Ambani's sangeeth: మెరిసేదంతా బంగారమే.. నిజమైన బంగారంతో అనంత్ దుస్తులు.. క్రిస్టల్ డ్రెస్ లో రాధిక..-ananth in real gold dress radhika in swarovski crystals know details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ambani's Sangeeth: మెరిసేదంతా బంగారమే.. నిజమైన బంగారంతో అనంత్ దుస్తులు.. క్రిస్టల్ డ్రెస్ లో రాధిక..

Ambani's sangeeth: మెరిసేదంతా బంగారమే.. నిజమైన బంగారంతో అనంత్ దుస్తులు.. క్రిస్టల్ డ్రెస్ లో రాధిక..

Koutik Pranaya Sree HT Telugu
Jul 06, 2024 09:00 AM IST

Ambani's sangeeth: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ సంగీత్ కోసం అబూ జానీ సందీప్ ఖోస్లా దుస్తులు ధరించారు. అనంత్ దుస్తులు నిజమైన బంగారంతో తయారు చేయగా, రాధిక లెహంగాలో స్వరోవ్ స్కీ స్ఫటికాలు ఉన్నాయి. వాటి పూర్తి వివరాలు తెల్సుకోండి.

అనంత్, రాధిక సంగీత్
అనంత్, రాధిక సంగీత్ (Instagram)

త్వరలో వివాహం చేసుకోబోతున్న జంట అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ కోసం అంబానీ కుటుంబం సంగీత్ ను గ్రాండ్ గా నిర్వహించింది. ఈ వేడుకలకు స్నేహితులు, కుటుంబ సభ్యులు, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వధూవరులు మాస్టర్ కౌచర్స్ అబూ జానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన సాంప్రదాయ దుస్తులను ఎంచుకున్నారు.

బంగారంతో చేసిన దుస్తులు:

నిన్న రాత్రి జరిగిన సంగీత్ వేడుకలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ అద్భుతంగా కనిపించారు. అనంత్ అబూ జానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన బంధ్ గాలా జాకెట్, ప్యాంట్ సెట్ ధరించగా.. రాధిక ఆఫ్ షోల్డర్ బ్లౌజ్, లెహంగాలో అందంగా ముస్తాబైంది. అబూ జానీ సందీప్ ఖోస్లా ఇన్స్టాగ్రామ్ పేజీ ప్రకారం, అనంత్ జాకెట్ నిజమైన బంగారంతో తయారు చేశారు. రాధిక డ్రెస్ మెరిసే స్వరోవ్స్కీ స్ఫటికాలను పొదిగిఉంది!

డ్రెస్సులు ఎలా ఉన్నాయంటే..

అనంత్ నలుపు, బంగారు వర్ణం కాంబినేషన్ లో బంధ్ గాలా జాకెట్ లో స్ప్లిట్ మాండరిన్ కాలర్, ఫుల్ లెంగ్త్ స్లీవ్స్, రియల్ గోల్డ్ తో రూపొందించిన పూల అలంకరణలు, ఫ్రంట్ బటన్ క్లోజర్స్, టైలర్డ్ ఫిట్టింగ్ తో ఉన్నారు. దానికి సరిపోయే బ్లాక్ కుర్తా షర్ట్, ప్యాంట్ ధరించాడు. చివరగా, నలుపు రంగు షూలు, పోనీటెయిల్ లో కట్టిన జుట్టుతో అనంత్ సంగీత్ వేడుకను ముస్తాబయ్యారు.

రాధిక లేత గోధుమ, బంగారు వర్ణంలో మెరిసే లెహంగా సెట్ లో స్వరోవ్ స్కీ స్ఫటికాలతో అలంకరించిన ఆఫ్-షోల్డర్ బ్లౌజ్, క్రాప్డ్ హెమ్, శరీరాన్ని హత్తుకుపోయే డిజైన్ తో ఉన్నాయి. ఆమె ఎ-లైన్ తక్కువ గేరాతో, ఫ్లోర్ లెంగ్త్ హెమ్, స్వరోవ్ స్కీ క్రిస్టల్స్ తో తయారు చేశారు. లేత ఆకుపచ్చ రంగు సిల్క్ దుపట్టా, ఎమరాల్డ్ పెండెంట్ తో కూడిన డైమండ్ నెక్లెస్, బ్రేస్ లెట్, అందమైన చెవిపోగులు, మధ్య పాపిట తీసిన లూజ్ హెయిర్, వింగ్డ్ ఐ లైనర్ తో ఆమె లుక్ డిజైన్ చేశారు.

రాధికా మర్చంట్, అనంత్ అంబానీల వివాహం:

పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్, ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం జూలై 12 న జరగనుంది. జూలై 14 వరకు వీరి వివాహ వేడుకలు జరగనున్నాయి.

Whats_app_banner