Higher Risk of Cancer : మహిళల కంటే పురుషులకే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువట
16 September 2022, 17:07 IST
- మహిళల కంటే పురుషులకే ఎక్కువ క్యాన్సర్ ప్రమాదముందని తాజా అధ్యయనాలు వెల్లిడిస్తున్నాయి. ధూమపానం, మద్యపానం, ఆహారం, ఇతర విషయాల్లోని వ్యత్యాసాలే దీని కారణమని ఓ అధ్యయనం నిరూపించింది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పీర్-రివ్యూడ్ జర్నల్ ఇన్ క్యాన్సర్‌లో విలే ఆన్‌లైన్‌లో ప్రచురించిన పరిశోధనలో ఫలితాలు ప్రచురించారు. ఇది క్యాన్సర్ ప్రమాదంలో లైంగిక వ్యత్యాసాల కారణాలను అర్థం చేసుకోవడం, నివారణ, చికిత్సను మెరుగుపరచడానికి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది.