తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Schezwan Dosa: షెజ్‌వాన్ దోశ రెసిపీ, దీన్ని చూస్తేనే నోరూరిపోతుంది

Schezwan Dosa: షెజ్‌వాన్ దోశ రెసిపీ, దీన్ని చూస్తేనే నోరూరిపోతుంది

Haritha Chappa HT Telugu

18 April 2024, 6:00 IST

google News
    • Schezwan Dosa: ప్రతి ఇంట్లో వారానికి కనీసం రెండు నుంచి మూడుసార్లు దోశెలను అల్పాహారంగా తినే వారి సంఖ్య ఎక్కువే. ఇక్కడ మేము షెజ్వాన్ దోశ ఎలా చేయాలో చెప్పాము. రెసిపీ చాలా సులువు.
షెజ్వాన్ దోశె
షెజ్వాన్ దోశె

షెజ్వాన్ దోశె

Schezwan Dosa: వారంలో నాలుగు రోజులు దోశెలు తినే వారే ఉన్నారు. దోశలను ఎప్పుడూ ఒకేలా చేస్తే పెద్ద రుచిగా ఉండవు. కొత్త కొత్తగా ప్రయత్నించి చూడండి. ప్రతి ఒక్కరికి నచ్చుతాయి. ఇక్కడ మేము షెజ్వాన్ దోశ ఎలా చేయాలో చెప్పాము. దీన్ని చేయడం చాలా సులువు.

షెజ్‌వాన్ దోశ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

దోశ పిండి - రెండు కప్పులు

క్యాబేజీ తరుగు - అర కప్పు

క్యారెట్ తరుగు - పావు కప్పు

క్యాప్సికం తరుగు - పావు కప్పు

బీన్స్ తరుగు - మూడు స్పూన్లు

అల్లం తరుగు - ఒక స్పూను

వెల్లుల్లి తరుగు - ఒక స్పూను

పచ్చిమిరపకాయలు - రెండు

స్ప్రింగ్ ఆనియన్స్ - మూడు

సోయాసాస్ - ఒక స్పూను

షెజ్వాన్ సాస్ - ముప్పావు కప్పు

టమాటో - ఒకటి

నల్ల మిరియాల పొడి - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నీళ్లు - సరిపడినన్ని

నూనె - తగినంత

షెజ్‌వాన్ దోశ రెసిపీ

1. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

2. నూనెలో అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేయించాలి.

3. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.

4. ఆ తర్వాత క్యాప్సికం, క్యారెట్, క్యాబేజీ, బీన్స్ తరుగును వేసి రెండు నుంచి మూడు నిమిషాలు బాగా వేయించాలి.

5. కూరగాయలన్నీ మెత్తగా వేయించి పెట్టుకోవాలి.

6. అందులోనే షేజ్‌వాన్ సాస్, టమాటో సాస్, సోయాసాస్, మిరియాలు పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

7. స్టవ్ కట్టేసి స్ప్రింగ్ ఆనియన్స్ జల్లుకోవాలి.

8. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాసుకోవాలి.

9. ఆ నూనెలో దోశ పిండిని వేసి పెద్ద దోశలా వేసుకోవాలి.

10. ఈ దోశ పైన కొద్దిగా నూనె చల్లి పైభాగంలో షెజ్ వాన్ సాస్ ను పూయాలి.

11. ఆ తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేయాలి.

12. రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. దోశ రెడీ అయినట్టే.

13. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి చట్నీతో తింటే అదిరిపోతుంది. ఇందులో అన్ని రకాల కూరగాయలు వేసాము. కాబట్టి టట్నీ లేకుండా కూడా ఇది రుచిగానే ఉంటుంది. ఒకసారి దీన్ని ప్రయత్నించి చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం. ఇందులోనే రకాల కూరగాయలు వేసాము. కాబట్టి చాలా మేలు చేస్తుంది.

తదుపరి వ్యాసం