తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tamannaah With Bf: బాయ్‌ఫ్రెండ్‌తో డిన్నర్ డేట్‌‌‌ వెళ్లిన తమన్నా.. స్టైలిష్ జంట లుక్ వివరాలివే

Tamannaah with BF: బాయ్‌ఫ్రెండ్‌తో డిన్నర్ డేట్‌‌‌ వెళ్లిన తమన్నా.. స్టైలిష్ జంట లుక్ వివరాలివే

11 August 2024, 18:30 IST

google News
  • Tamannaah with BF: తమన్నా భాటియా, విజయ్ వర్మ నిన్న రాత్రి డిన్నర్ డేట్ కు వెళ్లారు. ఈ జంట చేతులు పట్టుకుని రెస్టారెంట్ నుంచి బయటకు వస్తుండగా ఫొటోలు దిగారు. వాళ్ల స్టైలిష్ లుక్ వివరాలు చూసేయండి.

బాయ్ ఫ్రెండ్‌‌తో తమన్నా
బాయ్ ఫ్రెండ్‌‌తో తమన్నా (HT Photo/Varinder Chawla)

బాయ్ ఫ్రెండ్‌‌తో తమన్నా

తమన్నా భాటియా, విజయ్ వర్మ నిన్న రాత్రి డిన్నర్ డేట్‌ను ఎంజాయ్ చేశారు. ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన ఈ కపుల్ ఫొటోలను మీడియా క్లిక్ మనిపించింది.

తమన్నా భాటియా, విజయ్ వర్మ డిన్నర్ డేట్:

తమన్నా, విజయ్ వర్మ డేటింగ్ కోసం బయటకు వెళ్లిన వీడియోను మీడియా షేర్ చేసింది. ఈ వీడియోలో తమన్నా భాటియా, విజయ్ వర్మ చేతులు పట్టుకుని బయటకు వస్తున్నారు. తమ కార్లలో కూర్చునే ముందు ఈ జంట కెమెరాలకు చిరునవ్వులు చిందిస్తూ పలకరించారు. ఈ డిన్నర్ ‌డేట్ కోసం తమన్నా డెనిమ్ షాకెట్, క్రాప్ టాప్, ప్యాంట్ ధరించగా, విజయ్ ఆమెకు సరిపోయేలా పూర్తి వైట్ కలర్ లుక్ లో ఉన్నారు.

స్టైల్ డీకోడ్:

తమన్నా స్టైలిష్ డిన్నర్ డేట్ లుక్ లో వైట్ క్రాప్ టాప్, స్కూప్ నెక్ లైన్, ఫ్రంట్ బటన్ క్లోజర్స్, ఫిట్ ఉన్న సిల్హౌట్ వేసుకున్నారు. డెనిమ్ వెయిస్ట్ బ్యాండ్, హై వెయిస్ట్ జీన్స్ ధరించారు.

హాఫ్ లెంగ్త్ స్లీవ్స్, కాలర్డ్ నెక్లైన్, ఓపెన్ ఫ్రంట్, సౌకర్యవంతమైన ఫిట్టింగ్ ఉన్న డెనిమ్ షాకెట్ తో తమన్నా లుక్ పూర్తయ్యింది. స్నీకర్స్, వాచ్, చెవిపోగులు, బంగారు గొలుసులతో ఆమె అలంకరించుకున్నారు. చివరగా గులాబీ రంగు పెదవులు, పింక్ బ్లష్‌తో బుగ్గలు, ఫెదర్డ్ ఐ వింగ్స్ తో గ్లామర్ లుక్ పూర్తయ్యింది.

విజయ్ లుక్ వివరాలు:

విజయ్ తమన్నాకు జతగా ఆల్ వైట్ లుక్ ఎంచుకున్నారు. షాకెట్, పోలో టీషర్ట్, ప్యాంటుతో లుక్ పూర్తి చేశారు. , ఓపెన్ ఫ్రంట్, కంఫర్ట్ ఫిట్ తో, ఫుల్ లెంగ్త్ స్లీవ్స్‌తో ఆ షాకెట్ ఉంది. బ్రౌన్ షూస్ తో డేట్ నైట్ లుక్ ను పూర్తి చేశాడు. ఈ లుక్ చూసిన నెటిజన్లు స్టైలిష్ గా ఉన్నారంటూ.. ట్రెండీ ప్రేమ పక్షులంటూ కామెంట్లు చేస్తున్నారు.

తమన్నా భాటియా మరియు విజయ్ వర్మ రిలేషన్:

తమన్నా భాటియా, విజయ్ వర్మ మొదట లస్ట్ స్టోరీస్ 2 సెట్స్ లో కలుసుకున్నారు. 2023 సిరీస్ షూటింగ్ తర్వాత వీరి రిలేషన్ మొదలైంది. తమ మొదటి డేటింగ్ జరగడానికి 20-25 రోజులు పట్టిందని విజయ్ గతంలో వెల్లడించాడు.

తదుపరి వ్యాసం