Sun Tan । ఎండకు మీ ముఖం, చేతులు నల్లగా మారాయా? ఇవి రాస్తే మళ్లీ చర్మంలో మెరుపు!
19 May 2023, 16:03 IST
- Remove Sun Tan Naturally: మండుతున్న ఎండల కారణంగా చర్మ సమస్యలతో బాధపడుతున్నారా? మీ సన్ టాన్ తొలగించడానికి ఇక్కడ కొన్ని సహజ మార్గాలు ఉన్నాయి చూడండి.
Remove Sun Tan Naturally
Sun Tanning: మన చర్మం ఎండకు గురైనపుడు దాని రంగు మారుతుంది. ముఖ్యంగా ఈ వేసవిలో కఠినమైన ఎండ ఉంటుంది. బయట తిరిగితే ముఖం, చేతులు సహా ఎండకు గురైన ఇతర శరీర భాగాలు నల్లగా లేదా ముదురు రంగులోకి మారిపోతాయి, దీనినే మనం ట్యానింగ్ అంటాము. ట్యానింగ్ అనేది చర్మం తనని తాను రక్షించుకునే ఒక ప్రక్రియ సూర్యుని నుండి వచ్చే UV రేడియేషన్ల నుండి మన చర్మాన్ని రక్షించడానికి మన శరీరంలో ఉండే మెలనిన్ చర్మ కణాల ఉపరితలంపైకి బదిలీ అవుతుంది. మెలనిన్ చేరటం వల్ల సూర్యరశ్మికి గురయ్యే ప్రదేశాలు ట్యానింగ్ గమనించవచ్చు. చర్మంపై ఈ నలుపుదనం అనేది 7 నుంచి 10 రోజుల వరకు ఉంటుంది. అది చర్మ రకం, చర్మ సంరక్షణపై ఆధారపడి ఉంటుంది. సరైన సంరక్షణ లేకుంటే ట్యానింగ్ అనేది చాలా కాలం పాటు అలాగే కొనసాగుతుంది.
Home Remedies for Sun Tan Removal- సన్ టాన్ తొలగించడానికి సహజ నివారణలు
సన్ టాన్‌ను సహజంగా తొలగించడాని కొన్ని చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి, అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.
బంగాళాదుంప
మీ చర్మంపై బంగాళాదుంప ముక్కలను రుద్దడం వలన సన్ టాన్ లేదా డార్క్ పిగ్మెంటేషన్‌ను వదిలించుకోవచ్చు. బంగాళాదుంపలో కాటెకోలేస్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది, ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఎక్కువసేపు సూర్యరశ్మికి గురికావడం వల్ల పెరిగే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే యాంటీఆక్సిడెంట్లు కూడా బంగాళాదుంపలో ఉన్నాయి.
పైనాపిల్ గుజ్జు
పైనాపిల్ గుజ్జును తేనెతో కలిపి టాన్ చేసిన ప్రదేశంలో అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి సమృద్ధిగా ఉన్నందున ఇది మీ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. మీ చర్మంపై నలుపుదనాన్ని రివర్స్ చేస్తుంది. పైనాపిల్‌లో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు , బ్రోమెలైన్ అనే ఎంజైమ్ కూడా ఉన్నాయి.
స్ట్రాబెర్రీలు
స్ట్రాబెర్రీలు జ్యూసీగా, ఎంత రుచికరంగా ఉంటాయో, సన్ ట్యాన్‌ను తొలగించడానికి కూడా ఒక గొప్ప ఔషధంగా పనిచేస్తాయి. వీటిలో AHA (ఆల్ఫా-హైడ్రాక్సీ ఆమ్లాలు) , విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అందువల్ల, స్ట్రాబెర్రీలు చర్మాన్ని సహజంగా ప్రకాశవంతం చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. కొన్ని స్ట్రాబెర్రీలను మెత్తగా చేసి, వాటిని ఒక చెంచా తాజా క్రీమ్‌తో కలపండి. ఆపై ఈ మిశ్రమాన్ని నల్లగా మారిన చర్మానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచుకోండి, ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇది మీ చర్మం రంగును కాంతివంతం చేస్తుంది, చర్మానికి తేమను కూడా అందిస్తుంది.
నిమ్మకాయ
నిమ్మకాయ సహజ బ్లీచింగ్ ఏజెంట్‌గా ప్రసిద్ధి చెందింది. నిమ్మకాయ లేని సహజమైన ఫేస్ ప్యాక్ అంటూ ఉండదు. నిమ్మలో ఉండే అధిక స్థాయి సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి చర్మంలోని మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది. టాన్‌కు కారణమయ్యే మెలనిన్‌ను కూడా తొలగిస్తుంది. ఉత్తమ ఫలితాల కోసం నిమ్మరసానికి కొద్దిగా తేనె కలపండి, ఈ కాంబో ఫేస్ టాన్ రిమూవల్‌కి అత్యుత్తమ హోం రెమెడీలలో ఒకటి.
పెరుగు
టాన్ తొలగింపు కోసం, ఒక చెంచా శనగపిండిలో పెరుగు కలిపి మందపాటి పేస్ట్‌గా తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని మీ శరీరమంతా అప్లై చేసి, 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత షవర్ స్నానం చేయండి. పెరుగు ఒక ప్రోబయోటిక్, ఆరోగ్యకరమైన కొవ్వు, లాక్టిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది, ఉపశమనం కలిగిస్తుంది, హైడ్రేట్ చేస్తుంది. ఈ రెమెడీని ప్రతిరోజూ కనీసం రెండు వారాల పాటు పునరావృతం చేయండి, మీ టాన్ పూర్తిగా మాయమవుతుంది.
కలబంద
చర్మ సంరక్షణలో కలబంద కచ్చితంగా ఉపయోగించాల్సిన పదార్థం. కలబంద జెల్ లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మెరిసేలా, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉన్నాయి, ఇది చర్మాన్ని చల్లబరుస్తుంది, టాన్ తొలగించడంలో సహాయపడుతుంది. మాయిశ్చరైజర్ లాగా ప్రతిరోజూ దీన్ని వర్తించండి.