తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Radhika's Vidai: నిజమైన బంగారంతో రాధిక మర్చంట్ దుస్తులు.. అప్పగింతల వేడుకకు వజ్ర వైడూర్యాలతో నగలు..

Radhika's vidai: నిజమైన బంగారంతో రాధిక మర్చంట్ దుస్తులు.. అప్పగింతల వేడుకకు వజ్ర వైడూర్యాలతో నగలు..

13 July 2024, 9:30 IST

google News
  • Radhika's vidai: అప్పగింతల వేడుకకు రాధిక మర్చంట్ వేసుకున్న డ్రెస్ అందరి దృష్టి ఆకర్షించింది.  నిజమైన బంగారంతో చేసిన ఈ డ్రెస్ వివరాలు చూసేయండి. 

రాధిక మర్చంట్ అప్పగింతల లుక్
రాధిక మర్చంట్ అప్పగింతల లుక్ (Instagram )

రాధిక మర్చంట్ అప్పగింతల లుక్

పుస్తకాల్లో రాజులు, రాణులు బంగారంతో చేసిన బట్టలు వేసుకునేవాళ్లని చదివాం తప్ప నిజంగా చూసింది తక్కువే. ఆ కథలన్నీ నిజం చేశారు అంబానీలు. ఇదివరకే అనంత్ అంబానీ నిజమైన బంగారు బట్టల్లో అందర్నీ ఆశ్చర్యపర్చారు. ఇప్పుడు రాధిక మర్చంట్ అప్పగింతలకు సంబంధించిన దుస్తులు కూడా నిజమైన బంగారంతో డిజైన్ చేశారు.

గుజరాతీ సాంప్రదాయ రంగులైన తెలుపు, ఎరుపు మేళవింపు బట్టల్లో వధువుగా మెరిసిపోయింది రాధిక. దాన్ని అబుజానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేశారు. అప్పగింతల వేడుకకు రాధిక మర్చంట్ వేసుకున్న దుస్తులు చూస్తే మరింత అందంగా ఉంది. ఈ దుస్తుల్లో కూడా రాధిక మహారాణి లాగా కనిపిస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఈ లుక్ వివరాలు:

అప్పగింతలకు సంబంధించిన లుక్ రియాకపూర్ స్టైల్ చేశారు. ఈ ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. మనీష్ మల్హోత్రా ఈ బట్టలను డిజైన్ చేశారు. బ్రొకేడ్ లెహెంగా, బ్లవుజు, సిల్క్ దుపట్టా, తలపై ముసుగుతో ఈ లుక్ ఉంది. చీర కట్టడంలో నిపుణురాలైన డాలీ జైన్ ఈ అందమైన లెహెంగాను, దుపట్టాను అద్దినట్లుగా కట్టారు.

బంగారంతో బట్టలు:

రాధిక మర్చంట్ అప్పగింతలకు సంబంధించిన దుస్తులు నిజమైన బంగారంతో డిజైన్ చేశారు. గుజరాత్ లోని కచ్‌ ప్రాంతానికి చెందిన అభో అనే సాంప్రదాయ వస్త్రసంపద ఆధారంగా నిజమైన బంగారంతో కర్చోబీ వర్క్ ను బ్లవుజు మీద డిజైన్ చేశారు. బ్రొకేడ్ సిల్క్ లెహెంగాలో బనారసీ బ్రొకేడ్ డిజైనింగ్ కనిపించింది.

ఈ లెహెంగా, బ్లవుజు లుక్ ను బనారసీ సిల్క్ దుపట్టాతో పూర్తి చేశారు రాధిక. తల మీద ముసుగుతో మహారాణిలా తలపించారు. భుజం మీద ధరించిన దుపట్టాకు నిజమైన బంగారం ఎంబ్రాయిడరీ ఉంది.

రాధిక ఆభరణాలు:

ఈ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లెహెంగా లుక్ ను వజ్రాలు పొదిగిన నగలతో పూర్తి చేశారు రాధిక. బంగారం, వజ్రాలు, పచ్చలు పొదిగిన చోకర్, హెవీ నెక్‌లేస్, పోల్కీ ఇయర్ రింగ్స్, వంకీ, గాజులు,చేతికి ఉంగరాలు, నుదుటిన పాపిడ బిల్లతో పైనుంచి కింది దాకా వజ్ర వైడూర్యాలున్న నగలు ధరించారామె. ఈ నగలు రాధిక కుటుంబానికి వంశపార్యంగా వస్తున్న నగలు. తన అక్క అంజలి మర్చంట్ కూడా వీటిని తన పెళ్లికి ధరించారు.

టాపిక్

తదుపరి వ్యాసం