Reverse Liver Disease | లివర్ డ్యామేజ్ అయిందా? ఇవి తింటే రిపేర్ అవుతుంది!
04 May 2023, 13:42 IST
- Reverse Liver Disease: కొన్ని ఆహార పదార్థాలు రోజూ తినడం ద్వారా దెబ్బతిన్న కాలేయానికి సంబంధించిన వైద్య ప్రక్రియను మెరుగుపరుస్తాయి. వాటిలో 4 ఇక్కడ తెలుసుకోండి.
Reverse Liver Disease
Liver Diseases: మీ ఆహారపు అలవాట్ల వల్లనే మీ కాలేయ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వలన కాలేయంలో వాపు ఏర్పడుతుంది. దీనినే ఫ్యాటీ లివర్ వ్యాధిగా పేర్కొంటారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) కాగా, మరొకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. కొవ్వు పదార్థాలను అధికంగా తీసుకోవడం వలన నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ సంభవిస్తుంది. మరోవైపు, ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ అనేది ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల వచ్చే పరిస్థితి. ఆల్కహాల్‌ను విచ్ఛిన్నం చేసేటప్పుడు కాలేయం విష పదార్థాలను విడుదల చేస్తుంది, ఇది అవయవ కణాలను దెబ్బతీస్తుంది, మంటను కలిగిస్తుంది. వీటిని చికిత్స చేయకపోతే అది కాలేయం వాపు క్యాన్సర్ లేదా సిర్రోసిస్‌కు దారితీస్తుంది. ఇది కాలేయం పూర్తిగా నాశనం అయిన పరిస్థితి.
నివేదికల ప్రకారం, భారతదేశంలో మద్యం అలవాటు లేని వారు కూడా 9% నుండి 32% వరకు వయోజనులు కాలేయ కొవ్వు వ్యాధిని కాలిగి ఉన్నారు. అన్ని వయసుల వ్యక్తులు ఆల్కహాలిక్ లేని ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడవచ్చు. కానీ, ఊబకాయం, టైప్ 2 మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, PCOS, స్లీప్ అప్నియా, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి అనారోగ్య పరిస్థితులను కలిగి ఉన్నవారు త్వరగా కాలేయ వ్యాధికి గురవుతారు. కాలేయ వ్యాధిన కలిగి ఉన్న రోగుల్లో ఎక్కువగా 40 నుంచి 50 ఏళ్ల వయసు గలవారు ఉన్నారు.
సాధారణంగా, ఈ కాలేయ వాపు వ్యాధి ఎటువంటి లక్షణాలను కలిగించదు. అయితే కొందమంది మాత్రం ప్లీహములో వాపు, పొత్తికడుపు వాపు, రక్తనాళాల వాపు, ముఖంలో వాపు, చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడం, అరచేతులు ఎర్రగా మారినటువంటి లక్షణాలను కనబరుస్తారు.
Ingredients To Reverse Liver Disease
హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జిందాల్ నేచర్‌క్యూర్ ఇన్‌స్టిట్యూట్ అసిస్టెంట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షణ్ముగం మాట్లాడుతూ.. కొన్ని ఆహార పదార్థాలు దెబ్బతిన్న కాలేయాన్ని బాగుచేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని వెల్లడించారు. రోజూవారీ ఆహారంలో వాటిని తీసుకుంటే కాలేయ వైద్య ప్రక్రియలో సానుకూల ఫలితాలు అందిస్తాయని డాక్టర్ షణ్ముగం హైలైట్ చేసారు. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.
పసుపు
తాజా పసుపులో ఉండే కర్కుమిన్ తగిన విధంగా తీసుకునప్పుడు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) నుండి కాలేయ కణాలను రక్షించడంలో సహాయపడుతుంది.
దాల్చిన చెక్క
దాల్చినచెక్కలో బలమైన శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి, ఇవి కాలేయంలో మంటను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.
ఉసిరి
ఉసిరి లేదా ఇండియన్ గూస్‌బెర్రీలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి నిండుగా ఉంటాయి. ఇవి కాలేయం దెబ్బతినకుండా కాపాడటమే కాకుండా, టాక్సిన్స్‌ను శుభ్రపరుస్తాయి.
ఆపిల్ సైడర్ వెనిగర్
ఇంటి నివారణల విషయానికి వస్తే, ఆపిల్ సైడర్ వెనిగర్ అద్భుతమైన నిర్విషీకరణ (Detoxing) లక్షణాలను కలిగి ఉన్నందున ఇది సరైన రీతిలో తీసుకోవాలి. యాపిల్ సైడర్ వెనిగర్ స్వీకరిస్తే, అది కాలేయం, శరీరం సాధారణ పనితీరుకు అంతరాయం కలిగించే టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది.