మధుమేహం ఉంటే.. నిద్రముఖ్యం..
మధుమేహం వల్ల చాలా మంది నిద్రలో సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి మెరుగైన నిద్రకోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాస్త ప్రశాంతంగా పడుకునేందుకు రూమ్‌ని సెట్ చేసుకోవాలి. పడుకునే ముందు కాసేపు మెడిటేషన్ చేయడం వల్ల నిద్ర వస్తుంది. వ్యాయామం చేయడం వల్ల కూడా నిద్ర బాగా వస్తుంది. సరైన నిద్రలేకపోతే.. డయాబెటీస్ ఉన్న వ్యక్తులకు దీర్ఘకాలిక నష్టాలు కలుగుతాయని అధ్యయనాలు నిరూపించాయి. కాబట్టి 8 గంటల నిద్ర అనేది చాలా ముఖ్యం.
మధుమేహానికి హెల్తీ ఫుడ్ అవసరం..
డయాబెటిస్‌తో బాధపడేవారు హెల్తీడైట్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల.. అది డయాబెటిక్‌తో బాధపడేవారిపై మంచి ప్రభావం చూపుతుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర రసాలు, కూల్ డ్రింక్స్, రెడ్ మీట్‌కు దూరంగా ఉండడమే మంచిది.
టాపిక్