Cabbage Gravy Curry Recipe । క్యాబేజీ గ్రేవీ కర్రీ.. రుచికరమైనది, ఆరోగ్యకరమైనది!
31 May 2023, 12:44 IST
- Cabbage Gravy Curry Recipe: క్యాబేజీని గ్రేవీలాగా ఎప్పుడైనా వండుకున్నారా? మీకోసం ఇక్కడ క్యాబేజీ గ్రేవీ కర్రీ రెసిపీని అందిస్తున్నాం, ఇలా ఒకసారి వండుకొని చూడండి, మళ్లీమళ్ళీ వండుకుంటారు.
Cabbage Gravy Curry Recipe
Healthy Recipes: క్యాబేజీ మనకు ఏ కాలంలోనైనా లభించే ఒక అద్భుతమైన వెజిటెబుల్. క్యాబేజీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ K, థయామిన్, నియాసిన్, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలతో పాటు ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. క్యాబేజీని తింటే జీర్ణక్రియకు తోడ్పడుతుందని, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, వాపును తగ్గించవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
సాధారణంగా మనం క్యాబేజీని కూరగా వండుకుంటాం లేదా ఫ్రైడ్ రైస్ వంటి వంటకాలలో ఉపయోగిస్తాం. అయితే క్యాబేజీని గ్రేవీలాగా ఎప్పుడైనా వండుకున్నారా? మీకోసం ఇక్కడ క్యాబేజీ గ్రేవీ కర్రీ రెసిపీని అందిస్తున్నాం, ఇలా ఒకసారి వండుకొని చూడండి, మళ్లీమళ్ళీ వండుకుంటారు.
Cabbage Gravy Curry Recipe కోసం కావలసినవి
- 1/2 కప్పు పప్పు (కందిపప్పు లేదా పెసరిపప్పు)
- 2 కప్పులు తరిగిన క్యాబేజీ
- 3 టేబుల్ స్పూన్లు చింతపండు
- 1/4 టీస్పూన్ పసుపు
- 1/4 కప్పు కొబ్బరి పాలు/ లేత కొబ్బరి
- 2 - 3ఎండుఎర్ర మిరపకాయలు (తక్కువ కారంగా ఉండేవి)
- 1/2 టీస్పూన్ జీలకర్
- 1 టేబుల్ స్పూన్ శనగపప్పు (బెంగాల్ గ్రాము)
- 2 స్పూన్ల నూనె/ నెయ్యి
- 1 రెమ్మ కరివేపాకు
- 1/2 టీస్పూన్ ఆవాలు
- 1 చిటికెడు ఇంగువ
క్యాబేజీ గ్రేవీ కర్రీ తయారీ విధానం
- ముందుగా చింతపండును పావు కప్పు వేడి నీటిలో నానబెట్టి పక్కన పెట్టండి. చల్లారాక చింతపండు మెత్తగా చేసి సిద్ధంగా ఉంచుకోవాలి.
- వంట ప్రారంభించే ముందు పప్పును కొన్నిసార్లు బాగా కడిగి, కుక్కర్ లో వేసి 2 కప్పుల నీరు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా అయ్యేలా ఉడికించుకోండి.
- ఈలోగా ఒక చిన్న పాన్‌లో శనగపప్పు, ఎండు మిర్చి వేసి సుగంధం వచ్చేవరకు వేయించాలి. అలాగే జీలకర్ర వేసి 30 సెకన్ల పాటు వేయించాలి.
- వేయించిన మసాలా దినుసులను చల్లబరిచి, గ్రైండర్‌లో వేయండి. ఇందులోనే లేత కొబ్బరి, కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి.
- ఇప్పుడు ఉడుకుతున్న పప్పులో క్యాబేజీ తురుము వేయండి, కలుపుతూ ఉడికించండి. ఆపై ఇందులో కొబ్బరి మసాలా పేస్ట్ వేసి కలిపి ఉడికించాలి.
- పప్పులో క్యాబేజీ ఉడికిన తర్వాత చింతపండు రసం, కొన్ని నీళ్లు, సరిపడా ఉప్పు వేసి ఉడికించుకోవాలి.
- ఇప్పుడు పాన్‌లో నెయ్యి లేదా నూనె వేడి చేసి, ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి.
- చివరగా ఈ పోపును క్యాబేజీలో కలిపేసి, స్టవ్ ఆఫ్ చేయండి.
అంతే, క్యాబేజీ గ్రేవీ కర్రీ రెడీ. అన్నంతో గానీ, రోటీతో గానీ తింటే అద్భుతంగా ఉంటుంది. తక్కువ నూనెతో క్యాబేజీ పప్పు ఎలా చేయాలో రెసిపీని ఈ లింక్ క్లిక్ చేసి చూడండి.