తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Coconut Water For Skin : కొబ్బరి నీళ్లతో ముఖం కడిగితే.. తలతల మెరిసిపోతారు

Coconut Water For Skin : కొబ్బరి నీళ్లతో ముఖం కడిగితే.. తలతల మెరిసిపోతారు

HT Telugu Desk HT Telugu

01 April 2023, 12:45 IST

google News
    • Summer Skin Care Tips : వేసవిలో చల్లటి నీటితో మీ ముఖాన్ని కడుక్కుంటే.. హాయిగా ఉంటుంది. బయట నుంచి ఎండ వేడిలో వచ్చినప్పుడు ఇంట్లో కూల్ వాటర్ తో ఫేస్ వాష్ చేస్తే.. చల్లగా అనిపిస్తుంది. అయితే కొబ్బరి నీళ్లతో ముఖం కడిగినా.. చాలా ప్రయోజనాలు ఉంటాయి.
ముఖానికి కొబ్బరి నీరు
ముఖానికి కొబ్బరి నీరు

ముఖానికి కొబ్బరి నీరు

ఎండాకాలం బయట నుంచి వచ్చిన తర్వాత.. ముఖాన్ని నీటితో కడుక్కోవాలి. దీనివలన చాలా ప్రయోజనాలు ఉంటాయి. మీ ముఖాన్ని నీటితో శుభ్రపరచడం(Face Wash) వల్ల మొటిమల నివారణ, మచ్చలను తొలగించడం, మీ ఛాయను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా మీ చర్మ(Skin) రంధ్రాలను శుభ్రపరుస్తుంది. అయితే మీరు ముఖం కడుక్కొనేందుకు కొబ్బరి నీరు(Coconut Water)ను కూడా ఉపయోగించొచ్చు. ఎండాకాలంలో సాధారణంగా కనిపించే బ్లాక్‌హెడ్స్‌తో పాటు చెమటతో కూడిన చర్మాన్ని తొలగించడంలో కొబ్బరి నీరు ప్రభావవంతంగా ఉంటుందని మీకు తెలుసా?

కొబ్బరి నీళ్లతో రోజుకు రెండుసార్లు మీ ముఖాన్ని కడుక్కోవడం ద్వారా మీరు మీ చర్మాన్ని(Skin) మెరుగుపరుచుకోవచ్చు. మీ ముఖం కడగడానికి కొబ్బరి నీటి(Coconut Water)ని ఉపయోగిస్తే.. మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నీళ్లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి.. వేసవిలో ఉన్న టాన్‌(Summer Tan)ను కూడా తొలగించడంలో సహాయపడుతుంది

బీచ్ ట్రిప్ తరువాత, మీరు సన్ టాన్(Sun Tan) వదిలించుకోవడానికి కొబ్బరి నీరు, నిమ్మకాయ ద్రావణంతో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

వేసవిలో ఆయిల్ ఫేస్ కావడం, చెమటలు పట్టడం, రంధ్రాలు ఎక్కువగా మూసుకుపోవడం వల్ల మచ్చలు ఏర్పడతాయి. కొబ్బరి నీళ్ల(Coconut Water)లో మచ్చలను తొలగించే గుణాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో ఉండే యాసిడ్స్ గుర్తులను తేలికగా మార్చడంలో సహాయపడతాయి. తద్వారా మీ చర్మాన్ని క్లియర్ చేస్తుంది.

కొబ్బరి నీరు మాత్రమే మొటిమలకు చికిత్స చేయదు, వైద్యం ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడటానికి మీరు దానిని ఇతర చర్మ సంరక్షణ పదార్థాలతో కలపవచ్చు. మొటిమలు కూడా సాధారణ వేసవి చర్మ(Summer Skin Problems) పరిస్థితి కారణంగా రావొచ్చు. మొటిమల బారిన పడే చర్మం కోసం, కొబ్బరి నీరు, పసుపును కలిపి మాస్క్‌లా తయారు చేయండి.

కొబ్బరి నీరు డార్క్ స్పాట్స్ ని తొలగిస్తుంది. కొబ్బరి నీరు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, డిటాక్సిఫైయింగ్, ఇది చర్మంపై మొటిమల గుర్తులు, మచ్చలు, నల్ల మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.

కొబ్బరి నీళ్లు.. సన్‌బర్న్‌(Sun Burn)లను ఉపశమనం చేయడంతో పాటు, మినరల్స్ ఉంటాయి. ఇవి ఎండ వల్ల ఏర్పడే మచ్చలు పోగొట్టడంలో సహాయపడతాయి. మంటను తగ్గించడంలో సహాయపడటానికి, ఎర్రబడిన చర్మంపై కొంచెం కొబ్బరి నీటిని చల్లవచ్చు. కొబ్బరి నీళ్ళతో మీకు అలెర్జీ లేకపోతే చర్మానికి ఉపయోగించుకోవచ్చు. చర్మానికి వాడేందుకు సురక్షితమైనదిగా పరిగణిస్తారు.

తదుపరి వ్యాసం