తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sunday Motivation : ఆలోచించింది చాలు.. ఇప్పుడు పనిపై ఫోకస్ చేయండి..

Sunday Motivation : ఆలోచించింది చాలు.. ఇప్పుడు పనిపై ఫోకస్ చేయండి..

20 November 2022, 6:54 IST

google News
    • Sunday Motivation : మీకు నిజమైన సంతోషం ఎప్పుడూ దొరుకుతుందో తెలుసా? గతాన్ని మరిచిపోయినప్పుడు.. రేపటి గురించి ఆలోచించనప్పుడు.. ప్రస్తుత క్షణంపై ఫోకస్ పెట్టినప్పుడు.. మీకు ప్రశాంతత, ఆనందం దొరుకుతాయి. గతం, రేపు అంటూ ఆలోచనలు మొదలైతే.. మీలో భయం, ఆందోళన ఎక్కువ అవుతాయి.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Sunday Motivation : మనలోని భావాలు, ఆలోచనలే మన భయాలు, మన ఆందోళనలు, మన శత్రువులు. ఎలా అంటే మన ఆనందాన్ని ఎవరో దూరం చేయాల్సిన అవసరం లేదు. మన ఆలోచనలతో మనమే హ్యాపీగా మన ప్రశాంతతను దూరం చేసుకుంటాము. అదేంటి అనుకుంటున్నారా? మీకు ఇతరుల వల్ల సమస్యలు నిజంగానే ఉండొచ్చు. కానీ మీరు వాటి గురించి ఆలోచించాల్సిన విధంగా కాకుండా ఓవర్ థింకింగ్ చేస్తే.. మిమ్మల్ని నాశనం చేయడానికి మీ శత్రువే అవసరం లేదు. మీకు మీరు చాలు.

అందుకే చాలా మంది మనల్ని ఫిజికల్​గా కాకుండా ఎమోషనల్​గా డిస్టర్బ్ చేస్తారు. ఎందుకంటే వాళ్లకి తెలుసు.. వీళ్లని మెంటల్​గా ఇబ్బంది పెడితే చాలు.. వాళ్లే దాని గురించి ఆలోచించుకుని.. వాళ్ల ప్రశాంతతను కోల్పోతారు. డిస్టర్బ్ అయ్యి.. పిచ్చిగా పిచ్చిగా చేసుకుంటూ.. ఇబ్బందులు పడతారు అనుకుంటారు. మీరు కూడా ఇలాంటి ఎమోషనల్ పర్సన్ అయితే.. ఇప్పుడైనా కాస్త అలెర్ట్ అవ్వండి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫిజికల్​గా తగిలే దెబ్బ కన్నా.. మెంటల్​గా తగిలే దెబ్బకే వయసు ఎక్కువ.

ఈ సమయంలో వీరులంతా చెప్పే మాట ఒక్కటే.. పదా ఈ క్షణాన్ని ఎంజాయ్ చేద్దాం అని. అదేనండి లివ్ ఇన్ మూమెంట్. అవును ఇదే మీ లైఫ్​లో బెస్ట్ టిప్. మీరు ఏదైనా సినిమా చూస్తున్నారా? అయితే మీ ఆలోచనలన్నీ పక్కన పెట్టి.. హ్యాపీగా సినిమా మీదనే ఫోకస్ చేయండి. పని చేస్తున్నారా? అయితే ఇతరల ఆలోచనలన్నీ మానేసి.. పనిపై ఫోకస్ పెట్టండి. ఒకవేళ మీ ఆలోచనల గురించి ఎప్పుడూ ఆలోచిస్తాము అనే ప్రశ్న మీలో మొదలైతే.. ముందు ఈ పనిపై ఫోకస్ పెడదాం. తర్వాత మీ ఆలోచనలపై ఫోకస్ పెడదాం అని మీ అంతరాత్మకు చెప్పండి. మీరు పాప్ కార్న్ తింటుంటే.. దాని ప్రశాతంగా ఎంజాయ్ చేయండి. బ్రెష్ చేస్తుంటే.. దానిపైనే శ్రద్ధ పెట్టండి. మీర ఇలా ఏ పని చేస్తే.. దాని మీద మాత్రమే ఫోకస్ ఉంచండి. అప్పుడు మీ మైండ్లో అనవసరమైన ఆలోచనలు పిలిచినా రావు.

మనం చేసే పనిపై ఎంత ఫోకస్ పెడితే.. మన ఆలోచనలు అంత తగ్గించుకోవచ్చు. దీనివల్ల దొరికే మనశ్శాంతి అంతా ఇంతా కాదు. మీరు చదువుకుంటున్నప్పుడు చదువు మీదే ఫోకస్ పెట్టారునుకో మంచి ఫలితాలు పొందుతారు. కానీ చదువుకుంటున్నప్పుడు.. ఆ మీమ్​ కింద వాడు ఎవడో భలే ఫన్నీగా కామెంట్ పెట్టాడు అని నవ్వుకుంటూ కుర్చుంటే.. మీ రిజల్ట్స్ మీరే మీమ్ వేసుకోవాల్సి వస్తాది. ఈరోజు సండే చాలా మందికి వీక్లీ ఆఫ్ ఉంటుంది. మీకు కూడా ఈరోజు సెలవే అయ్యి ఉండొచ్చు. కానీ అమ్మో రేపటినుంచి ఆఫీస్​కి పోవాలి. ఈరోజు తింటే రేపు ఇబ్బంది అయితాది. రేపు నేను మా టీఎల్​కి ఈ ప్రాజెక్ట్ సబ్మీట్ చేయాలి.. ఇలాంటి ఆలోచనలు ఉంటే.. నువ్వు నీ పని ఎప్పుడు చేస్తావు. నీ పని మీద నువ్వు ఫోకస్ పెడితే అది మీకు పెండింగ్​లో ఉండదు. అప్పుడు మీకు పని గురించి టెన్షన్స్ ఉండవు. నువ్వు చేయాల్సిన పనిపై నువ్వు ఫోకస్ చేయకపోవడం వల్లనే నువ్వు సెలవు రోజు కూడా పని గురించి ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి ఏ పని చేసినా.. ఆ పనిపై ఫోకస్ పెట్టడం నేర్చుకోండి. మీరు జీవితంలో మునుపెన్నడూ లేనంత ప్రశాంతంగా ఉంటారు.

తదుపరి వ్యాసం