తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Samsung The Frame Tv । వాల్ పేపర్ కాదు.. శాంసంగ్ ఫ్రేమ్ టీవీ ఇది, స్మార్ట్ కదా!

Samsung The Frame TV । వాల్ పేపర్ కాదు.. శాంసంగ్ ఫ్రేమ్ టీవీ ఇది, స్మార్ట్ కదా!

HT Telugu Desk HT Telugu

28 September 2022, 22:49 IST

    • శాంసంగ్ కంపెనీ Samsung The Frame TV లను విడుదల చేసింది. ఈ  ఫ్రేమ్ టీవీప్రత్యేకత ఏమిటంటే.. ఇది మీ ఇంటి గోడకు ఒక ఆకర్షణీయమైన వాల్ ఫ్రేమ్‌ను తగిలించినట్లుగా ఉంటుంది.
Samsung The Frame TV
Samsung The Frame TV

Samsung The Frame TV

మీరు మీ ఇంటి గోడను ఒక ఆకర్షణీయమైన స్మార్ట్ టీవీతో అలంకరించాలనుకుంటున్నారా? ఇదిగో మీ హోమ్-ఎంటర్‌టైన్‌మెంట్ సెటప్‌ను వేరెలెవెల్ తీసుకుకెళ్లడానికి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన Samsung భారత మార్కెట్లో ప్రీమియం లైఫ్‌స్టైల్ టెలివిజన్ ఎడిషన్‌ను విడుదల చేసింది. శాంసంగ్ కంపెనీ నుంచి వచ్చిన Samsung The Frame smart TV లు ఇప్పుడు టాక్- ఆఫ్ ద టౌన్‌గా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Night Shift Effect : ఎక్కువగా నైట్ షిఫ్ట్‌లో పని చేస్తే ఈ సమస్య.. పాటించాల్సిన చిట్కాలు

Chia Seeds Benefits : చియా విత్తనాల ప్రయోజనాలు తెలుసుకోండి.. ఒక్క రోజులో ఎన్ని తివవచ్చు?

Pregnancy Tips : గర్భధారణలో సమస్యలను సూచించే సంకేతాలు, లక్షణాలు ఇవే

Baby First Bath : శిశువుకు మెుదటిసారి స్నానం చేయించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

ఈ ‘శాంసంగ్ ఫ్రేమ్ టీవీ’ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది మీ ఇంటి గోడకు ఒక ఆకర్షణీయమైన వాల్ పెయింట్‌ను తగిలించినట్లుగా ఉంటుంది.

ఫ్రేమ్ లైఫ్‌స్టైల్ టీవీ ఆన్‌లో ఉన్నప్పుడు మామూలుగా మనం టీవీ చూసినట్లుగా ఉంటుంది. అదే ఆఫ్‌లో ఉన్నప్పుడు ఒక అద్భుతమైన కనిపిస్తుంది. మీకు ఈ టీవీ రియల్-లైఫ్ ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన అనుభవాన్ని అందిస్తుంది. లైబ్రరీ నుండి సుమారు 1600 వరకు అద్భుతమైన కళాఖండాలను ఎంచుకోవచ్చు.

భారతదేశంలో విడుదలైన Samsung The Frame TV తాజా ఎడిషన్‌తో మీ లివింగ్ రూమ్ సౌందర్యం సరికొత్త స్థాయికి వెళ్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.- కస్టమైజ్ చేయగల బెజెల్స్, మ్యాట్ డిస్‌ప్లే, ఆర్ట్ మోడ్ , సాంసంగ్ QLED టెక్నాలజీతో వచ్చిన ఈ స్మార్ట్ టీవీలో అనేక ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇది మీకు దృశ్యంలో లీనమయ్యే అనుభూతిని అందిస్తుంది.

Samsung The Frame TV ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

100Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కలిగిన QLED డిస్‌ప్లే

రిఫ్లెక్షన్స్ నిరోధించే మ్యాట్ స్క్రీన్‌, మోషన్ సెన్సార్‌

HDR10+ అడాప్టివ్, HDR10+ గేమింగ్ సర్టిఫికేషన్, సుప్రీం UHD డిమ్మింగ్,

మోషన్ ఎక్స్‌లరేటర్ టర్బో+ టెక్నాలజీ క్వాంటం ప్రాసెసర్

శాంసంగ్ Tizen OS

Dolby Atmos, Adaptive Sound+

Dolby Digital Plus సపోర్ట్ చేసే 40W 2.0.2 ఛానెల్ స్పీకర్

ఇంటర్నల్ Google అసిస్టెంట్‌, Bixb, Alexa సపోర్ట్

Samsung The Frame TV ధరలు, లభ్యత

కొత్తగా లాంచ్ అయిన శాంసంగ్ ది ఫ్రేమ్ స్మార్ట్ టీవీ 43-అంగుళాల స్క్రీన్ పరిమాణం మొదలుకొని, 75-అంగుళాల పరిమాణాల వరకు వివిధ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

Samsung The Frame TV 43-అంగుళాల వేరియంట్‌ ధర, రూ. 61,990/-

Samsung The Frame TV 50-అంగుళాల వేరియంట్‌ ధర, రూ. 73,990/-

Samsung The Frame TV 55-అంగుళాల వేరియంట్‌ ధర, రూ. 91,990/-

Samsung The Frame TV 65-అంగుళాల వేరియంట్‌ ధర, రూ. 1,27,990/-

Samsung The Frame TV 75-అంగుళాల వేరియంట్‌ ధర, రూ. 2,99,990/-

Samsung.com, Amazon, Flipkart సహా అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో ఈ స్మార్ట్ టీవీలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. అదనంగా 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి.

తదుపరి వ్యాసం