తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beetroot Side Effects: ఇలాంటి సమస్యలు ఉన్నవారు బీట్‌రూట్ అసలు తినకూడదు!

Beetroot Side Effects: ఇలాంటి సమస్యలు ఉన్నవారు బీట్‌రూట్ అసలు తినకూడదు!

HT Telugu Desk HT Telugu

29 August 2022, 19:33 IST

google News
    • బీట్‌రూట్ తినడం వల్ల లాభాలే కాదు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రత్యేక లక్షణాలతో బాధపడుతున్నవారు బీట్‌రూట్ తినకూడదు. అయితే ఎలాంటి సమయాల్లో బీట్‌రూట్ తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం
Beetroot Side Effects:
Beetroot Side Effects:

Beetroot Side Effects:

రక్త హినత సమస్యతో బాధపడేవారికి బీట్‌రూట్‌ను తినమని వైద్యులు సూచిస్తుంటారు. బీట్‌రూట్‌లో పుష్కలంగా ఫైబర్‌లు ఉంటాయి, ఇవి పొట్టను శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారు బీట్‌రూట్‌, క్యారెట్‌ జ్యూస్‌ తయారు చేసి తాగడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. రోజు ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి సహజమైన షుగర్ అందడంతో పాటు బీపీ అదుపులో ఉంటుంది. బీట్‌రూట్‌లో పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6 వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యంగా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడుతాయి. ఇందులో ఉండే ఐరన్‌ రక్తహినతను తగ్గిస్తుంది. అయితే బిట్ రూట్ తినడం వల్ల ఉపయోగాలే కాదు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

అలెర్జీ: బిట్ రూట్‌లో అనేక ఆరోగ్య లక్షణాలు ఉన్నప్పటికీ, అయితే కొంత మంది వ్యక్తులు వాటిని తినడం వల్ల కొన్ని నష్టాలు జరుగుతాయి. బీట్‌రూట్ తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు, అలెర్జీ సమస్యలు వస్తాయి.

రక్తపోటు: తక్కువ రక్తపోటు ఉన్న రోగులు బీట్‌రూట్ తీసుకుంటే, అది మీ రక్తపోటును మరింత తగ్గిస్తుంది. నిజానికి, దుంపలు సహజంగా అధిక స్థాయి నైట్రేట్‌లను కలిగి ఉంటాయి, వీటిని జీర్ణవ్యవస్థ నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుస్తుంది. ఇవి రక్త నాళాలను విస్తరిస్తుంది, ఇది రక్తపోటును మరింత తగ్గిస్తుంది. అందువల్ల, తక్కువ రక్తపోటు సమస్యతో బాధపడేవారు బీట్‌రూట్‌కు దూరంగా ఉండాలి.

స్టోన్ పేషెంట్లు- ఆక్సలేట్ కలిగి ఉండే వ్యక్తుల్లో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. రాళ్లు ఉన్నవారు బీట్‌రూట్ తినడం హానికరం. వాస్తవానికి, బీట్‌రూట్‌లో ఆక్సలేట్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది, దీని కారణంగా మూత్రపిండాల్లో రాళ్ల సమస్య మరింత తీవ్రంగా మారుతుంది. రాళ్లతో బాధపడుతున్నట్లయితే, డాక్టర్లు దుంపలను నివారించడం లేదా వాటిని మితంగా తినమని కూడా సిఫార్సు చేస్తుంటారు.

రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుదల- బీట్‌రూట్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. చక్కెర స్థాయి ఇప్పటికే ఎక్కువగా ఉన్నవారు బీట్‌రూట్ తినకూడదు. బీట్‌రూట్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా, రక్తంలో అధిక చక్కెర ఉన్నవారు బీట్‌రూట్ వినియోగానికి దూరంగా ఉండాలి.

కాలేయం దెబ్బతింటుంది- బీట్‌రూట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయ సమస్యలు కూడా వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. బీట్‌రూట్‌లో కాపర్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం ఉంటాయి. ఈ ఖనిజాలు కాలేయంలో పెద్ద మొత్తంలో చేరడం ప్రారంభిస్తాయి. దీంతో అవి తీవ్రంగా దెబ్బతీంటాయి. బీట్‌రూట్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కాల్షియం తగ్గుతుంది, ఇది ఎముకల సమస్యను పెంచుతుంది.

తదుపరి వ్యాసం