తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Shahi Dal: షాహీ పనీర్‌లాగే షాహీ పప్పును వండండి, టేస్ట్ అదిరిపోతుంది, త్వరగా వండేయచ్చు కూడా

Shahi Dal: షాహీ పనీర్‌లాగే షాహీ పప్పును వండండి, టేస్ట్ అదిరిపోతుంది, త్వరగా వండేయచ్చు కూడా

Haritha Chappa HT Telugu

22 July 2024, 12:10 IST

google News
  • Shahi Dal: వంటగదిలో ఎక్కువ సేపు ఉండాల్సిన అవసరం లేకుండానే తక్కువ సమయంలోనే షాహీ దాల్ తడ్కాను త్వరగా వండేయచ్చు. దీని రెసిపీ చాలా సులువు. సాధారణ పప్పుతో పోలిస్తే ఇది చాలా రుచిగా  ఉంటుంది. 

షాహీ దాల్
షాహీ దాల్ (shutterstock)

షాహీ దాల్

సమయం తక్కువగా ఉన్నప్పుడు శెనగ పప్పు, పెసర పప్పుతో ఇలా షాహీ దాల్ తడ్కాను వండి చూడండి. ఇది చాలా తక్కువ సమయంలో రెడీ అయిపోతుంది. అరగంటలో దీన్ని వండేయచ్చు. వంటగదిలో ఎక్కువసేపు నిలబడి వంట చేయలేని వారు కూడా ఈ పప్పు ను త్వరగా వండేయచ్చు. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. ఈ పప్పు ఉంటే ఏ కూరలు కూడా అవసరం లేదు. కాబట్టి షాహీ దాల్ రెసినీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

షాహీ పప్పు రెసిపీకి కావాల్సిన పదార్థాలు

శనగపప్పు - అరకప్పు

పెసరపప్పు - పావు కప్పు

ఉల్లిపాయలు - రెండు

టొమాటోలు - రెండు

నూనె - మూడు స్పూన్లు

యాలకులు - రెండు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను

పసుపు - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

కరివేపాకులు - గుప్పెడు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

ఎండు మిర్చి - రెండు

షాహీ దాల్ తడ్కా రెసిపీ

  1. ముందుగా శెనగపప్పు, పెసర పప్పు శుభ్రంగా కడిగి రెండు గంటల పాటూ నానబెట్టాలి.

2. అవి బాగా నానబెట్టిన తర్వాత కుక్కర్ లో వేసి, అవి ఉడకడానికి సరిపడా నీటిని వేయాలి. మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి లేదా నూనె వేయాలి.

4. తరువాత వేడి నెయ్యిలో పెద్ద యాలకులు, నల్ల మిరియాలు, దాల్చినచెక్క వేసి కలపాలి.

5. కొద్దిగా వేయించాక ఉల్లిపాయల తరుగు వేయాలి.

6. ఉల్లిపాయల రంగు మారేవరకు ఉంచాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వీటన్నింటినీ చిన్న మంట మీద వేయించాలి.

7. ఆ మిశ్రమంలో పసుపు వేసి బాగా కలుపుకోవాలి.

8. టమోటాల తరుగును కూడా వేసి కలుపుకోవాలి. పైన మూతపెట్టి అది ఇగురులాగా అయ్యే దాకా ఉంచాలి.

9. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి వేయించాలి.

10. టొమాటోలు ఇగురులాగా అయ్యాక ముందుగా ఉడికించుకున్న పప్పును వేసి నీళ్లు పోసి మూత పెట్టాలి.

11. అందులోనే ఎండుమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర వేసి ఉడికించాలి. అయిదు నిమిషాలు ఉడికించి స్టవ్ కట్టేయాలి. అంటే టేస్టీ షామీ దాల్ తడ్కా రెడీ. అన్నం లేదా చపాతీలతో తింటే రుచి అదిరిపోతుంది.

సాధారణంగా పప్పును కందిపప్పుతోనే చేస్తారు. ఇక్కడ శనగపప్పు, పెసరపప్పుతో ఎలా చేయాలో చెప్పాము. ఈ రెండు పప్పుల కలయిక కొత్త రుచిని అందిస్తుంది. కందిపప్పుతో చేసిన దాల్ తడ్కా కన్నా ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే దీన్ని మీరు మళ్లీ మళ్లీ చేసుకుని తింటారు.

టాపిక్

తదుపరి వ్యాసం