Red Chilli Pickle । పండుమిర్చితో పచ్చడి.. అన్నంలో కలుపుకొని తింటే అదిరిపోతుంది!
14 November 2022, 21:04 IST
- పండుమిర్చితో పచ్చడి చేసుకొని, వేడివేడి అన్నంలో ఎర్రగా కలుపుకొని, కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఎలా ఉంటుంది? నోరూ ఊరుతుంది కదా? Red Chilli Pickle Recipe ఇక్కడ ఉంది, చేసుకొని కుమ్మేయండి.
Red Chilli Pickle
దక్షిణ భారతదేశంలో కారం ఎక్కువ తింటారు. అందులోనూ తెలుగు వారికి స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. పంచభక్ష్య పరమాన్నాలు వంటి ఏమి లేకపోయినా సరే, కేవలం వేడివేడి అన్నంలో కొంచెం అవకాయ, నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఫైవ్ స్టార్ హోటల్ రెసిపీలు కూడా పనికిరావు అనిపిస్తుంది. మనకు సంవత్సరం పొడవునా ఎన్నో రకాల పచ్చళ్లు, చట్నీలు, ఊరగాయలు అందుబాటులో ఉంటాయి. ఎన్నో ఫ్లేవర్లలో లభిస్తాయి. కాదేదీ చట్నీకి అనర్హం అన్నట్లుగా దేనితో అయినా మనవాళ్లు చట్నీలు చేసేస్తారు.
అయితే ఈ పికిల్స్ లలో చాలా మందికి మామిడికాయ, టొమాటో తర్వాత పండుమిర్చి పచ్చడి చాలా మంది ఇష్టంగా తింటారు. ఎర్రటి పండు మిరపకాయలతో మసాలా దినుసులు కలుపుకొని పచ్చడి చేసుకొని తింటే, అమృతం కూడా వద్దనిపిస్తుంది. అన్నంలో ఎర్రగా కలుపుకొని తింటే చూసే వారి నోరూ ఊరుతుంది. భోజనంలో సైడ్ డిష్‌గానూ ఆస్వాదించడానికి సరైనది. ఈ ఊరగాయ మీ ఆహారం రుచిని పెంచడమే కాకుండా మీ ఆకలిని రెట్టింపు చేస్తుంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా పండు మిర్చి పికిల్ ఎలా తయారు చేయడానికి ఏమేం కావాలి, ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. రెడ్ చిల్లీ పికిల్ రెసిపీ కింద చూడండి.
- 2 టేబుల్ స్పూన్లు ఆవాలు
-3 టేబుల్ స్పూన్లు సోంఫ్
-1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి
- 3 టేబుల్ స్పూన్లు యాలకుల పొడి
- 1 ఆవాల నూనె
- 2 టేబుల్ స్పూన్లు మెంతులు
-2 టేబుల్ స్పూన్లు జీలకర్ర
-7-8 నల్ల మిరియాలు
-1/4 టీస్పూన్ ఇంగువ
- 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం
పండు మిర్చి పచ్చడి రెసిపీ - తయారీ విధానం
- రెడ్ చిల్లీ పికిల్ తయారు చేయడానికి, ముందుగా ఎర్ర మిరపకాయలను కడిగి ఆరబెట్టండి.
- మరోవైపు పైన పేర్కొన్న మసాలా దినుసులన్నింటిని డ్రై రోస్ట్ చేసి, చల్లారిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి.
- ఈ మసాలా మిశ్రమానికి ఉప్పు, మసాలా పొడులు, నిమ్మరసం, సుమారు 4 టేబుల్ స్పూన్ల వేడి, చల్లటి ఆవాల నూనె వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు మిరపకాయలను తీసుకొని వాటి కాండం తొలగించండి, కారం వద్దనుకుంటే మిరప గింజలను తీసేయండి. ఇప్పుడు మిరపకాయ మధ్యలో కత్తితో ఒక చీలిక చేయండి.
- ఇంతకుముందు సిద్ధం చేసుకున్న మసాలా మిశ్రమాన్ని మిరపకాయలలో స్టఫ్ చేయండి.
- ఇప్పుడు ఈ మిరపకాయలను గాజు పాత్రలో ఉంచి, అందులో మిగిలిన ఆవాల నూనెను పోసేయాలి.
మూతపెట్టి 5-6 రోజుల తర్వాత తీసి చూడండి, ఘుమఘుమలాండే పండు మిర్చి ఊరగాయ సిద్ధం అవుతుంది. అన్నంలో కలుపుకొని తింటూ రుచిని ఆస్వాదించండి.