తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pre Wedding Hair Care Tips : పెళ్లి సమయానికి.. మీ జుట్టుకు ఇలా సిద్ధం చేసుకోండి

Pre Wedding Hair Care Tips : పెళ్లి సమయానికి.. మీ జుట్టుకు ఇలా సిద్ధం చేసుకోండి

02 December 2022, 20:30 IST

google News
    • Pre Wedding Hair Care Tips : అమ్మాయిలకు జుట్టు అంటే ఎంత ఇష్టమో చెప్పనవసరం లేదు. పైగా రానున్నది పెళ్లిళ్ల సీజన్. ఈ సమయంలో ప్రతి అమ్మాయి అందంగా కనిపించాలనుకుంటుంది. ముఖ్యంగా హెయిర్. రకరకాల స్టైల్స్​లో జుట్టును సెట్ చేసుకుంటారు. అయితే పెళ్లికి ముందే జుట్టుపై తగిన శ్రద్ధ చూపించాలి అంటున్నారు నిపుణులు.
జుట్టు సంరక్షణ చిట్కాలు
జుట్టు సంరక్షణ చిట్కాలు

జుట్టు సంరక్షణ చిట్కాలు

Pre Wedding Hair Care Tips : పెళ్లి చేసుకోబోతున్నా.. పెళ్లికి అటెండ్ అవ్వబోతున్నా.. మీరు జుట్టు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. మెరిసే, మృదువైన, అందమైన జుట్టుకోసం.. మీరు ఇప్పటినుంచి కొన్ని హెయిర్‌కేర్ చిట్కాలను అనుసరించవచ్చు. బ్రైడల్ లెహెంగా, ఆభరణాలు, మేకప్, వెడ్డింగ్ డెకర్‌లు చాలా ముఖ్యమైనవి. అయితే వివాహానికి ముందు చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ కూడా అంతే ఇంపార్టెంట్. అప్పటికప్పుడు సెట్ చేసుకుందామంటే కుదరదు. నెలలకు ముందుగానే మీరు హెయిర్ కేర్ చిట్కాలను అనుసరించాలి.

మీ జుట్టుకు ఆయిల్ అప్లై చేస్తూ ఉండండి..

వివాహానికి ముందు మీ జుట్టు సంరక్షణలో అత్యంత ముఖ్యమైన దశల్లో నూనె అప్లై చేయడం ఒకటి. మీ తలకు, జుట్టుకు నూనె రాసుకోవడం వల్ల మీ హెయిర్ మృదువుగా, ఆరోగ్యంగా మారుతుంది. హాట్ ఆయిల్ మసాజ్‌లు మీ తలలో రక్త ప్రసరణను పెంచి మీ జుట్టును రిపేర్ చేస్తుంది.

మీ జుట్టుకు మంచి పోషణను అందించడం కోసం కొబ్బరి నూనె, బృంగరాజ్ ఆయిల్, ఆర్గాన్ ఆయిల్, ఆముదం వంటి నూనెలు మీ జుట్టును హెల్తీగా ఉంచుతాయి. మసాజ్ చేసిన తర్వాత.. కొన్ని గంటవల్లో జుట్టును వాష్ చేయాలి.

ఆర్గానిక్ షాంపూ, కండీషనర్ వాడండి..

మీ తల, జుట్టుకు హాని కలిగించే సల్ఫేట్లు, పారాబెన్‌ల వంటి రసాయనాలతో నిండిన షాంపూలు, కండీషనర్లకు దూరంగా ఉండండి. మీ పెళ్లికి కొన్ని నెలల ముందునుంచే.. ఆర్గానిక్ షాంపూ, కండీషనర్లు వాడండి. హానికరమైన పదార్థాలు లేని సహజ, సేంద్రీయమైనవి వాడండి.

మీ తల పొడిబారిపోకుండా.. మీ స్కాల్ప్​ను డీహైడ్రేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి.. ఎక్కువగా షాంపూ చేయకండి. మీరు వారానికి రెండుసార్లు షాంపూ చేయవచ్చు.

హెయిర్ మాస్క్ తప్పనిసరిగా వేయండి..

వారానికి కనీసం రెండుసార్లు పోషకమైన హెయిర్ మాస్క్ ఉపయోగించండి. ఇంట్లో తయారుచేసిన హెయిర్ మాస్క్‌లు మీ స్కాల్ప్‌ను ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. కండిషన్ చేయడం మాత్రమే కాకుండా మలినాలను, చుండ్రును తొలగించడంలో సహాయపడతాయి.

ఒక అరటిపండు, తేనె, పెరుగు కలిపి మెత్తగా చేయాలి. దీనిని బాగా కలిపి.. మీ జుట్టుకు మాస్క్ వేయండి. 20 నుంచి 30 నిమిషాలు దానిని ఉంచి.. మీ హెయిర్ క్లెన్సర్‌తో కడగాలి. అలాగే మీ పెళ్లి రోజుకు ముందు మూడు నెలల పాటు ప్రతి నెలా ఒకసారి హెయిర్ స్పా చేయించుకోండి.

రెగ్యులర్ ట్రిమ్‌లు తప్పనిసరి..

మీరు జుట్టు కత్తిరించినా.. చేయకపోయినా.. మీ జుట్టును ప్రతి నెలా సగటున పావు అంగుళం పెరుగుతుందని మీకు తెలుసా? అందుకే మీ జుట్టు ఏ రకంగా ఉన్నా మీరు రెగ్యులర్ ట్రిమ్‌లకు వెళ్లాలి. రెగ్యులర్ ట్రిమ్‌లు.. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అంతేకాకుండా చివర్ల చిట్లడం నివారిస్తాయి. ఇది జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. మీకు మంచి లుక్​ని ఇస్తుంది.

హెల్తీ ఫుడ్ తీసుకోండి..

మీ జుట్టును బాహ్యంగా చూసుకోవడమే కాకుండా.. లోపలి నుంచి ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే.. హెల్తీఫుడ్ తీసుకోండి. పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మీ జుట్టు లోపలి నుంచి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మీ ఆహారంలో నట్స్, గుడ్లు, బెర్రీలు, అవకాడోలు, చేపలు, గింజలు, ఆకుపచ్చ కూరగాయలను ఎక్కువగా తీసుకోండి. మీరు బయోటిన్, అమినో యాసిడ్స్, ఫోలిక్ యాసిడ్స్ వంటి హెయిర్ సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు.

తదుపరి వ్యాసం