తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Friday Quote : హెల్ప్ చేసి తిరిగి వారి నుంచి ఏదైనా ఆశిస్తున్నారంటే.. అది మంచితనం ఎలా అవుతుంది?

Friday Quote : హెల్ప్ చేసి తిరిగి వారి నుంచి ఏదైనా ఆశిస్తున్నారంటే.. అది మంచితనం ఎలా అవుతుంది?

07 October 2022, 6:43 IST

    • Friday Motivation : మంచితనం, జాలి, దయ అనేవి బిజినెస్ కాదు. నిజమైన దయ అంటే.. ఇతరులకు హెల్ప్ చేసినా.. తిరిగి వారి దగ్గరనుంచి ఏమి ఆశించనిది. అంతే కానీ.. నేను నా మంచితనంతో ఇది చేశాను కదా.. నువ్వు నాకోసం ఇది చేయాలి అని అడగడం దయ అనిపించుకోదు. దానిని బిజినెస్ అంటారు. ఎందుకంటే బిజినెస్​లోనే డీల్స్ మాట్లాడుకుంటారు. 
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Friday Motivation : చాలా మంది మంచితనం అనే ముసుగులో ఇతరులను దోచేసుకుంటారు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టి.. తిరిగి వస్తుందని ఆశించినట్లే.. నేను వారికి ఆ టైంలో హెల్ప్ చేశాను కదా. వాళ్లు ఇప్పుడు నాకు హెల్ప్ చేయాలని ఆలోచిస్తారు. కొందరైతే మరీ దారుణం. ఎదుటివ్యక్తి హెల్ప్ అడగకపోయినా చేసేస్తారు. కట్​ చేస్తే.. సీన్ రివర్స్.. నేను నీకోసం ఇది చేశాను కాబట్టి.. నువ్వు నాకోసం అది చేయాలని అడిగిస్తారు. వాళ్లు తమని హెల్ప్​ అడగకపోయినా చేసేది మంచితనంతో కాదు. వాళ్లకి అవసరం ఉంది కాబట్టి.. హెల్ప్ అనే ముసుగులో.. బిజినెస్ చేస్తారు.

ఏ మనిషికైనా.. ఇతరులపై జాలి, దయ అనే లక్షణాలు కలిగి ఉండడం ముఖ్యం. అంతే కానీ.. నేను ఇవి నీపై చూపిస్తున్నాను కదా.. నా అవసరం కూడా నువ్వు తీర్చు అంటే అది బిజినెస్ అవుతుంది. కానీ పైకి మాత్రం నేను మంచి వాడిని చూపించుకుంటారు. ఎంతమందికి ఎన్ని విధాలుగా హెల్ప్ చేసినా.. ప్రతిఫలంగా ఏమి ఆశించకపోవడమే నిజమైన దయ.

బిజినెస్​లో షరతులు, నిబంధనలు ఉంటాయి. వాటిని కచ్చితంగా ఫాలో అవ్వాల్సి వస్తుంది. అయితే మీరు మంచివారు అని చెప్పుకోవడం కూడా ఓ బిజినెస్​లా చేయకండి. ఒకవేళ మీరు అలాగే చేయాలనుకుంటే.. కచ్చితంగా మీరు మంచి చేస్తున్న అని చెప్పుకోవడం మానేయండి. అంతేకానీ.. నేను నీకు ఇది చేశాను కాబట్టి.. నువ్వు నాకు ఇది చెయ్యాలి అనే షరతులు పెట్టకండి. కొందరైతే బెదిరించి మరీ.. ఇతరులను నుంచి తమకు కావాల్సిన దానిని రాబట్టుకుంటారు.

సమాజంలో మంచిపేరుతో చలామణీ అయ్యే చాలామంది చేసే చర్య ఇది. పైకి మాత్రం మంచితనానికి మారుపేరులా కనిపిస్తారు. చివరికి చూస్తే నేను మీకు ఇలా హెల్ప్ చేశాను కాబట్టి.. మీరు నాకు అలా హెల్ప్ చేయాలని అడిగేవారే ఎక్కువ. అసలు మీలో నిజమైన దయ, మంచి ఉంటే దానిని ఎవరికి చెప్పుకోరు. కుడి చేతితో చేసే సాయం.. ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. కానీ.. ఇప్పుడు కుడి చేతితో పావలా సాయం చేసినా.. దాని కోసం అందంగా రెడీ అయ్యి.. ఖరీదైన బట్టలు వేసుకుని.. ఫోటోలకు ఫోజులిస్తున్నారు. అంతటితో ఆగుతున్నారా అంటే లేదు. వాటిని సోషల్ మీడియాలో అప్​లోడ్ చేసి.. తమ మంచితనాన్ని నలుగురికి చూపించుకుంటున్నారు. కొందరికైతే.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్​ కూడా పెరిగి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇచ్చేది గోరంత.. పొందేది కొండత.

ఇలాంటి వాళ్లు ఉన్నంత కాలం సమాజంలో ఎటువంటి మార్పు జరగదు. ఎప్పటికీ పేదవాడు పేదవాడిలానే ఉంటాడు. మంచివాడి ముసుగులో ఉన్నోడు సంపాదించుకుంటూనే ఉంటాడు. మీకు నిజంగానే ఎదుటి వ్యక్తికి సాయం చేయాలని ఉందనుకో.. వారి నుంచి ఏమి ఆశించకండి. అది మాత్రమే మంచితనం అనిపించుకుంటుంది. ఎదుటివారు మిమ్మల్ని మంచివాడు అనుకోవాలని మాత్రం ఎప్పుడూ సహాయం చేయకండి. ఎదుటివారికి మీరు నిస్వార్థంగా సహాయం చేసినప్పుడే.. ఆ మంచి మీకు తిరిగి వస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం