ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారా?.. ఈ హెల్తీ డ్రింక్స్‌ను తీసుకోండి-homemade drinks to cure fatty liver know details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Homemade Drinks To Cure Fatty Liver Know Details

ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారా?.. ఈ హెల్తీ డ్రింక్స్‌ను తీసుకోండి

HT Telugu Desk HT Telugu
Jul 25, 2022 11:27 PM IST

Drinks to Cure Fatty Liver: ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారా? అయితే ఈ ఆరోగ్యకరమైన పానీయాల తీసుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్‌ సమస్య నుండి బయటపడవచ్చు.

Effective Healthy Homemade Drinks to Cure Fatty Liver
Effective Healthy Homemade Drinks to Cure Fatty Liver

మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలలో కాలేయం ఒకటి. ఇది వ్యర్థాల నిర్వహణ, పోషక నియంత్రణ, ఎంజైమ్‌లతో సహా పలు రకాల విధులకు బాధ్యత వహిస్తుంది. ఇంకా, కాలేయం పిత్త రసాన్ని స్రవిస్తుంది, ఇది వివిథ జీవక్రియలో సహాయపడుతుంది. అందుకే మన మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాలేయం పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కాలేయంలో ఏర్పడే కొవ్వు వివిధ అనారోగ్యాలకు కారణమవుతుంది. కొన్ని జీవనశైలి మార్పులు కాలేయ కొవ్వు పేరుకుపోవడానికి దోహదం చేస్తాయి, దీంతో పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మద్యపాన అలవాట్లు కాలేయ కొవ్వు పెరగడానికి కారణమవుతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండడానికి ఆహారంలో చేర్చుకోవాల్సిన పదార్థాలు, డిటాక్స్ డ్రింక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్యాటీ లివర్ తగ్గడానికి 5 సూపర్-హెల్తీ డ్రింక్స్

ఉసిరి రసం: ఉసిరికాయలో చాలా పోషక విలువలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్, విటమిన్ సి ఇతర ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ మూలకాలు టాక్సిన్స్ తొలగించి కాలేయం ఆరోగ్యానికి సహాయపడతాయి. కాబట్టి, ఉదయం పూట ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల కాలేయంకు మేలు జరుగుతుంది. ఉసిరి రసం కాకుండా, రోజువారీ ఆహారంలో ఉసిరిని చేర్చుకోవడం వల్ల ఇతర అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

బీట్‌రూట్ జ్యూస్: బీట్‌రూట్ జ్యూస్ ఫ్యాటీ లివర్‌ తొలిగించడంలో సహాయపడుతుంది. ఇది ఈజీగా ఇంట్లో తయారుచేసుకునే బెస్ట్ డ్రింక్. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అవసరమైన ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులోని పోషకాలు కాలేయంలోని వ్యర్థాలను అదనపు కొవ్వును తొలగించే ప్రక్రియలను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

టర్మరిక్ టీ: పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, ఇది రక్త ప్రసరణకు సహాయపడుతుంది. లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పసుపు టీ తీసుకోవడం కాలేయానికి మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.

గ్రీన్ టీ: గ్రీన్ టీ కాలేయానికి ప్రయోజనకరంగా ఉంటుంది. వాటిలోని కాటెచిన్ క్యాన్సర్ కణాల అభివృద్ధిని నిరోధించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. గ్రీన్ టీని తీసుకునేటప్పుడు, అది అధిక నాణ్యతతో, ఇతర రసాయనాలు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎక్స్‌ట్రాక్ట్‌లు అదనపు కాలేయ నష్టాన్ని కలిగిస్తాయి.

కాఫీ: కాఫీ సాధారణంగా కాలేయ శుద్ది కోసం ఉపయోగపడే పానీయాలలో ఒకటి, రోజూ కాఫీ త్రాగే వ్యక్తులు దీర్ఘకాలిక కాలేయ వ్యాధి , ఫ్యాటీ లివర్ వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉంటుందని తేలింది.

WhatsApp channel

సంబంధిత కథనం