తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Crispy Chicken Pakodi Recipe। కరకలాడే క్రిస్పీ చికెన్ పకోడి, మాన్‌సూన్‌లో మనసారా తినండి!

Crispy Chicken Pakodi Recipe। కరకలాడే క్రిస్పీ చికెన్ పకోడి, మాన్‌సూన్‌లో మనసారా తినండి!

HT Telugu Desk HT Telugu

18 July 2023, 17:56 IST

google News
    • Crispy Chicken Pakodi Recipe: ఈ మాన్‌సూన్ అందరికీ తమకంటూ సొంత కథను వివరిస్తుంది, అద్భుతమైన రుచులను ఎన్నో పంచుతుంది. ఇక్కడ మీకోసం రుచికరమైన క్రిస్పీ చికెన్ పకోడి రెసిపీని అందిస్తున్నాం
Crispy Chicken Pakodi Recipe
Crispy Chicken Pakodi Recipe (istock)

Crispy Chicken Pakodi Recipe

Monsoon Recipes: ఋతుపవనాలు ఎల్లప్పుడూ ప్రకృతిలో అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. చల్లగా కురిసే చిటపట చినుకులు చూస్తూ ఆత్మీయులతో చెప్పుకునే కబుర్లు, అమ్మ చేసే వేడివేడి పకోడీలు తింటూ, మసాలా చాయ్ తాగుతూ ఎన్నో జ్ఞాపకాలను నెమరేసుకోవచ్చు. ఈ మాన్‌సూన్ అందరికీ తమకంటూ సొంత కథను వివరిస్తుంది, అద్భుతమైన రుచులను ఎన్నో పంచుతుంది. ఇక్కడ మీకోసం రుచికరమైన క్రిస్పీ చికెన్ పకోడి రెసిపీని అందిస్తున్నాం

చికెన్‌తో మనం చాలా రకాల వెరైటీలు చేయవచ్చు, ఎన్నో రకాల చికెన్ స్నాక్స్ మనకు అందుబాటులో ఉంటాయి. చికెన్‌ను వేయించండి, టాసు చేయండి, కాల్చండి, ఆవిరిలో ఉడికించండి, మీకు కావలసిన విధంగా వండుకొని తిన్నాకూడా టేస్టీగానే ఉంటుంది. అంతేకాకుండా ఈ మాంసంలో ప్రోటీన్‌ ఎక్కువగా ఉంటుంది, కొవ్వు తక్కువగా ఉంటుంది, సులభంగా జీర్ణమవుతుంది. ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ అందించిన క్రిస్పీ చికెన్ పకోడి రెసిపీని ఈ కింద చూడండి.

Crispy Chicken Pakodi Recipe కోసం కావలసినవి

  • 250 గ్రాముల బోన్ లెస్ చికెన్ బ్రెస్ట్
  • 1 టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్
  • 1 టీస్పూన్ నిమ్మరసం
  • 1/4 టీస్పూన్ పసుపు పొడి
  • 1 టీస్పూన్ ధనియాల పొడి
  • 1/2 టీస్పూన్ గరం మసాలా పొడి
  • 1/2 టీస్పూన్ కారం పొడి
  • 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పేస్ట్
  • 1/2 టీస్పూన్ చాట్ మసాలా
  • 1 టేబుల్ స్పూన్ మైదా పిండి
  • 2 టేబుల్ స్పూన్లు కార్న్‌ఫ్లోర్
  • రుచికి తగినంత ఉప్పు
  • 1 రెమ్మ కరివేపాకు
  • డీప్ ఫ్రై చేయడానికి నూనె

క్రిస్పీ చికెన్ పకోడి తయారీ విధానం

  1. ముందుగా ఒక గిన్నెలో చికెన్ ముక్కలను తీసుకొని శుభ్రంగా కడిగి ఉంచండి.
  2. అందులో అల్లం-వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కారం, కాశ్మీరి కారం పేస్ట్ చాట్ మసాలా, కరివేపాకు ఆకులు, కారం, మైదా పిండి, కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలపాలి. ఆపైన రుచికి సరిపడా ఉప్పు వేసి మళ్లీ కలపాలి.
  3. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రై చేయడానికి తగినంత నూనె వేడి చేయండి.
  4. నూనె వేడయ్యాక చికెన్ ముక్కలను వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు డీప్ ఫ్రై చేయండి.
  5. బాగా వేయించిన అనంతరం చికెన్ ముక్కలను ఒక గిన్నెలో పరిచిన శోషక కాగితంపై వేయండి, నూనె లేకుండా చేయండి.

అంతే, కారంగా కరకలాడే క్రిస్పీ చికెన్ పకోడి రెడీ. గ్రీన్ చట్నీతో వేడి వేడిగా వడ్డించండి.

తదుపరి వ్యాసం