Sunday Motivation : మిమ్మల్ని స్వార్థపరులు అనుకున్నా పర్లేదు.. మీ లక్ష్యంపై మీరు ఫోకస్ చేయండి..
Sunday Motivation : ఒక్కోసారి మన కోసం మనం ఎలా స్టాండ్ తీసుకుంటామో.. అలానే మనకోసం మనం సెల్ఫిష్‌గా మారాలి. అది తప్పేమి కాదు. మనపైన మనం దృష్టి పెట్టడం తప్పుకాదు. దాని అర్థం మీ విషయంలో మీరు దృఢ సంకల్పంతో, క్లారిటీతో ఉన్నారని అర్థం.
Sunday Motivation : కొన్నిసార్లు మనం ఇతరుల గురించి కాకుండా మనమీద మనం ఫోకస్ చేసుకోవాలి. అది ఎదుటి వాళ్లు సెల్ఫిష్ అనుకున్నా పర్లేదు. ఎందుకంటే నువ్వంటూ స్ట్రాంగ్‌గా ఉంటే.. ఎదుటి వాళ్లకి సహాయం చేయగలవు.. డిఫెండ్ కూడా చేయగలవు. మీ గురించి మీరు ఎంత క్లారిటీతో ఉన్నారో ఇలాంటి సందర్భాల్లోనే తెలుస్తాది. మీ లక్ష్యం మీకు తెలిస్తే.. విషయాలు మీకు అనుకూలంగా మారేలా మీరే చూసుకుంటారు. కాబట్టి దాని కోసం పని చేస్తూ ఉండండి.
బయట ఉండి చూసేవాళ్లకి ఇది అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్లు మీలా.. మీవైపు నుంచి ఆలోచించలేరు. కాబట్టి మీ మీద మీరు ఫోకస్ చేసుకుంటున్నప్పుడు ఎదుటివాళ్లు ఏమనుకుంటారో.. ఎలా ఆలోచిస్తారో అనే విషయాల గురించి ఎక్కువ ఆలోచించకపోవడమే మంచిది. వారు మీకు మంచి చేయకపోగా.. మీ దృష్టి మరల్చేలా చేసే అవకాశముంది.
సెలబ్రేటీలు చెప్తారు కదా.. మేము నెగిటివ్ కామెంట్స్, రూమర్స్ పట్టించుకోము. నవ్వుకుని వాటిని అక్కడే వదిలేస్తాము. వాళ్లు అనుకున్నంత మాత్రానా నిజం అయిపోవు కదా అంటారు. కొన్నిసార్లు మనం కూడా సెలబ్రెటీలాగా ఫీల్ అవ్వాలి. మనకి మనం తోపులని గుర్తించాలి. రూమర్స్‌ని, కామెంట్స్‌ని ఎక్కువ పట్టించుకోకూడదు. మనం పని మనం చేస్తే.. ఫలితాలు మనకు అనుకూలంగా వస్తాయి. ఒకవేళ రాకపోయినా.. నీ సినిమాకి నువ్వే హీరో లేదా హీరోయిన్. హిట్ అయినా కాకున్నా.. అది ఎప్పటికీ నీ సినిమానే. ఎప్పటికీ నీ కష్టమే. దాని నుంచి కొత్త విషయాలు నేర్చుకుని.. కొత్త సినిమా తీయడమే.
మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవాలనుకుంటున్నప్పుడు మీరు ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటే.. దానిని ఎప్పటికీ చేరుకోలేరు. ఉదాహరణకు మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలని సిన్సియర్‌గా ట్రై చేస్తున్నప్పుడు.. మీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ సినిమాకు తీసుకెళ్లలేదని లేదా రాలేదని గొడవ పెట్టుకుంటే మీరు దాని గురించి ఆలోచించి బుర్రపాడుచేసుకోవడం అవసరమా? కాదు కదా. కొన్ని చిల్లర విషయాలను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవడమే మంచిది. వేరే వాళ్లు ఈ విషయంలో మిమ్మల్ని సెల్ఫిష్ అనుకున్నా పర్లేదు. ముందు మీ లక్ష్యం చేరుకోవడమే మీకు కావాలి. ఆ లక్ష్యాన్నే మీరు చేరుకుంటే.. సినిమాకి వెళ్లడమేంటి.. ఆ సినిమా థియేటర్‌నే మీరు వారికి గిఫ్ట్‌గా ఇచ్చేయొచ్చు. మీ సొంత ఆనందం, ఉజ్వల భవిష్యత్తు కోసం తప్పా.. మీరు దేని గురించి ఆలోచించట్లేదని.. మీరు స్వార్థపరులని భావిస్తే.. అలా అనుకున్న వాళ్లు కూడా స్వార్థపరులే. ఎందుకంటే వాళ్లు తమ గురించి కూడా మీరే ఆలోచించాలి అనుకుంటున్నారు కాబట్టి.
సంబంధిత కథనం