Anant ambani Radhika Marriage : అనంత్​- రాధిక పెళ్లికి అంబానీలు ఎంత ఖర్చు చేశారు?-anant ambani radhika marriage how much money did the ambanis splurge on this wedding ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Anant Ambani Radhika Marriage : అనంత్​- రాధిక పెళ్లికి అంబానీలు ఎంత ఖర్చు చేశారు?

Anant ambani Radhika Marriage : అనంత్​- రాధిక పెళ్లికి అంబానీలు ఎంత ఖర్చు చేశారు?

Sharath Chitturi HT Telugu

Anant Radhika wedding cost : అనంత్​ అంబానీ- రాధికా మర్చంట్​ పెళ్లికి అంబానీలు ఎంత ఖర్చు చేస్తున్నారు? ఈ ప్రశ్న ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది.

అనంత్​- రాధిక పెళ్లికి అంబానీలు ఎంత ఖర్చు చేశారు? (ANI)

అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్​ టాపిక్​గా మారాయి. అనంత్​ అంబానీ- రాధికా మర్చంట్​ల వివాహం ప్రముఖుల మధ్య అత్యంత ఘనంగా శుక్రవారం జరగనుంది. అయితే వీరి పెళ్లికి అంబానీలు ఎంత ఖర్చు చేశారు? అన్న ప్రశ్నపై ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది.

రూ. 5వేల కోట్లు ఖర్చు చేశారా?

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహానికి రూ.5,000 కోట్లు ఖర్చయిందని, రెడ్డిట్​లో ఓ పోస్ట్​ వైరల్​గా మారింది. ఇది ముకేశ్ అంబానీ ఆస్తుల విలువలో కేవలం 0.5 శాతం మాత్రమేనని ఆ పోస్ట్ పేర్కొంది. ఈ పోస్ట్​ చేసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

“సుమారు రూ.1,000-2,000 కోట్ల అంచనాలు ఉన్నాయి. కానీ రూ.5,000 కోట్లు ఖర్చు చేశారా? మైండ్ బ్లోయింగ్,” అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

“కుటుంబంలోని ఐదు తరాలు సంతోషంగా ఉండటానికి ఇంత మొత్తం సరిపోతుంది,” అని మరొకరు పేర్కొన్నారు.

"అంబానీలు రోజు రూ.3 కోట్లు ఖర్చు పెడితే.. వారి సంపద వారికి 962 సంవత్సరాలు వస్తుంది అని ఒక వ్యాసం చదివాను," అని ఒక యూజర్ కామెంట్ చేశారు. రూ. 3 కోట్లు జస్ట్​ బేస్​ వెల్త్​ అని మరొకరు అభిప్రాయపడ్డారు.

గరీబో కో క్రోర్​ దాన్ యోజనను (పేదలకు ఒక కోటి ధానం పథకం) ప్రారంభించాలని మరో యూజర్ ట్వీట్ చేశారు. 

అయితే, వ్యాపారవేత్తలు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా డబ్బులు ఖర్చు పెట్టరని మరొకరు అభిప్రాయపడ్డారు.

రూ.5000 కోట్ల విలువ 600 మిలియన్ డాలర్లు అని, అమెరికాలో 10 ఆస్కార్ వేడుకలకు ఇది సరిపోతుందని యూజర్ కామెంట్ చేశాడు. ఇటలీలో క్రూయిజ్ పార్టీకి రూ.1000 కోట్లు ఖర్చు అవ్వదని, జామ్ నగర్ ప్రీ వెడ్డింగ్ వేడుకలను కలుపుకున్నా రూ.5000 కోట్ల పెళ్లి అసాధ్యమని వివరించారు.

“వ్యాపారవేత్తలు అంత డబ్బు ఖర్చు పెట్టడానికి మూర్ఖులు కాదు. ప్రతిఫలం లేకుండా ఏమీ ఖర్చు చేయరు. ప్రతిదీ తమ సామ్రాజ్యాన్ని విస్తరించడానికి అవకాశంగా భావిస్తారు. వారి పిల్లల సంబంధాలు కూడా ఇందులో భాగం!” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

రూ. 5వేల కోట్లు అవ్వకపోవచ్చు..!

రూ.4000-5000 కోట్ల వ్యయం విపరీతంగా అనిపించినప్పటికీ, ఒక సగటు భారతీయుడు తమ పిల్లల వివాహాల కోసం ఖర్చు చేసే దానితో పోలిస్తే అంబానీ కుటుంబం వారి నికర విలువలో తక్కువ శాతాన్ని ఖర్చు చేస్తోందని అవుట్లుక్ నివేదిక సూచించింది. ఏ భారతీయ కుటుంబం అయినా వారి మొత్తం సంపదలో 5-15% ఖర్చు చేస్తుంది. అనంత్ అంబానీ రాధికా మర్చంట్ వివాహం అంబానీ విలువలో 0.5శాతం.

ఈ ఏడాది మార్చ్​లో ప్రీ వెడ్డింగ్​ సెలబ్రేషన్స్​తో మొదలైన అనంత్​ అంబానీ రాధికా మర్చంట్​ వివాహ వేడుకలు.. పెళ్లి, రిసెప్షన్​తో ముగియనున్నాయి. యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, కిమ్ కర్దాషియాన్, శాంసంగ్ సీఈఓ హాన్ జాన్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఈ వివాహాని హాజరవ్వడం కోసం ఇప్పటికే ముంబైకి చేరుకున్నారు.

సంబంధిత కథనం