తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Quote : మనం పాజిటివ్​గా ఉండాలంటే.. నెగిటివ్ వ్యక్తులకు దూరంగానే ఉండాలి

Saturday Quote : మనం పాజిటివ్​గా ఉండాలంటే.. నెగిటివ్ వ్యక్తులకు దూరంగానే ఉండాలి

15 October 2022, 6:39 IST

    • Saturday Motivation : మీ లైఫ్​లో మీకు నెగిటివ్​గా అనిపించే వ్యక్తులను మీరు దూరం చేసుకుంటున్నారంటే దాని అర్థం మీరు వాళ్లని ద్వేషిస్తున్నారని కాదు.. మీరు మిమ్మల్ని ప్రేమించుకుంటున్నారని అర్థం. మీ సెల్ఫ్​రెస్పెక్ట్​కి వాల్యూ ఇచ్చుకుంటున్నారని అర్థం. 
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Saturday Motivation : కొందరితో మాట్లాడుతున్నప్పుడు.. లేదా కలిసి ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్లనుంచి మనకు నెగిటివ్ వైబ్స్ వస్తాయి. లేదంటే వాళ్లు మనతో నెగిటివ్ విషయాలే ఎక్కువగా చర్చిస్తారు. మనకు సెన్స్ అవుతుంది.. వాళ్ల నుంచి మనకు నెగిటివ్ ఫీలింగ్ వస్తుందని. అలాంటి వారికి దూరంగా ఉండడం తప్పేమి కాదు. మీరు వారికి దూరంగా ఉంటున్నారంటే.. దాని అర్థం మీరు వారిని ద్వేషిస్తున్నారని కాదు. వారి నుంచి వస్తున్న నెగిటివ్ వైబ్స్.. మీ పాజిటివ్​ వైబ్స్​ని డ్యామేజ్ చేయకూడదు అనుకుంటున్నారు అంతే.

ట్రెండింగ్ వార్తలు

Night Shift Effect : ఎక్కువగా నైట్ షిఫ్ట్‌లో పని చేస్తే ఈ సమస్య.. పాటించాల్సిన చిట్కాలు

Chia Seeds Benefits : చియా విత్తనాల ప్రయోజనాలు తెలుసుకోండి.. ఒక్క రోజులో ఎన్ని తివవచ్చు?

Pregnancy Tips : గర్భధారణలో సమస్యలను సూచించే సంకేతాలు, లక్షణాలు ఇవే

Baby First Bath : శిశువుకు మెుదటిసారి స్నానం చేయించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

కొందరు ఎలా ఉంటారంటే.. మనం ఏదైనా ప్రయత్నిస్తున్నప్పుడు.. మన పక్కనే ఉంటే.. అది చేయడం అవసరమా? నువ్వు చేయలేవు.. నీకు చేత అంటూ మన పక్కనే ఉంటే.. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్​ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనం సక్సెస్​ అవ్వాలి అనుకున్నప్పుడు అలాంటి వారికి కాస్త దూరంగా ఉండటమే బెటర్. ఈరోజు కాకపోయినా రేపైనా సక్సెస్ అవుతాము కానీ.. అలా నెగిటివ్ వైబ్స్ ఇస్తూ.. వెనక్కి లాగే వాళ్లు ఉన్నంత కాలం సక్సెస్​ అనేది అందని ద్రాక్షనే.

ఎప్పుడూ అదే పనిగా.. ఇతరుల గురించి చాడీలు చెప్తూ ఉన్నారంటే వాళ్లు కూడా నెగిటివ్ వైబ్స్ ఇస్తున్నట్లే అర్థం. మనం వెళ్లాక వేరే వాళ్లతో మన గురించి చర్చించవచ్చు. లేదా ఇతరుల గురించి మనకి లేనిపోనివి చెప్తూ.. మనల్ని వారికి దూరం చేయవచ్చు. మనమే వాళ్లని అసహ్యించుకునేలా చేయవచ్చు. దీనివల్ల మీరు ఎవరితోనూ సరిగా ఉండలేరు. తెలియకుండానే మీరు వారి కంట్రోల్​కి వెళ్లిపోతున్నారని మీకు తెలిసిన క్షణం మీరు నెగిటివ్ వైబ్స్ ఇస్తున్నవారికి దూరంగా ఉండేందుకు వెనుకాడరు. దాని అర్థం మీరు వారిని ద్వేషిస్తున్నారని కాదు. మీరు అంత నెగిటివ్​గా తయారవకూడదని అనుకుంటున్నారని గ్రహించాలి.

నెగిటివ్ వ్యక్తులకు దూరంగా ఉన్నప్పుడే.. మీరు కూడా నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉంటారు. ఇది చాలా ముఖ్యం కూడా. ఎందుకంటే నెగిటివిటీ ఎప్పుడూ మీకు నిరాశ, ఆగ్రహాన్నే బదులుగా ఇస్తుంది. అలాంటి వ్యక్తులతో గడపడం కన్నా.. మీరు మీతో సమయాన్ని ప్రొడెక్టివ్​గా గడిపేందుకు ఇష్టపడుతున్నారని అర్థం. కాబట్టి మీరు వారిని దూరం చేసుకున్నందుకు చింతించవద్దు. అది స్వార్థం కాదు. అది మీ అవసరం. మిమ్మల్ని మీరు సంతోషంగా, పాజిటివ్​గా ఉంచుకోవడానికి చేసే ప్రయత్నం.

తదుపరి వ్యాసం