తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Long-distance Relationship | దూరం దగ్గర చేస్తుంది కానీ.. అది శృతి మించకూడదు!

Long-distance Relationship | దూరం దగ్గర చేస్తుంది కానీ.. అది శృతి మించకూడదు!

HT Telugu Desk HT Telugu

25 April 2023, 22:10 IST

google News
    • Long-distance relationship: దూరంగా ఉంటే ప్రేమలు పెరుగుతాయంటారు. కానీ భాగస్వామి పెట్టే దూరం అర్థం చేసుకోకపోతే ఆ బంధం విచ్చిన్నతకే దారితీస్తుంది. అందుకు సంకేతాలు ఇవే
Long-distance relationship
Long-distance relationship (Unsplash)

Long-distance relationship

Long-distance relationship: చాలా సందర్భాలలో, బంధాల మధ్య దూరం వారి సంబంధంలో ప్రేమను పెంచుతుంది. చదువుల వల్లనో, ఉద్యోగాల వల్లనో ఒకరికొకరు మైళ్ల దూరంలో నివసిస్తూ కలుసుకోలేని వారు చాలా మంది ఉన్నారు. అయితే జంటల మధ్య దూరంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. పెళ్లి తర్వాత కూడా దూరందూరంగా ఉండే జంటలు చాలా మందే ఉంటారు. వేర్వేరు ప్రాంతాలలో ఉద్యోగాలు చేసే వారిలో లేదా భాగస్వామి దూరపు ప్రాంతంలో పనిచేసే సందర్భంలో దూరం అనేది సహజంగా ఉంటుంది. అయితే చాలా మంది జంటలు ఇలా దూరంగా ఉన్నప్పటికీ వారి మధ్య భౌతిక దూరమే ఉంటుంది కానీ, మనసుతో వారు ఎప్పటికీ కలిసే ఉంటారు. ఇందుకు ప్రధాన కారణం వారి మధ్య అమితమైన ప్రేమ, ఒకరంటే ఒకరికి నమ్మకం, అంతకుమించి కుటుంబ బాధ్యతలు.

దూరంగా ఉన్నప్పటికీ ఎప్పుడూ మాట్లాడుకోవడం, సందేశాలు పంపుకోవడం, అప్పుడప్పుడు కలవడం వారిని మానసికంగా కలిపే ఉంచుతుంది. భాగస్వామిపై నమ్మకం ఉన్న సందర్భంలో కొంతకాలం మాట్లాడే అవకాశం లేకపోయినా, బంధం బలంగానే ఉంటుంది. ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. కానీ ఈ రకమైన సుదూర సంబంధాలలో కమ్యూనికేషన్ కీలకం. మాట్లాడే అవకాశం ఉన్నా మాట్లాడలేకపోవడం, మాట్లాడటానికి ఆసక్తి కనబరచకపోవడం వంటివి హెచ్చరిక సంకేతాలుగా భావించవచ్చు. జంటల మధ్య దూరాన్ని, శాశ్వత దూరంగా మార్చే కొన్ని సంకేతాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కాల్స్ స్వీకరించడం లేదు

సుదూర సంబంధంలో, దంపతుల మధ్య కమ్యూనికేషన్ కీలకం. వ్యక్తులు మాట్లాడటానికి లేదా వారి భాగస్వామిని చూడటానికి వీడియో కాల్స్ చేసుకోవచ్చు. కానీ మీ భాగస్వామికి మీకు మధ్య ఫోన్ కాల్‌లు లేదా వీడియో కాల్‌లు తగ్గిపోవడం, లేదా పూర్తిగా స్వీకరించలేనపుడు వారు మీ నుండి దూరం కావాలనుకుంటున్నారని అర్థం చేసుకోండి. మీ భాగస్వామి మిమ్మల్ని విస్మరించడం ప్రారంభించారు, వారిలొ మీపై ప్రేమ తగ్గడం ప్రారంభించింది.

సంభాషణలో ఆసక్తి లేదు

చాలా రోజుల తర్వాత జంటలు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు, వారు చాలా ఉత్సాహంగా ఉంటారు. తమ భాగస్వామి ఈ రోజు ఎలా ఉందో, ఏమి చేశారో తెలుసుకోవాలనుకుంటారు. కానీ మీకు మీతో మాట్లాడేటపుడు ఎలాంటి ఆసక్తి లేకుండా, నిరుత్సాహంగా మాట్లాడుతుంటే, లేదా మీ క్షేమ సమాచారం అడగకపోవడం, అడిగిన దానికి సరైన సమాధానం ఇవ్వలేకపోయినపుడు దూరం పెరుగుతున్నట్లే లెక్క.

తరచుగా గొడవలు

దూరంగా ఉన్నప్పటికీ మీ మధ్య తరచుగా గొడవలు జరగటం, ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం. అనవసరంగా ఈ సంబంధంలో ఇరుక్కున్నట్లు చెప్పటం, పరుష పదజాలం ఉపయోగించటం, మీ వాదనను అర్థం చేసుకోలేకపోవడం చేస్తే, మీ బంధానికి కాలం చెల్లే తేదీ దగ్గర్లో ఉందని అర్థం.

సాకులు చెప్పడం

భాగస్వామి మీతో అబద్ధం చెప్పడం ప్రారంభించినప్పుడు లేదా సాకులు చెప్పడం ప్రారంభించినప్పుడు, సంబంధంలో దూరం వస్తోందని అర్థం చేసుకోండి. సుదూర సంబంధాలు నమ్మకంపై ఆధారపడి ఉంటాయి. ఈ రకమైన సంబంధంలో, వ్యక్తులు తమ భాగస్వామి నుండి విషయాలను దాచకూడదు లేదా అబద్ధం చెప్పకూడదు. ఎందుకంటే అబద్ధాలు చెప్పడం లేదా సాకులు చెప్పడం సంబంధంపై నమ్మకాన్ని నాశనం చేస్తుంది. ఇది సంబంధం విచ్ఛిన్నమయ్యే అంచున ఉందని అర్థం చేసుకోండి.

తదుపరి వ్యాసం