తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Skin Care Tips : ముఖంపై నల్లటి మచ్చలు పోయేందుకు ఇంట్లోనే ఇలా సింపుల్ ట్రిక్స్ పాటించండి

Skin Care Tips : ముఖంపై నల్లటి మచ్చలు పోయేందుకు ఇంట్లోనే ఇలా సింపుల్ ట్రిక్స్ పాటించండి

Anand Sai HT Telugu

22 April 2024, 15:30 IST

google News
    • Skin Care Tips In Telugu : ముఖంపై నల్లటి మచ్చలు ఉంటే చూసేందుకు బాగుండదు. అందుకే వాటిని తొలగించేందుకు ఇంట్లోనే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించాలి.
ముఖంపై నల్లటి మచ్చలు తొలగించేందుకు చిట్కాలు
ముఖంపై నల్లటి మచ్చలు తొలగించేందుకు చిట్కాలు (Unsplash)

ముఖంపై నల్లటి మచ్చలు తొలగించేందుకు చిట్కాలు

ముఖ సౌందర్యాన్ని పాడుచేసే కళ్లకింద నల్లటి వలయాలు, ముఖంపై నల్లటి మచ్చలు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి. ఇంతకుముందు వృద్ధులకు మాత్రమే ఉండే ఈ సమస్య ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా స్త్రీ, పురుషులు అందరూ ఎదుర్కొంటున్నారు. ల్యాప్‌టాప్, మొబైల్ వంటి వాటిని ఎక్కువ సేపు వాడడం, పనిభారం వల్ల నిద్ర లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల ఈ సమస్యలు ఏర్పడతాయి.

మానసిక ఒత్తిడి, హార్మోన్ల సమస్యలు, అలర్జీలు, డీహైడ్రేషన్ కూడా కళ్ల కింద నల్లటి వలయాలకు కారణమవుతాయి. ముఖం మీద నల్లటి మచ్చలు కూడా ఇబ్బందిగా అనిపిస్తాయి. ఈ కింది చిట్కాలను అనుసరించి మీరు ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

కొబ్బరి నూనెతో మసాజ్

కళ్ల కింద ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడితే ముఖం దెబ్బతింటుంది. ఒత్తిడి, నిద్ర లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల ఇవి సంభవిస్తాయి. వీటిని పోగొట్టాలంటే కొబ్బరినూనె లేదా బాదం నూనెతో కళ్ల కింద మృదువుగా మసాజ్ చేయాలి. ఇలా రోజూ చేస్తే ఫలితం ఉంటుంది. టొమాటో రసానికి నిమ్మరసం మిక్స్ చేసి కళ్ల కింద మసాజ్ చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

బంగాళదుంప ముక్కలు

బంగాళదుంపలను మెత్తగా లేదా ముక్కలుగా చేసి కళ్లపై పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలను సులభంగా తగ్గించుకోవచ్చు.

పాలతో ముఖంపై రాయండి

పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ డార్క్ స్కిన్ టోన్ ను తొలగిస్తుంది. కళ్ల కింద నల్లటి వలయాలను కూడా పొగొడుతుంది. అలాగే ఇందులో ఉండే పొటాషియం చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని కోసం పాలను దూదిలో నానబెట్టి కళ్ల చుట్టూ ఉన్న ప్రాంతాలకు పట్టించాలి. అలాగే 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

బాదం నూనె

బాదం నూనెలో మెగ్నీషియం, కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు డి, ఎ, ఇ మొదలైనవి ఉంటాయి. చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. బాదం నూనెను పాలు లేదా రోజ్ వాటర్‌లో మిక్స్ చేసి, నిద్రపోయే ముందు బ్లాక్ హెడ్స్ ఉన్న ముఖానికి అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత వీటిని నీటితో కడిగేస్తే తొలగిపోతుంది.

రోజ్ వాటర్

రోజ్ వాటర్ చర్మ సమస్యలకు నివారణగా కూడా ఉపయోగపడుతుంది. ఈ రోజ్ వాటర్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి తాజాగా ఉంటాయి. రోజ్ వాటర్‌లో ముంచిన కాటన్ క్లాత్‌ని ఉపయోగించండి. కావాల్సిన ప్రదేశంలో ఉంచండి. ఇలా 15-20 నిమిషాల పాటు చేయాలి. రోజూ చేయడం వల్ల నల్లటి వలయాలు సులభంగా తొలగిపోతాయి.

దోసకాయ రసం

దోసకాయ రసంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కిన్ ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో సహాయపడతాయి. దోసకాయను కొద్దిగా తురుమి, దాని రసాన్ని తీయండి. తర్వాత కళ్ల కింద నల్లటి వలయాలపై అప్లై చేయాలి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడిగేయండి.

తదుపరి వ్యాసం