తెలుగు న్యూస్  /  Lifestyle  /  Pigeon Poop Causes Diseases Here's Complete Details

Health Problems With Pigeons : పావురాలతో డేంజర్.. ఈ ఆరోగ్య సమస్యలు తప్పవట!

HT Telugu Desk HT Telugu

10 March 2023, 10:44 IST

    • Health Problems With Pigeons : పావురాల కారణంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే మనుషులలో హైపర్సెన్సిటివిటీ న్యుమోనైటిస్ (HP), ఇతర ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తున్నాయి.
పావురాలతో ఆరోగ్య సమస్యలు
పావురాలతో ఆరోగ్య సమస్యలు

పావురాలతో ఆరోగ్య సమస్యలు

బెంగళూరులో పావురాల కారణంగా ఓ రకమైన భయం నెలకొంది. ఎందుకంటే మానవులలో హైపర్‌సెన్సిటివిటీ న్యుమోనైటిస్ (HP), ఇతర ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. పలువురు వైద్యులు పావురాల(Pigeon) సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే విషయమని అంగీకరిస్తున్నారు. ప్రజల్లో విస్తృతంగా అవగాహన లేకపోవడం వల్ల హెచ్‌పి, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ కేసులు పెరగడానికి పావురాల మలం ప్రధాన కారణమని పల్మోనాలజిస్టులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Calcium: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే ప్రతిరోజూ క్యాల్షియం సప్లిమెంట్లు తీసుకోవాలని అర్థం

Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యుషన్లో 89 సంఖ్య మధ్య మరో అంకె దాక్కుని ఉంది, అది ఏదో 10 సెకన్లలో కనిపెట్టండి

Cancer causing chemicals మీరు కొనే ఉత్పత్తుల్లో ఈ పదార్థాలు ఉంటే వాటిని కొనకండి, ఇవన్నీ క్యాన్సర్ కారకాలు

Bael Fruit: నెలకోసారైనా వెలగపండు తినాల్సిందే, ఇది తింటే ఆ సమస్యలన్నీ దూరం

హైపర్‌సెన్సిటివిటీ న్యుమోనైటిస్(HP) కారణంగా 20 మందికి పైగా మరణించిన ముంబయితో పోలిస్తే, బెంగళూరు(Bengaluru)లో పరిస్థితి అంత ఘోరంగా లేదు. కానీ బెంగళూరులో పావురాలను పెంచే సంస్కృతి పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చికిత్స చేసిన సందర్భాల్లో హెచ్‌పికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, రోగులు పావురాల తినేవారు లేదా పావురాల సమీపంలో నివసిస్తున్నారని అంటున్నారు.

పావురాల(Pigeon) వద్దకు, వాటి రెట్టల వద్దకు ఒకటి రెండు సార్లు వెళ్లినా హెచ్‌పి రాదు. కానీ దీర్ఘకాలంలో ప్రభావం చూపుతుందని అంటున్నారు. మీరు మీ ఇంటికి వచ్చే పావురాలకు క్రమం తప్పకుండా ఆహారం ఇస్తే రెట్టలు మీ ఇంట్లో, చుట్టుపక్కల ఉంటాయి. అయితే శ్వాస పీలుస్తున్నప్పుడు రెట్టల కారణంగా సమస్యలు వస్తాయి.

హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ లేదా బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్.. ఇది ఊపిరితిత్తులకు వచ్చే అలెర్జీ. పావురాల వదిలే రెట్టలతో వచ్చే వ్యాధి. నిమోనియాకు దగ్గరగా లక్షణాలు ఉంటాయి. ఈ అలెర్జీతో జ్వరం, దగ్గు, కీళ్ల నొప్పులు, శ్వాస ఆడకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. పావురాల మూత్రం, మలం కలిపి ఒకేసారి విసర్జిస్తాయి. ఇది ప్రమాదకరం. రెట్ట ఎండిపోయాక.. కణాలుగా గాలిలో కలిసి పోతాయి. గింజలు వేసేందుకు వెళ్లిన వారికి శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లో చేరుతాయి. అలెర్జీకి, ఇన్ఫెక్షన్(Infection)కు కారణం అవుతుంది. అది ముదిరి ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తాయి. పావురాలకు ఆహారం ఇవ్వడం మానేయడం, అవి ఉన్న చోటికి వెళ్లకుండా ఉండటం ఉత్తమ చికిత్స అని వైద్యులు చెబుతున్నారు.

టాపిక్