తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Children Sleeping Tips : పిల్లల కోసం ఇలా నిద్ర షెడ్యూల్ ప్లాన్ చేయండి

Children Sleeping Tips : పిల్లల కోసం ఇలా నిద్ర షెడ్యూల్ ప్లాన్ చేయండి

Anand Sai HT Telugu

13 January 2024, 20:00 IST

google News
    • Children Sleeping Tips Telugu : పిల్లల ఎదుగుదల, ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యమైనది. అందుకే పిల్లలు సరిగా నిద్రపోయే వాతావరణాన్ని సృష్టించాలి.
పిల్లల కోసం నిద్ర షెడ్యూల్
పిల్లల కోసం నిద్ర షెడ్యూల్

పిల్లల కోసం నిద్ర షెడ్యూల్

పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నిద్ర చాలా అవసరం. ఇది మన శారీరక ఆరోగ్యంతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. వయస్సుకి తగిన నిద్ర లేని పిల్లల ప్రవర్తనా, ఎదుగుదలలో సమస్యలను కలిగి ఉంటారు. సరైన నిద్ర విధానం లేకుంటే మీ పిల్లలు మరింత ఇబ్బందులు పడతారు. దీని కారణంగా కొన్ని విషయాలపై తక్కువ శ్రద్ధ చూపవచ్చు. బాల్యంలో, కౌమారదశలో చిరాకు, జ్ఞాపకశక్తి కోల్పోవడంతో బాధపడవచ్చు.

సరిగ్గా నిద్రపోని పిల్లలలో ఎదుగుదల సమస్యలు, ముఖ్యంగా ఊబకాయం ఉన్నట్లు అనిపిస్తుంది. దీర్ఘకాలిక నిద్రలేమిని అనుభవించే పిల్లలు ఊబకాయం, మధుమేహం, హృదయ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి సరైన నిద్రవేళ షెడ్యూల్‌ను ఎలా రూపొందించాలో తెలుసుకోండి.

ఆరోగ్యకరమైన నిద్రవేళ దినచర్యను రూపొందించడానికి, శిశువును నిద్రపోయేటప్పుడు మాత్రమే మంచం వాడకాన్ని పరిమితం చేయాలి. ఇది నిద్రవేళ కాబట్టి శిశువును మంచానికి తీసుకెళ్లే సమయం ఆసన్నమైందని వారికి నచ్చజెప్పాలి.

విశ్రాంతి కోసం మంచం ఉపయోగించాలి. మిగిలిన సమయంలో కూర్చుని టీవీ చూడటం, ఆటలు ఆడటం వంటివి చేయించాలి. మంచంపై ఇలాంటి పనులు చేయించకూడదు. ఇలా చేయడం వల్ల పిల్లవాడు ఎప్పుడూ మంచం మీదనే ఉంటాడు. ఇది మరింత చురుకుగా ఉండకుండా చేస్తుంది. వారిని సోమరులుగా తయారుచేస్తుంది.

పిల్లలు నిద్రించడానికి 30 నిమిషాల ముందు బెడ్ మీదకు తీసుకెళ్లండి. మీ బిడ్డ నిద్రపోయే ముందు మీరు వారికి కథలు చెప్పాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో మంచి సంగీతాన్ని ప్లే చేయాలి. నిద్రవేళకు ఒక గంట ముందు స్క్రీన్ చూడకుండా చేయాలి. ఇవి మీ పిల్లల ఆరోగ్యానికి, వారి ప్రశాంతమైన నిద్రకు సహాయపడతాయి. దీన్ని రోజువారీ దినచర్యగా చేసుకోండి. తద్వారా ఇది మీ పిల్లల అలవాటుగా మారుతుంది.

నిద్రను ప్రేరేపించడానికి మీ బిడ్డకు కనీసం 2 గంటల ముందు ఆహారం ఇవ్వడం మంచిది. దీని వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి బిడ్డకు గ్యాస్ సమస్యలు రావు. శిశువులకు ఆహారం ఆలస్యంగా ఇస్తే, అది వారి జీర్ణక్రియ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. నిద్రలేమి సమస్యను కలిగిస్తుంది. ఇది పిల్లల నిద్రవేళను ఆలస్యం చేస్తుంది.

నిద్రవేళ, మేల్కొనే సమయం ప్రతిరోజూ ఒకేలా ఉండేలా చూసుకోవడం సిర్కాడియన్ రిథమ్‌ను రూపొందించడంలో సహాయపడుతుంది. ఇది పిల్లలలో మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది.

తదుపరి వ్యాసం