తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cabbage Vada Recipe । తక్కువ నూనెతో రుచికరంగా క్యాబేజీ వడలు, ఇలా చేయండి!

Cabbage Vada Recipe । తక్కువ నూనెతో రుచికరంగా క్యాబేజీ వడలు, ఇలా చేయండి!

HT Telugu Desk HT Telugu

02 March 2023, 12:43 IST

    • Cabbage Vada Recipe: ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా, సాయంత్రం స్నాక్స్‌గా అయినా తినడానికి , రుచికరంగా, ఆరోగ్యకరంగా క్యాబేజీ వడలు ఎలా చేసుకోవాలో చూడండి.
Cabbage Vada Recipe
Cabbage Vada Recipe (slurrp)

Cabbage Vada Recipe

క్యాబేజీ అనేది ఆకుకూర కలిగినటువంటి ఒక అద్భుతమైన కూరగాయ, ఇది ఏటా పెరుగుతుంది. ఇది బ్రాసికా కుటుంబానికి చెందిన క్రూసిఫరస్ కూరగాయల జాబితాలోకి వస్తుంది. క్యాబేజీలో డైటరీ ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, థియామిన్, నియాసిన్, ఫోలేట్‌ వంటి పోషకాలతో నిండి ఉంటుంది. దీనిని తినడం ద్వారా అధిక కొలెస్ట్రాల్ నియంత్రించుకోవచ్చు.

బ్రోకలీ, కాలీఫ్లవర్ కుటుంబానికి దగ్గరి సంబంధం కలిగి ఉండే క్యాబేజీని ప్రపంచవ్యాప్తంగా అనేక విధాలుగా వండుకుంటారు. క్యాబేజీతో అతి తక్కువ నూనెను ఉపయోగించి వడలు కూడా చేసుకోవచ్చు. బెంగళూరుకు చెందిన న్యూట్రిషనిస్ట్ సుకన్య పూజారి క్యాబేజీ వడ రెసిపీని తెలియజేశారు. క్యాబేజీ వడలు ఆరోగ్యకరంగా ఎలా చేయవచ్చో , ఈ కింద సూచనలు అనుసరించండి.

Cabbage Vada Recipe కోసం కావలసినవి

  • 1/2 క్యాబేజీ
  • 1/2 కప్పు మినపపప్పు
  • 1/2 కప్పు శనగపప్పు
  • 1/2 స్పూన్ నల్ల మిరియాలు
  • 1/2 స్పూన్ సోంపు
  • 1/2 స్పూన్ జీలకర్ర
  • 1/2 అంగుళం అల్లం
  • 2 పచ్చిమిర్చి
  • 1 ఉల్లిపాయ
  • 1 క్యారెట్
  • కొత్తిమీర
  • ఉప్పు రుచికి తగినంత

క్యాబేజీ వడలు తయారు చేసుకునే విధానం

  1. ముందుగా మినపపప్పు, శనగపప్పును శుభ్రం చేసి 4 నుండి 5 గంటలు నీటిలో నానబెట్టండి.
  2. ఇప్పుడు నానబెట్టిన పప్పులను ఒక మిక్సర్ జార్ లో తీసుకొని అందులో నల్ల మిరియాలు, సోంపు, జీలకర్ర వేసి పిండిగా రుబ్బుకోవాలి.
  3. ఇప్పుడు ఇందులో తరిగిన క్యాబేజీ, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర ఆకులు కలుపుకోండి.
  4. వడలు చేసుకునే విధంగా పిండిలో నీటిని సర్దుబాటు చేసుకోండి, రుచికి తగినట్లుగా ఉప్పును వేసి బాగా కలపండి.
  5. చివరగా ఎయిర్ ఫ్రై పాన్ మీద కొద్దిగా నూనెను బ్రష్ చేసి, 390 వేడిమీద 15 నిమిషాలు కాల్చుకోండి.

అంతే, క్యాబేజీ వడలు రెడీ. వీటిని అన్నంలో అయినా కలుపుకోవచ్చు, సాయంత్రం స్నాక్స్ లాగా తీసుకోవచ్చు.