తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Potato Storage: ఉడికించిన బంగాళాదుంపలను, వండిన కూరను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా? అలా చేయకూడదని తెలుసా?

Potato Storage: ఉడికించిన బంగాళాదుంపలను, వండిన కూరను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా? అలా చేయకూడదని తెలుసా?

Haritha Chappa HT Telugu

24 April 2024, 10:30 IST

google News
    • Potato Storage: ఇంట్లోనే బంగాళదుంపలు కచ్చితంగా ఉంటాయి. వాటిని ఉడికించాక లేదా కూరగా వండాక ఫ్రిజ్‌లో నిల్వ చేసే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. అలా ఉడికించిన బంగాళదుంపలను ఎందుకు నిల్వ చేయకూడదో తెలుసుకోండి.
బంగాళాదుంపల నిల్వ చేయడం ఎలా?
బంగాళాదుంపల నిల్వ చేయడం ఎలా? (Pixabay)

బంగాళాదుంపల నిల్వ చేయడం ఎలా?

Potato Storage: ప్రతి ఇంట్లోనూ వారానికి కనీసం ఒక్కసారైనా బంగాళదుంప కూర ఉండాల్సిందే. ఇక ఆలూ ఫ్రై, ఆలూ పలావ్ ఇలా రకరకాల కూరలు, రకరకాల వంటకాలు దీంతో వండుకుంటారు. ఒక్కోసారి బంగాదుంపలను ఉడికించాక ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడం, బంగాళాదుంప కూర లేదా వేపుడు మిగిలిపోతే దాన్ని ఫ్రిజ్లో నిల్వ చేసి మరుసటి రోజు తినడం వంటివి చేస్తారు. ఇలా చేయడం మంచి పద్ధతి కాదని అంటున్నారు పోషకాహార నిపుణులు.

మిగిలిపోయిన ఆహారాన్ని ఆదా చేసేందుకు ఇలా ఫ్రిజ్లో నిల్వ చేసి మరుసటి రోజు తింటారు. అయితే ఉడకబెట్టిన బంగాళాదుంపలను నిల్వ చేసి మళ్ళీ తినడం అనేది మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా ఫ్రిజ్లో నిల్వ చేయడం వల్ల కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు.

ఎందుకు ఫ్రిజ్‌లో పెట్టకూడదు?

ఉడికించిన బంగాళదుంపలను లేదా వండిన బంగాళాదుంపలను ఫ్రిజ్లో చల్లని ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం వల్ల రుచి మారిపోతుంది. బంగాళదుంపలు గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే నిల్వ చేయాలి. అప్పుడే వాటి సహజ రుచిని కలిగి ఉంటాయి. ఉడికించిన బంగాళాదుంపల్లో విటమిన్ సి, పొటాషియం, డైటరీ ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మీరు ఎప్పుడైతే రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేస్తారో... అప్పుడు కొన్ని పోషకాలను కోల్పోతాయి. చల్లని ఉష్ణోగ్రతలకు గురి చేయడం వల్ల పోషక విలువలు స్థాయిలు పడిపోతాయి. అలాంటి బంగాళదుంపలను తినడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు.

ఉడికించిన బంగాళదుంపలను ఫ్రిడ్జ్ లో నిల్వ చేయడం వల్ల వాటి ఆకారంలో కూడా మార్పు వస్తుంది. బంగాళాదుంపలలో పిండి పదార్థం అధికంగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఫ్రిజ్లో పెడతారో అక్కడ చల్లని వాతావరణానికి ఈ పిండి పదార్థం స్పటికంగా గట్టిపడుతుంది. దీన్ని మళ్లీ వేడి చేసి తిన్నప్పుడు అవి పూర్తిగా కరగవు. ఆ పిండి చిన్న చిన్న స్పటికాలుగా మారుతాయి. అలాంటి ఆహారాన్ని తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.

రిఫ్రిజిరేటర్లో ఉంచిన బంగాళాదుంపలను తిరిగి వండి తిన్నా కూడా ఆరోగ్యానికి ప్రమాదమే. ఎంత ఫ్రిజ్లో నిల్వ చేసినా కూడా బంగాళదుంపలలో బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. అది మెత్తగా మారిపోవడం అనేది... అవి చెడిపోతున్నాయని చెప్పడానికి సంకేతం. ఉడికించిన బంగాళదుంపలను వీలైనంతగా గది ఉష్ణోగ్రత మధ్య నిలువ చేయడానికి ప్రయత్నించండి. అవి త్వరగా పాడవకుండా ఉంటాయి. గాలి చొరబడని డబ్బాల్లో వేసి వెంటిలేషన్ వచ్చే చోట, గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే... మీకు రుచిలో, రంగులో, ఆకృతిలో ఎలాంటి మార్పు ఉండవు. ఇంకా చెప్పాలంటే ఆ రోజుకు ఎంత అవసరమో అంతే వండుకొని తింటే ఇలా నిల్వ చేయాల్సిన కష్టం ఉండదు. కాబట్టి ఎంత అవసరమో అంతే వండుకొని తింటే సరిపోతుంది.

తదుపరి వ్యాసం