తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Remedies For Cough। దగ్గు, గొంతునొప్పి ఇబ్బంది పెడుతున్నాయా? ఇవిగో చిట్కాలు!

Remedies for Cough। దగ్గు, గొంతునొప్పి ఇబ్బంది పెడుతున్నాయా? ఇవిగో చిట్కాలు!

HT Telugu Desk HT Telugu

03 August 2024, 22:05 IST

google News
    • Remedies for Cough and Sore Throat: కొన్ని ఇంటి చిట్కాలతో పొడి దగ్గు,  గొంతు నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకోండి.
Remedies for Cough and Sore Throat:
Remedies for Cough and Sore Throat: (istock)

Remedies for Cough and Sore Throat:

Remedies for Cough and Sore Throat: ఈ వానాకాలం అసలు వానాకాలంలా లేదు, కురిస్తేనేమో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లేదంటే వాతావరణం పూర్తిగా పొడిగా మారుతుంది. దీంతో ఈ సీజన్‌లో విలక్షణమైన అనేక రకాల అనారోగ్యాలు వస్తున్నాయి. వీటిలో ఒకటి పొడి దగ్గు కూడా ఒకటి. సాధారణంగా ఈ సమయంలో దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ చిన్న చిన్న సమస్యలు త్వరగా తొలగిపోయినప్పటికీ, పొడి దగ్గుతో కలిగే గొంతు నొప్పి అలాగే కొనసాగుతుంది. మీకు ఆస్తమా, సిగరెట్ పొగ వంటి అలవాట్లు ఉంటే ఈ పొడి దగ్గు మరింత ఇబ్బంది పెడుతుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకోండి.

అల్లం

అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శ్వాసనాళాల్లోని పొరలను సడలించడంతోపాటు దగ్గును తగ్గిస్తాయి. ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది, కఫం ఉత్పత్తిని తగ్గిస్తుంది. అల్లం టీ తాగడం, అల్లం మురబ్బా, ఒక చిన్న ముక్క అల్లం వల్ల దగ్గు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

పసుపు

పసుపు మీకు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీరంపై గాయాలను నయం చేయగలదు. పసుపులో యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. పసుపు టీ తాగడం, పసుపు నీళ్లతో ఆవిరిపట్టడం ద్వారా ఇది దగ్గు, జలుబు, ఫ్లూ వంటివి నివారించడంలో తోడ్పడుతుంది. పసుపును ఆయుర్వేద శ్వాసకోశ మందులను రూపొందించడానికి ఉపయోగిస్తారు.

తులసి ఆకులు

దీర్ఘకాలిక దగ్గును అంతం చేసే అనేక యాంటీ బాక్టీరియల్ లక్షణాలను తులసి ఆకులు కలిగి ఉంటాయి. కొన్ని తులసి ఆకులను తీసుకొని వాటిని ప్రతిరోజు నములుతుండటం వల్ల మీ దగ్గును నియంత్రించవచ్చు.

తేనె

తేనెలో చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది గొంతు నొప్పిని తగ్గించే యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. పొడి దగ్గుకు చికిత్స చేయడానికి తేనే మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా తేనె కలుపుకొని తాగితే గొంతు మృదువుగా మారుతుంది.

వెల్లుల్లి

వెల్లుల్లిలో యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇది దగ్గు, జలుబుకు చికిత్స చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తపోటు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.

ఉప్పు నీటితో పుక్కిలించండి

ఉప్పు నీరు ఒక యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ ద్రావణంగా పనిచేస్తుంది. వీటిలోని గుణాలు శ్లేష్మం క్లియర్ చేయడం లేదా తగ్గించడంలో సహాయపడతాయి, అదే సమయంలో గొంతు అసౌకర్యాన్ని కూడా తగ్గించవచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ ఉప్పును కలిపి, ఆ నీటితో రోజులో కనీసం రెండుసార్లు గొంతును గరగరలాడించండి.

ఆయుర్వేద మూలికలతో ఆవిరి

ఆవిరి దగ్గు, జలుబును నయం చేయడంలో సహాయపడుతుంది. మూసుకుపోయిన ముక్కును శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. ఒక లోతైన గిన్నెలో నీటిని మరిగించి, ఆపై ఆ నీటిని తీసుకొని అందులో యూకలిప్టస్ ఆయిల్ కలిపి ఆవిరిని పీల్చుకోండి. కనీసం 10 నిమిషాల పాటు ఆవిరి తీసుకుంటే చాలా రిలీఫ్ ఉంటుంది.

తదుపరి వ్యాసం