Cooker Disadvantages : కుక్కర్‌లో వంట చేయడం మంచిదేనా? ఆరోగ్యం పాడవుతుందా?
20 February 2024, 18:30 IST
- Food In Cooker : కాలం మారిపోయింది. వంటలు కూడా క్షణాల్లో జరిగిపోవాలి. ఆ ఆలోచనల్లో నుంచి వచ్చినదే కుక్కర్ లో వంట చేయడం. ఇందులో చేసింది తింటే మంచిదేనా?
కుక్కర్‌లో వంట చేయడం మంచిదేనా?
ఒకప్పుడు వంట చేయాలంటే చాలా సమయం పట్టేది. కానీ ఈ మధ్యకాలంలో వండటం అంచే చాలా ఈజీ. కాస్త బియ్యం కడిగి ఎలక్ట్రిక్ కుక్కర్‌లో పెడితే చాలు అదే వండేసుకుంటుంది. నిజానికి మనం ఆరోగ్యకరమైన ఆహారాల గురించి చర్చిస్తాం. కానీ వాటిని ఫాలో అవ్వం. ఆహారాన్ని వండే పద్ధతి గురించి ఎప్పుడూ ఆలోచించం. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే వంట పద్ధతి కుక్కర్‌లో వండడం.
మన పూర్వీకులు కుండలతో వంట చేయడానికి కట్టెలను ఉపయోగించేవారు. వారంతా ఆరోగ్యంగా జీవించారు. మనం నెలలో ఒక్కసారైనా ఆసుపత్రికి వెళ్లాలని ఆలోచిస్తుంటాం. కానీ మన పూర్వీకులు అలా కాదు. మనం తినే ఆహారం, వండే పద్ధతి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కుక్కర్‌లో వండుకోవడం ఆరోగ్యకరమా అన్నది ఇప్పుడు చాలామందికి ఉన్న పెద్ద ప్రశ్న.
ప్రెషర్ కుక్కర్‌లో వండేటప్పుడు అధిక పీడనంతో కుక్కర్‌లోకి ఆవిరి బలవంతంగా వస్తుంది. ఈ ఆవిరి పీడనమే ఆహారాన్ని ఉడికిస్తుంది. ఆహారంలో పోసిన నీరు వేడిచే ఉడకబెట్టబడుతుంది. ఆ పీడనం ఆహారాన్ని ఉడికించే వేగాన్ని పెంచుతుంది. ఈ పద్ధతిలో కుక్కర్ నుండి వేడి ఆవిరి ద్వారా ఆహారానికి బదిలీ అవుతుంది.
సులభంగా జీర్ణం
ఆహారంలోని పోషకాలను వేడి చేసి ఆవిరితో వదిలివేయడం వల్ల ఇది అనారోగ్యకరమని కొందరు అంటున్నారు. కొందరికి ఇది ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఆహారాన్ని త్వరగా వేడి చేస్తుంది. ఆహారంలో పోషకాలను నిలుపుకుంటుంది. కుక్కర్‌లో వంట చేస్తే ఆరోగ్యకరమైనదిగా కొందరు పరిగణిస్తారు. ఇవి కూరగాయలలోని పోషకాలను నిలుపుకుంటాయని వైద్యులు చెబుతున్నారు. కుక్కర్ ఒక్కో ఆహారం భిన్నంగా ఉంటుంది. అన్నం ఉడకబెట్టడం, కూరగాయలు ఉడికించడం చేస్తే సులభంగా ఉడుకుతుంది. ఇది మాంసాన్ని బాగా వండుతుంది. సులభంగా జీర్ణం చేస్తుంది.
సమస్యలు కూడా ఉన్నాయి
అయితే కుక్కర్‌లో వండితే సమస్యలు కూడా ఉన్నాయి. అక్రిలమైడ్ అనే రసాయనాన్ని సృష్టిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన పదార్ధం. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్, వంధ్యత్వం, నాడీ వ్యవస్థ లోపాలు వంటి అనేక సమస్యలు వస్తాయి.
ఈ ప్రమాదాలు ఉండవచ్చు
కుక్కర్‌లో వంట చేయడం వల్ల మీ ఆహారంలోని లెక్టిన్‌లు ప్రభావితం అవుతాయని చెబుతారు. లెక్టిన్ చాలా హానికరమైన రసాయనం, ఇది ఆహార పదార్థాల పోషక విలువలను తగ్గించడం ద్వారా ఖనిజాల శోషణను నిరోధిస్తుంది. కుక్కర్‌లో వంట చేయడం వల్ల సమయం ఆదా అవుతుందని తెలుసు. కుక్కర్‌లో వంట చేసే సమయం ఇతర పని కోసం వాడుకోవచ్చు.
కుక్కర్‌లో వండిన ఆహారం రుచి నచ్చితే లేదా ఎక్కువసేపు ఉడికించే సమయం లేకపోతే కుక్కర్‌లో వంట చేయడం మీకు ఉత్తమమైన ఎంపిక. కాకపోతే మీకు వంటకు అనేక ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. ఇతర వంట పద్ధతుల వలె కుక్కర్‌లో వండటం లాభాలు, నష్టాలను కలిగి ఉంటుంది.
అయితే అన్నాన్ని ఎలక్ట్రిక్ కుక్కర్ మీద వండకపోవడమే మంచిది. ఇది చాలా సమస్యలను కలిగిస్తుంది. వీలైతే కట్టెల పొయ్యి, లేదంటే గ్యాస్ మీద అన్నం వండుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. శరీరానికి పోషకాలు లభిస్తాయి.