Baking Soda Benefits for Skin : బేకింగ్ సోడాతో బ్యూటీ హ్యాక్స్.. చర్మానికి, పెదవులకి చాలా బెస్ట్
19 January 2023, 11:00 IST
- Baking Soda Benefits for Skin : బేకింగ్ సోడా వంటలకే కాదండోయ్.. చర్మానికి కూడా చాలా మంచిది అంటారు. మెరిసే స్కిన్, పెదవులు కావాలి అనుకుంటే.. మీరు దానిని ఉపయోగించాల్సిందే అంటున్నారు. మరి దానిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బేకింగ్ సోడా బెనిఫిట్స్
Baking Soda Benefits for Skin : బేకింగ్ సోడాను సోడియం బైకార్బోనేట్ అని కూడా పిలుస్తారు. బేకింగ్ సోడా కుకీలు, కేక్‌లు, ఇతర వంటకాల్లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఇది చర్మ సంరక్షణ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇది చర్మంపై ఉన్న మురికిని తొలగించడానికి, దుర్వాసనలను కరిగించడానికి తేలికపాటి రాపిడి లేదా డియోడరైజర్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇది క్లియర్ స్కిన్ రివీల్ చేయడానికి, మొటిమలు, మచ్చలను తగ్గించడంలో గ్రేట్‌గా పనిచేస్తుంది. అయితే దీనిని ఎలా ఉపయోగించాలో.. ఎలా చేస్తే బేకింగ్ సోడా వల్ల కలిగే ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
మొటిమలతో పోరాడడానికై..
క్రిమినాశక, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండిన బేకింగ్ సోడా మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. నొప్పి, మంటను తగ్గిస్తుంది.
బేకింగ్ సోడాను కొద్దిగా నీళ్లతో కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి. మీ ముక్కు, మీకు బ్లాక్‌హెడ్స్, మొటిమలు, వైట్‌హెడ్స్ ఉన్న ఇతర ప్రాంతాలపై ఆ పేస్ట్‌ను మసాజ్ చేయండి.
రెండు మూడు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మీ ముఖాన్ని ఆరనిచ్చి.. నాన్-కామెడోజెనిక్ మాయిశ్చరైజర్‌తో ముగించండి.
పిగ్మెంటేషన్ తొలగించడానికై..
మెడ చుట్టూ ఎక్కువగా పిగ్మెంటేషన్ ఉంటుంది. నేచురల్ స్కిన్ లైటెనర్ అయిన బేకింగ్ సోడా పిగ్మెంటేషన్‌ను తొలగించి.. మీ చర్మాన్ని కాంతివంతం చేసి ప్రకాశవంతం చేస్తుంది. ముఖ్యంగా మెడ, మోచేయి, మోకాలి ప్రాంతాల్లో నల్ల మచ్చలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది.
బేకింగ్ సోడా, నీటిని కలిపి ఒక రన్నీ పేస్ట్‌లో కలపండి. దానిని మీ మెడపై అప్లై చేసి.. శుభ్రం చేయండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి..
బేకింగ్ సోడా మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది. మీ రంధ్రాల పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడి.. మురికిని వదిలిస్తుంది. చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది.
మీరు బేకింగ్ సోడాను ఒక కప్పు నీటిలో కలపి టోనర్‌గా ఉపయోగించవచ్చు. సున్నితమైన క్లెన్సర్‌తో మీ ముఖాన్ని కడుక్కుని.. బేకింగ్ సోడా మిక్స్‌ను మీ ముఖంపై చల్లుకోండి. అది ఆరిన తర్వాత.. మాయిశ్చరైజర్ అప్లై చేయండి.
మెరిసే పెదాలకై..
మీ పెదవులు ఎల్లవేళలా పొడిగా, పగిలినట్లు, పొరలుగా అనిపిస్తే.. బేకింగ్ సోడా మీకు హెల్ప్ చేస్తుంది. మీ పెదవులని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. వాటిని మృదువుగా, గులాబీ రంగులోకి మార్చుతుంది.
బేకింగ్ సోడా, నీటిని కలపండి. మందపాటి, క్రీము పేస్ట్ తయారు చేయండి. దీన్ని మీ పెదాలపై రెండు మూడు నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. అనంతరం లిప్ బామ్ రాయండి.
మెరిసే చర్మాన్ని పొందండి
క్లెన్సింగ్, ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలతో నిండిన బేకింగ్ సోడా మలినాలను, చనిపోయిన చర్మ కణాలను తొలగించి.. మీకు స్పష్టమైన, మృదువైన, ప్రకాశవంతమైన చర్మాన్ని అందించడంలో సహాయపడుతుంది.
బేకింగ్ సోడా, ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేసి ఈ పేస్ట్ ని మీ ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే ఫలితాలు మీరే చూస్తారు. ఈ మిక్స్‌లోని నారింజ మీ చర్మానికి కొల్లాజెన్ బూస్ట్‌ని కూడా ఇస్తుంది.
టాపిక్