తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Celebrities Natural Skin Care : బాలీవుడ్ సెలబ్రెటీల బ్యూటీ చిట్కాలు..

Celebrities Natural Skin Care : బాలీవుడ్ సెలబ్రెటీల బ్యూటీ చిట్కాలు..

06 January 2023, 12:41 IST

google News
    • Celebrities Natural Skin Care : అబ్బా సెలబ్రెటీలు ఎంత అందంగా ఉంటారు. వాళ్లు పార్లర్​, బ్యూటీ ట్రీట్​మెంట్, స్కిన్ తీసుకుంటారు కాబట్టి.. వాళ్ల చర్మం అంత తాజాగా ఉంది అనుకుంటాము. అయితే వాళ్లు కూడా సహజమైన మార్గాలలో తమ స్కిన్​ని రక్షించుకుంటాము అంటున్నారు.
జాన్వీ స్కిన్ కేర్
జాన్వీ స్కిన్ కేర్

జాన్వీ స్కిన్ కేర్

Celebrities Natural Skin Care : మెరిసే చర్మాన్ని పొందడానికి సహజమైన మార్గాల కోసం మీరు ఇంటర్నెట్‌ను స్క్రోల్ చేయడంలో మీరు బిజీగా ఉన్నారా? అయితే ఇక చూడకండి. మీకు ఇష్టమైన నటీమణులు మీకు కొన్ని సహజమైన బ్యూటీ చిట్కాలను షేర్ చేసుకుంటున్నారు. వాటితో మీరు కూడా మీ స్కిన్​ని తాజాగా, మెరిసేలా కాపాడుకోండి.

తేనెతో..

తేనెపై కరీనా కపూర్ ఖాన్‌కు ఎనలేని ప్రేమ ఉంది. ఫేషియల్ చేయించుకోవడానికి మీరు అప్పుడప్పుడు సెలూన్‌కి వెళ్తారు. కాస్ట్ ఎక్కువగా ఉన్నా.. లేక మీకు వెళ్లడం కుదరకపోయినా ప్రత్యామ్నాయంగా ఏమి చేస్తారు? అయితే కరీనా కపూర్ ఖాన్ ఫేషియల్‌కు ప్రత్యామ్నాయంగా తేనెను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. తేనెలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మీ చర్మ సంరక్షణకు బాగా సహాయపడతాయి.

ముల్తానీ మట్టి..

అలియా భట్ ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్‌లతో తన చర్మాన్ని కాపాడుకుంటున్నట్లు చాలా సార్లు తెలిపింది. తన చర్మాన్ని పునరుద్ధరించడానికి ముల్తానీ మట్టిపై ఆధారపడతానని వోగ్​కి ఇచ్చిన ఇంటర్వూలో తెలిపింది. మొటిమలు వచ్చే చర్మం ఉన్నవారికి ఇది మంచి ఇంటి నివారణ అని మీకు తెలుసా? అయితే పొడి చర్మం ఉన్నవారికి ఇది పని చేయకపోవచ్చు. దీన్ని ప్రయత్నించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం ఉత్తమం.

మంచి నీటితో..

దీపికా పదుకొణె హైడ్రేషన్ ఫార్ములాను మీరు కూడా ఫాలో అయిపోవచ్చు. 'మీకు మెరిసే చర్మం కావాలంటే ఎక్కువ నీరు తాగండి'. ఈ మాటను మీరు ఎన్నోసార్లు విని ఉండొచ్చు. దీపికా పదుకుణె కూడా మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి, చర్మాన్ని అందంగా ఉంచడానికి ప్రతిరోజూ తగినంత నీరు తాగండి. దీని కంటే మెరుగైనది ఏమీ లేదు అంటుంది దీపికా.

వెన్నతో..

చర్మం కోసం జాన్వీ కపూర్ వెన్న, పెరుగుని ఎక్కువగా ఉపయోగిస్తానని తెలుపుతూ.. ఓ వీడియో చేసింది. చాలా మంది భారతీయులు ప్రేమ, ద్వేషపూరిత సంబంధాన్ని కలిగి ఉండే పదార్ధం మలై. దీనినే మిల్క్ క్రీమ్ అని కూడా పిలుస్తారు. మలై చర్మాన్ని తేమ చేస్తుంది. దీనిని రెగ్యులర్​గా ఉపయోగించడం వల్ల డార్క్ స్పాట్‌లను కూడా తొలగించుకోవచ్చు. చర్మం పిగ్మెంటేషన్‌తో పోరాడడంలో ఇది మీకు సహాయపడుతుంది.

అరటిపండుతో..

రకుల్ ప్రీత్ సింగ్.. కాంతివంతంగా కనిపించే చర్మం కోసం అరటిపండు ఫేస్ మాస్క్ ఉపయోగిస్తానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అర టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక చెంచా తేనెతో మెత్తని అరటిపండును ఒక గిన్నెలో కలపండి. దీన్ని చర్మంపై సున్నితంగా అప్లై చేసి ఆరనివ్వండి. మీరు ఈ ఫేస్ మాస్క్‌ని ప్రయత్నించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి.

తదుపరి వ్యాసం