Sweet Dosa: పిల్లల కోసం ఇలా స్వీట్ దోశ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు
04 April 2024, 6:00 IST
- Sweet Dosa: ఎప్పుడూ పెట్టే ఇడ్లీ, దోశలకు బదులు ఓసారి స్వీట్ దోశ పెట్టి చూడండి. పిల్లలకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు.
స్వీట్ దోశె రెసిపీ
Sweet Dosa: పెద్దలు బ్రేక్ ఫాస్ట్ విషయంలో రాజీపడగలరు. కానీ పిల్లల మాత్రం టేస్టీగా ఉంటేనే తినగలరు. ముఖ్యంగా ప్రతిరోజూ ఒకేలాంటి బ్రేక్ ఫాస్ట్‌లో పెడితే వారు ఇష్టంగా తినరు. అలాంటి వారి కోసం ఒకసారి ఇడ్లీ, మరోసారి ఉప్మా... ఇలా చేసినప్పుడు స్వీట్ దోశ ఓసారి ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేయడానికి కేవలం పది నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి అప్పటికప్పుడు దీన్ని చేసేయొచ్చు. స్వీట్ దోశ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
స్వీట్ దోశ రెసిపీకి కావలసిన పదార్థాలు
గోధుమపిండి - ఒక కప్పు
కొబ్బరి తురుము - అరకప్పు
నెయ్యి - ఒక స్పూన్
బెల్లం - 50 గ్రాములు
పాలు - అరకప్పు
బేకింగ్ పౌడర్ - చిటికెడు
యాలకుల పొడి - అర స్పూను
ఉప్పు - చిటికెడు
స్వీట్ దోశ రెసిపీ
1. ఒక గిన్నెలో గోధుమ పిండిని వేసి పాలు వేసి బాగా కలపండి.
2. బెల్లాన్ని నీటిలో వేసి నీళ్లల్లో కరిగేలా చేయండి.
3. ఆ నీటిని కూడా గోధుమ పిండిలో వేసి బాగా కలుపుకోండి.
4. అందులోనే నెయ్యి, యాలకుల పొడి, బేకింగ్ పౌడర్ కూడా వేసి బాగా కలపండి. చిటికెడు ఉప్పును కూడా వేయండి.
5. ఈ మిశ్రమం దోశ పిండిలా జారేలా చేయండి.
6. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేయండి.
7. ఈ మిశ్రమాన్ని దోశెల్లా వేయండి. రెండువైపులా కాల్చుకోండి.
8. ఒకవైపు తురిమిన కొబ్బరిని, కాస్త చక్కెర చల్లుకుంటే పిల్లలకు చాలా నచ్చుతుంది.
9. ఇది ఒక్కసారి పిల్లలు తిన్నారంటే ఇష్టంగా తింటారు.
ఇది కాస్త పలచగా వేస్తే క్రిస్పీగా, క్రంచీగా వస్తుంది. ఈ దోశను పిల్లలు తినేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి ఇది పిల్లలకు మీరు పెట్టి చూడండి. దీనిలో వాడినవన్నీ ఆరోగ్యానికి మంచివే. బెల్లం, యాలకులు, గోధుమపిండి, కొబ్బరి, పాలు ఇవన్నీ కూడా పిల్లల ఆరోగ్యానికి మేలు చేసేవే. బ్రేక్ ఫాస్ట్ లో ఐరన్ నిండిన ఇలాంటి ఆహారాన్ని పెట్టడం వల్ల వారు రోజంతా ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు. ఒకసారి ఈ బెల్లం దోశ వారికి తినిపించి చూడండి. వారు మళ్లీ మిమ్మల్ని చేయమని కచ్చితంగా అడుగుతారు.
టాపిక్