Chicken Dosa Recipe । ఆదివారం రోజు చికెన్ దోశతో బ్రేక్‌ఫాస్ట్.. సూపర్ టేస్ట్!
04 June 2023, 6:30 IST
- Chicken Dosa Recipe: చికెన్ దోశ అనేది మంచి మసాలాలతో కూడిన ఫ్లేవర్‌ఫుల్ హై-ప్రోటీన్ దోశ. ఈ ఆదివారం చికెన్ దోశ రెసిపీని ప్రయత్నించండి.
Chicken Dosa Recipe
Protein-rich Breakfast Recipe: ఎక్కువ మంది ఇష్టపడే అల్పాహారాలలో దోశ అగ్రస్థానంలో ఉంటుంది. దోశల్లో ఎన్నో వెరైటీలు ఉంటాయి, సాదా దోశకు మసాలా స్టఫ్ చేసే రకాన్ని బట్టి దోశ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆలూ మసాలా దోశ, పనీర్ దోశ, ఎగ్ దోశ వంటివి చాలా సార్లు తినే ఉంటారు. ఈ ఆదివారం చికెన్ దోశ రెసిపీని ప్రయత్నించండి.
చికెన్ దోశ అనేది మంచి మసాలాలతో కూడిన ఫ్లేవర్‌ఫుల్ హై-ప్రోటీన్ దోశ. దీనినే కొన్ని చోట్ల చికెన్ కీమా దోశ అని పిలుస్తారు. ఈ దోశను తింటున్న కొద్దీ రుచికి స్పైసీగా, చికెన్ ముక్కలతో క్రంచీగా, అద్భుతంగా అనిపిస్తుంది. ఈ చికెన్ కీమా దోశ మీరు హెవీ బ్రేక్‌ఫాస్ట్, బ్రంచ్ లేదా డిన్నర్‌గా తినవచ్చు. చికెన్ దోశ ఎలా చేయాలో ఈ కింద సూచనలు చదవండి.
Chicken Dosa Recipe కోసం కావలసినవి
- దోశ పిండి
- 200 గ్రాముల చికెన్ కీమా
- 2 tsp కరివేపాకు
- 1 ఉల్లిపాయ
- 1/2 స్పూన్ జీలకర్ర
- 1 స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్
- 1 పచ్చిమిర్చి
- 1 స్పూన్ నల్ల మిరియాలు పొడి
- 1/2 స్పూన్ కారం పొడి
- 1/2 స్పూన్ పసుపు పొడి
- 1 స్పూన్ గరం మసాలా పొడి
- 1 స్పూన్ కొత్తిమీర
- 1 టేబుల్ స్పూన్ టమోటా ప్యూరీ
- ఉప్పు రుచికి తగినంత
- నూనె అవసరం మేరకు
చికెన్ కీమా దోశ తయారీ విధానం
- ముందుగా చికెన్ స్టఫింగ్ సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం ప్రెషర్ కుక్కర్‌లో నూనె వేడి చేసి కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి సుమారు 5 నిమిషాలు వేయించాలి.
- అనంతరం అల్లం-వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి ఉడికించాలి, ఆపై ఇతర మసాలాలు, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి బాగా కలపండి.
- ఇప్పుడు చికెన్ కీమా వేసి కొద్దిగా వేయించి, కొన్ని నీళ్లు పోసి, సుమారు 5 నిమిషాలు ఆవిరిలో ఉడికించాలి. పూర్తయిన తర్వాత ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి బదిలీ చేసి పక్కన పెట్టండి.
- ఇప్పుడు తవా వేడి చేసి కొద్దిగా నూనె చిలకరించి, దోశ వేయండి.
- దోశపై సుమారు 2 టేబుల్ స్పూన్ల చికెన్ మిక్స్ వేసి, స్ప్రెడ్ చేసి నెయ్యి కలపండి.
- మూతపెట్టి 4-5 నిమిషాలు ఉడికించాలి. క్రిస్పీగా కాల్చుకోవాలి.
అంతే, చికెన్ కీమా దోశ రెడీ. దీనిని నేరుగా తినవచ్చు లేదా టొమాటో ఆనియన్ చట్నీతో ఆస్వాదించవచు. చికెన్ కీమాను ఫిల్టర్ కాఫీతో సర్వ్ చేసుకుంటే ఆదివారం అల్పాహారం ప్రత్యేకంగా ఉంటుంది.