తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Prostate Cancer: పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్.. లక్షణాలు ఇవే!

Prostate Cancer: పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్.. లక్షణాలు ఇవే!

HT Telugu Desk HT Telugu

16 July 2022, 19:02 IST

    • Prostate Cancer: పురుషులను ఇబ్బంది పెట్టే క్యాన్సర్లలో ప్రధానమైనది ప్రోస్టేట్ క్యాన్సర్. తాజా అధ్యయనాల ప్రకారం పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్‌కు కారణం ఆహారపదార్ధాలని తెలింది.
Prostate Cancer
Prostate Cancer

Prostate Cancer

సైలెంట్ కిల్లర్‌గా పిలవబడే ప్రోస్టేట్ క్యాన్సర్‌‌తో బాధపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఆరంభంలో వీటి లక్షణాలను గుర్తించకపోవడం కారణంగా ప్రోస్టేట్ క్యాన్సర్‌ ‌ తీవ్ర సమస్యగా మారుతుంది. పురుషుల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటి. ఈ వ్యాధి కలగడానికి అనేక అంశాలు కారణమవుతున్నాయి. ముఖ్యంగా 80 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. మరోవైపు, , రక్త సంబంధీకులకు ఇప్పటికే ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటే, కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా, ఊబకాయం బాధపడుతున్న వారిలో కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ.

ట్రెండింగ్ వార్తలు

Tomato Halwa Recipe: టమాటో హల్వా ఎప్పుడైనా తిన్నారా? తింటే మైమరిచిపోతారు, రెసిపీ ఇదిగో

Happy Mothers Day : ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. మదర్స్ డే శుభాకాంక్షలు ఇలా చెప్పండి

Breathing Cancer With Car : కారులోని కెమికల్స్ ద్వారా బ్రీతింగ్ క్యాన్సర్.. అధ్యయనంలో షాకింగ్ నిజాలు!

Shawarma Food Poison: షావర్మా తిని ఎక్కువ మంది అనారోగ్యం పాలవుతున్నారు ఎందుకు? ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు ఎందుకు గురవుతోంది?

ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు-

మూత్ర విసర్జనలో ఇబ్బందులు

వ్యాధి ప్రారంభ సమయంలో మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఏర్పడుతాయి. తరచుగా మూత్ర విసర్జన చేయడం. ముఖ్యంగా రాత్రి సమయంలో ఎక్కువగా మూత్రం వచ్చినట్లుగా అనిపించడం ద్వారా నిద్రకు భంగం కలుగుతుంది.

పెల్విక్ నొప్పి

రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించే విధంగా శరీరంలో నొప్పి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ లక్షణాలు ఎక్కువగా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నవారిలో కనిపిస్తుంటాయి. క్యాన్సర్ కణాల ప్రభావంతో తుంటి, పొత్తికడుపులో చాలా నొప్పి ఉంటుంది.

మూత్రవిసర్జన సమయంలో నొప్పి

వ్యక్తికి మూత్ర విసర్జనలో నొప్పి ఉంటుంది. కొన్నిసార్లు మూత్ర విసర్జన చేయడం కష్టంగా మారుతుంది, దీని కారణంగా మూత్రాశయంలో ఇబ్బందులు ఏర్పడుతాయి.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి

పై ప్రారంభ లక్షణాలు కనిపిస్తే, మీరు ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. లక్షణాలు మరింత తీవ్రంగా మారినట్లయితే, తప్పనిసరిగా వైద్య చికిత్స తీసుకోవాలి.

- మూత్రం లేదా వీర్యంలో రక్తం -

తీవ్రమైన నొప్పి

- తరచుగా మూత్రవిసర్జన

మూత్రవిసర్జన చేసేటప్పుడు మంటగా అనిపించడం -

శారీరక సంబంధం సమయంలో నొప్పి -

మూత్రవిసర్జన ప్రారంభించడంలో ఇబ్బంది

సరైన ఆహార నియమాలు పాటించకపోతే ప్రోస్టేట్ క్యాన్సర్‌ తీవ్రత పెరుగుతుంది.

తదుపరి వ్యాసం