Shikhar Dhawan: ఉత్తమమైన జీవితం గడపాలా? శిఖర్ ధావన్ పంచుకున్న రహస్యాలివే
16 September 2024, 5:00 IST
Shikhar Dhawan: శిఖర్ ధావన్ తన విజయానికి కారణమైన ఫార్ములాను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మానసికంగా, ఆధ్మాత్మికంగా ఆయన ఎదిగిన తీరును తెలియజేశారు. ఆ విషయాలు మీరూ చూడండి.
శిఖర్ ధావన్
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన క్రికెట్ కెరీర్‌ను తీర్చిదిద్దిన మానసిక, ఆధ్యాత్మిక విధానాల గురించి వివరించారు. అవే తనకు ఆట తర్వాతా జీవితంలో దారి చూపుతున్నాయన్నారు. సానుకూలత, ఆధ్యాత్మికత, లక్ష్యం మీద పట్టు తన ఎదుగుదలకు ఎలా కారణమో చెప్పారు. తనకు బ్రహ్మకుమారీలతో ఉన్న అనుబంధం గురించీ వివరించారు.
శిఖర్ ధావన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఈ దశలో ప్రస్తుతాన్ని అంగీకరించడం, హద్దులను నిర్ణయించుకోవడం, అంతర్గత ఆనందం మీద దృష్టి పెట్టడం గురించి మాట్లాడారు. మీరు కూడా వ్యక్తిగత ఎదుగుదలతో ముడిపడిన జీవితంలో కొత్త ప్రయాణం మొదలు పెట్టాలి అనుకుంటే శిఖర్ ధావన్ పాటించిన విజయ సూత్రాలు తెల్సుకోండి.
ఆలోచనా తీరు, పాజిటివిటీ:
- కేవలం విజయాలపై కాకుండా దాని కోసం ప్రయత్నించే ప్రయాణం మీద దృష్టి సారించాలి. సానుకూలత, అవకాశ వాద మనస్తత్వం కొనసాగించాలని చెప్పారు శిఖర్ ధావన్.
- లక్ష్య ఆధారిత విధానం నుండి ప్రయత్నం మీద దృష్టి పెట్టే విధానానికి మారాలన్నారు. ఇది అతని ఉత్పాదకతను, సృజనాత్మకతను పెంచడానికి సాయపడిందట.
- ప్రశాంతమైన, శాంతియుత మనస్తత్వాన్ని అవలంబించడం అతని ప్రయాణంలో ఒక కీలకమైన భాగం అని శిఖర్ ధావన్ అన్నారు.
ఆధ్మాత్మికత:
- ధావన్ తన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి కూడా చెప్పారు. ముఖ్యంగా తాను బ్రహ్మకుమారీస్‌కు ప్రభావితుడయ్యానన్నారు. ఇది ఇతరులతో పోటీపడకుండా తన చుట్టూ ఉన్నవారితో సానుకూలంగా మసులుకోడానికి తోడ్పడిందన్నారు. వినయం, జవాబుదారీతనంతో కూడిన సంతృప్తికరమైన జీవితానికి ఈ ఆలోచనే సాయపడిందట.
వ్యక్తిగత పరిణామం:
- తన క్రికెట్ కెరీర్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడం గురించీ ఆయన మాట్లాడారు. ఆటకు స్వస్తి చెప్పాక తన జీవితంలో ప్రస్తుతమున్న ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం మీద దృష్టిపెట్టాడట.
- జీవితంలో సానుకూలతను పొందడానికి వాస్తవానికి దగ్గరగా ఉండేలా నిర్ణయాలు తీసుకునే కళను అతను నేర్చుకున్నాడట.
- అహంకారం వదిలి హద్దుల విషయంలో స్పష్టత తెచ్చుకోవడం, మన విలువను మనం తెల్సుకోవడం ముఖ్యమని ఆయనన్నారు. వేరేవాళ్లు మన విలువను దృవీకరించాల్సిన అవసరం లేదన్నారు.
నాయకత్వం:
- మీరు సాధించిన విజయాల కంటే ఒక వ్యక్తిగా మీరేంటీ అనేది ముఖ్యమని ధావన్ నొక్కి చెప్పారు.
- అతను తన తోటి ఆటగాళ్ల సంతోషం, శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇచ్చానన్నాడు. వారి మధ్య సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి ప్రాధాన్యత ఇచ్చాడట.