తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sugar Exports | చక్కెర ఎగుమతులపై భారత్ ఆంక్షలెందుకు.. ద్రవ్యోల్బణమే కారణమా?

Sugar Exports | చక్కెర ఎగుమతులపై భారత్ ఆంక్షలెందుకు.. ద్రవ్యోల్బణమే కారణమా?

Anand Sai HT Telugu

30 May 2022, 7:55 IST

    • ఈ మధ్య కాలంలోనే.. గోధుమల ఎగుమతులను నిషేధించిన కేంద్రం తాజాగా చక్కెర ఎగుమతులపై కూడా పరిమితులు విధించింది. ఇలా ఆంక్షలు విధించేందుకు దారితీసిన పరిస్థితులేంటి?
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మెుదట గోధుమల ఎగుమతులపై భారత్ నిషేధం విధించింది. ఆ తర్వాత చక్కెర ఎగుమతిపై ఆంక్షలు పెట్టింది. జూన్ 1 నుంచి వ్యాపారులు విదేశాల్లో అమ్మకానికి అనుమతి పొందాల్సి ఉంటుంది. దేశీయ మార్కెట్‌లో కమోడిటీ లభ్యతను పెంచడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఇది ప్రాథమికంగా తీసుకున్న చర్య. ఇది అధిక ధరను తగ్గిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Porsche accident : ‘వ్యాసాలు రాయి..’ పోర్షేతో ఇద్దరిని చంపిన మైనర్​కి 15 గంటల్లోనే బెయిల్​!

Iran President : హెలికాప్టర్​లో ప్రయాణం.. ఆరోగ్యానికి హానికరం! నాడు సంజయ్​ గాంధీ- నేడు రైసీ..

Iran President Raisi death : హెలికాప్టర్​ ప్రమాదంలో ఇరాన్​ అధ్యక్షుడు రైసీ మృతి

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అనేక ఇతర ఇంధన ధరల కారణంగా ద్రవ్యోల్బణం కారణంగా దేశీయ మార్కెట్ల నిత్యావసరాల ధరలను తగ్గించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. 'DGFT జారీ చేసిన నివేదిక ప్రకారం, జూన్ 1, 2022 నుండి అక్టోబర్ 31, 2022 వరకు అమలులోకి చక్కెర ఎగుమతులపై ఆంక్షలు ఉంటాయి. తదుపరి ఆర్డర్ వచ్చే వరకూ.. నిర్దిష్ట అనుమతితో చక్కెర ఎగుమతి చేస్తారు.' అని నోటిఫికేషన్ వెలువడింది.

చక్కెర ఎగుమతులపై పరిమితులకు దారితీసిన కారణాలేంటి

గోధుమలు కాకుండా.. చక్కెర ఎగుమతిపై పూర్తి నిషేధం లేదు . జూన్ 1 నుంచి వ్యాపారులు విదేశాల్లో అమ్మకానికి అనుమతి పొందాల్సి ఉంటుంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారు. రెండవ అతిపెద్ద సరకు ఎగుమతిదారు. చక్కెర (ముడి, శుద్ధి, తెలుపు చక్కెర) ఎగుమతి జూన్ 1, 2022 నుండి పరిమితులు విధించిన కేటగీరిలోకి వెళ్తుంది. దేశీయ లభ్యతను కొనసాగించడానికి 100 LMT (లక్ష మెట్రిక్ టన్నులు) వరకు చక్కెరను ఎగుమతి చేయడానికి ప్రభుత్వం అనుమతించాలని నిర్ణయించింది. దేశీయ మార్కెట్‌లో చక్కెర లభ్యతను మెరుగుపరచడంతోపాటు ధరల పెరుగుదలకు చెక్ పెట్టేందుకు ఈ ఆంక్షలు విధించారు.

ఆహారం, చమురు ధరల పెరుగుదలతో భారతదేశం గత నెలలో రికార్డు ద్రవ్యోల్బణాన్ని చూసింది. దానిని నియంత్రించడానికి ఇలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ఠ స్థాయి 7.79 శాతానికి పెరిగిన సమయంలో చక్కెర ఎగుమతిని పరిమితం చేసే చర్య వచ్చింది.

భారతదేశం ఎంత చెరకును ఉత్పత్తి చేస్తుంది?

దేశంలో చక్కెర ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న మహారాష్ట్ర గత ఏడాది కంటే ఎక్కువగా 22 లక్షల హెక్టార్లలో సాగు చేసింది. 2021-22లో మంచి వర్షాల కారణంగా ఈ ప్రాంతంలో రికార్డు స్థాయిలో చెరకు సాగు జరిగింది. నివేదిక ప్రకారం, మహారాష్ట్ర 138 లక్షల టన్నుల చక్కెరను ఉత్పత్తి వస్తుంది. ఇది గత సంవత్సరం కంటే 30 శాతం ఎక్కువ. 2021-22 మార్కెటింగ్ సంవత్సరంలో ఇప్పటివరకు భారతదేశంలో చక్కెర ఉత్పత్తి 14 శాతం పెరిగి 34.2 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇది 35.5 మెట్రిక్‌ టన్నుల రికార్డును తాకుతుందని అంచనా.

ఈ సంఖ్య నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ (NFCSF) డేటా ప్రకారం.. 2020-21లో దేశంలో చక్కెర ఉత్పత్తి 31.1 MT(మెట్రిక్ టన్నులు)గా ఉంది. 2019-20లో చక్కెర ఉత్పత్తి 25.9 MT, 2018-19లో 32.2 MT, 2017-18 మార్కెటింగ్ సంవత్సరంలో 31.2 MTగా నమోదైంది. భారతదేశం మొదటిసారిగా ఏప్రిల్ 2022 వరకు 34.2 మిలియన్ టన్నుల నికర చక్కెర ఉత్పత్తిని సాధించింది. భారతదేశంలో చక్కెర హోల్‌సేల్ ధరలు క్వింటాల్‌కు రూ. 3,150-3,500 మధ్య ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రిటైల్ ధరలు కిలోకు రూ. 36-44 మధ్య ఉంది.

భారతదేశం ఎంత చక్కెరను ఎగుమతి చేస్తుంది?

వినియోగదారుల వ్యవహారాలు మరియు ఆహార పంపిణీ మంత్రిత్వ శాఖ ప్రకారం.. 2020-21లో 60 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం కంటే ఎక్కువగా 70 LMT ఎగుమతి జరిగింది. ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, UAE, మలేషియా, ఇతర ఆఫ్రికన్ దేశాలు ప్రధాన దిగుమతి దేశాలు. 2021-22లో భారతదేశ చక్కెర ఎగుమతులు 15 రెట్లు పెరిగి 70 లక్షల టన్నులకు చేరుకున్నాయి.

ప్రపంచంపై ప్రభావం

భారతదేశం ప్రధాన ఉత్పత్తిదారు, రెండవ అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్నందున ఎగుమతి పరిమితులు ప్రపంచ చక్కెర మార్కెట్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. భారతదేశం చక్కెర ఎగుమతి పరిమితులు అంతర్జాతీయ ధరలను పెంచుతాయి. అయితే, బలహీన దేశాలు, పొరుగు దేశాలకు ఎగుమతులను కొనసాగిస్తామని భారత్ తెలిపింది. ఎగుమతి నియంత్రణ ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపకూడదని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం