తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Menstruation : 33ఏళ్ల పురుషుడికి ‘పీరియడ్స్​’.. వైద్యులు షాక్​

Menstruation : 33ఏళ్ల పురుషుడికి ‘పీరియడ్స్​’.. వైద్యులు షాక్​

Sharath Chitturi HT Telugu

11 July 2022, 18:04 IST

    • చైనాలో ఓ పురుషుడికి పీరియడ్స్​ అవుతున్నాయి. 33ఏళ్ల తర్వాత అతను ఆ విషయాన్ని తెలుసుకున్నాడు!
33ఏళ్ల పురుషుడికి ‘పీరియడ్స్​’..
33ఏళ్ల పురుషుడికి ‘పీరియడ్స్​’.. (HT)

33ఏళ్ల పురుషుడికి ‘పీరియడ్స్​’..

మహిళల్లో పీరియడ్స్​ అనేది చాలా సహజమైన ప్రక్రియ. పురుషుల్లో అది ఉండదు. కానీ చైనాలోని ఓ పురుషుడికి పీరియడ్స్​ వస్తున్నాయి. 33ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని అతను తెలుసుకుని షాక్​ అయ్యాడు.

ట్రెండింగ్ వార్తలు

Israel-Hamas war: ఐరాసలో పాలస్తీనాకు అనుకూలంగా ఓటేసిన భారత్; నెగ్గిన ప్రతిపాదన

International Space Station: మే 14 వరకు ఈ సమయాల్లో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ను నేరుగా చూసే అవకాశం

Crime news : దారుణం.. తల్లి, భార్యను చంపి- పిల్లల్ని మేడ మీద నుంచి పడేసి.. చివరికి..!

Prajwal Revanna case : ప్రజ్వల్​ రేవన్నపై ఫిర్యాదు చేసిన బీజేపీ నేత అరెస్ట్​- మరో మహిళపై..

33ఏళ్లకు..

మూత్రం సరిగ్గా రావడం లేదని 20ఏళ్ల క్రితం ఆ వ్యక్తికి వైద్యులు ఆపరేషన్​ చేశారు. కొన్ని రోజులు బాగానే ఉన్నా.. ఆ తర్వాత తరచూ మూత్రం నుంచి రక్తం వచ్చేది. కొంత కాలం తర్వాత.. అతనికి పొత్తి కడుపులో నొప్పి మొదలైంది. నాలుగు రోజులైనా తగ్గకపోవడంతో వైద్యుల దగ్గరకు వెళ్లారు. వారు పరీక్షలు నిర్వహించి అపెండిసైటిస్​ అని తేల్చాచారు. వైద్యం చేసి పంపించేశారు. కానీ అతనికి కడుపు నొప్పి తగ్గలేదు.

అసలు విషయం గతేడాదే బయటపడింది. చెకప్​ కోసం ఆ 33ఏళ్ల వ్యక్తి మళ్లీ వైద్యుల వద్దకు వెళ్లాడు. అతనికి వస్తున్న పొత్తి కడుపు నొప్పికి, మూత్రం ద్వారా బయటకు వస్తున్న రక్తానికి సంబంధం ఉందని నిర్ధరించారు. అతనికి పీరియడ్స్​ వస్తున్నట్టు గ్రహించారు. ఆ 33ఏళ్ల వ్యక్తిలో ఫీమేల్​ క్రోమోజోమ్స్​ ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.

మరిన్ని పరీక్షలు చేయగా.. ఆ వ్యక్తిలో ఫిమేల్​ రిప్రొడక్టివ్​ ఆర్గన్లు అయిన యుటీరస్​, ఓవరిస్​ కనిపించాయి. అతనిలో మేల్​ సెక్స్​ హార్మోన్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఫీమేల్​ సెక్స్​ హార్మోన్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఆరోగ్యవంతమైన మహిళలాగే అతని అవయవాలు పనిచేస్తున్నాయి.

ఇలాంటి వారిని 'ఇంటర్​సెక్స్​' అని పిలుస్తారు. 30ఏళ్ల పాటు పురుషుడిగా ఉన్న అతనికి ఈ విషయం చాలా బాధ కలిగించింది. డిప్రెస్​ అయిపోయాడు. ఫిమేల్​ రిప్రొడక్టివ్​ ఆర్గన్లు తొలగించాలని వైద్యులను అభ్యర్థించాడు.

గత నెల 6న అతనికి ఆపరేషన్​ జరిగింది. అతను 10 రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యాడు.

తదుపరి వ్యాసం