Extreme hair growth all over the body: శరీరం నిండా రోమాలు పెరిగే అరుదైన వ్యాధి
25 November 2022, 19:15 IST
Extreme hair growth all over the body: మధ్య ప్రదేశ్ లోని ఒక యువకుడు అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. బాల్యం నుంచి ఈ వ్యాధి కారణంగా ఇతరులతో కలవలేకపోయేవాడు. సహ విద్యార్థుల నుంచి వివక్షను, హేళనలను ఎదుర్కొన్నాడు.
అరుదైన వ్యాధితో బాధ పడుతున్న మధ్య ప్రదేశ్ యువకుడు
Extreme hair growth all over the body: మధ్య ప్రదేశ్ లోని నంద్లెట గ్రామానికి చెందిన యువకుడు లలిత్ పాటిదార్. వయస్సు 17 ఏళ్లు. 12వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి శరీరమంతా వెంట్రుకలు పెరిగే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధి కలిగించే బాధ కన్నా, సమాజం తనపై చూపుతున్న వివక్ష, హేళన, అంటరానితనం మరింత బాధ కలిగిస్తున్నాయని ఆ యువకుడు ఆవేదన చెందుతున్నాడు.
'werewolf syndrome' : 6 ఏళ్ల వయస్సు నుంచే..
ఆరేళ్ల వయస్సు నుంచి ఈ సమస్యతో లలిత్ బాధ పడుతున్నాడు. ఆరేళ్ల వయస్సు వచ్చే వరకు ఏ సమస్య లేదని, ఆరేళ్ల వయస్సులో తన శరీరంపై వెంట్రుకలు పెరుగుతుండడం గమనించారని వెల్లడించారు. కొన్ని రోజుల్లోనే శరీరమంతా అవి వ్యాపించాయని, డాక్టర్లను సంప్రదిస్తే, ఇది అరుదైన వ్యాధి అని, దీనికి చికిత్స లేదని చెప్పారని వెల్లడించాడు.
hypertrichosis: స్కూల్ లో అవహేళన
తమది చిన్న రైతు కుటుంబమని లలిత్ తెలిపాడు. ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్నానని, చిన్నప్పటి నుంచి పాఠశాలలో, సమాజంలో వివక్షను, అవహేళలను ఎదుర్కొన్నానని ఆవేదనగా చెప్పాడు. ‘స్కూల్లో మంకీ మ్యాన్ అని పిలిచేవారు. నన్ను చూసి భయపడి, నా దగ్గరకు వచ్చేవారు కాదు. నేను కరుస్తానని భయపడేవారు. బయట కూడా చాలా అవహేళన ఎదుర్కొన్నాను. ఈ సమస్య తగ్గదని, దీనితో జీవితాంతం కలిసి ఉండాల్సిందేనని అర్థం చేసుకున్నాను’’ అని ఆవేదనగా చెప్పాడు. ఖాళీ సమయాల్లో తండ్రికి పొలం పనుల్లో సాయం చేస్తుంటానన్నాడు.
hypertrichosis: సమస్య ఏంటి?
ఈ సమస్యను ‘వర్ వోల్ఫ్ సిండ్రోమ్’ అంటారు. అంటే, తోడేలులా శరీరమంతా రోమాలు పెరిగే సమస్య. దీన్నే ‘హైపర్ ట్రైకోసిస్’ అని కూడా అంటారు. చాలా, చాలా అరుదుగా వచ్చే జన్యుపరమైన సమస్య ఇది. పురుషులు, స్త్రీలు, ఎవరికైనా ఈ వ్యాధి రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 50 మంది మాత్రమే ఈ వ్యాధి బారిన పడ్డారు. హెయిర్ ను షేవ్ చేసుకోవడం, లేజర్ ట్రీట్ మెంట్, కాస్మెటిక్ ట్రీట్ మెంట్, డెపిలేటరీ క్రీమ్స్, ఎలక్ట్రాలిసిస్ .. వంటివి ఈ సమస్యకు తాత్కాలికంగానే ఉపశమనం అందివ్వగలవు.