Tamannah Item Song: ఐటెమ్ సాంగ్‌లో నడుము ఒంపులతో రచ్చ చేసిన తమన్నా.. హారర్ కామెడీ మూవీలో స్పెషల్ అప్పియరెన్స్-tamannah bhatia item song from stree 2 released milky beauty stunned with her dance moves ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tamannah Item Song: ఐటెమ్ సాంగ్‌లో నడుము ఒంపులతో రచ్చ చేసిన తమన్నా.. హారర్ కామెడీ మూవీలో స్పెషల్ అప్పియరెన్స్

Tamannah Item Song: ఐటెమ్ సాంగ్‌లో నడుము ఒంపులతో రచ్చ చేసిన తమన్నా.. హారర్ కామెడీ మూవీలో స్పెషల్ అప్పియరెన్స్

Hari Prasad S HT Telugu
Jul 24, 2024 10:37 PM IST

Tamannah Item Song: తమన్నా స్త్రీ2 మూవీలో నటించిన ఆజ్ కీ రాత్ సాంగ్ జూలై 24న విడుదలైంది. ఈ పాటను స్త్రీ చిత్రంలోని నోరా ఫతేహి కమారియాతో పోలుస్తూ అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఐటెమ్ సాంగ్‌లో నడుము ఒంపులతో రచ్చ చేసిన తమన్నా.. హారర్ కామెడీ మూవీలో స్పెషల్ అప్పియరెన్స్
ఐటెమ్ సాంగ్‌లో నడుము ఒంపులతో రచ్చ చేసిన తమన్నా.. హారర్ కామెడీ మూవీలో స్పెషల్ అప్పియరెన్స్

Tamannah Item Song: స్త్రీ 2 మూవీలో తమన్నా నటించిన స్పెషల్ సాంగ్ బుధవారం (జులై 24) రిలీజైంది. అయితే సోషల్ మీడియాలో ఈ డాన్స్ సాంగ్ పై అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వర్గం సినీ ప్రియులు తమన్నా స్క్రీన్ ప్రెజెన్స్, ఆమె డ్యాన్స్ మూవ్స్ ను ప్రశంసించగా, మరికొందరు దీనిని స్త్రీ (2018) లోని నోరా ఫతేహి కమారియాతో పోల్చారు.

స్త్రీ 2లో తమన్నా ఐటెమ్ సాంగ్

రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ నటించిన స్త్రీ2 మూవీలో తమన్నా భాటియా ఓ ఐటెమ్ సాంగ్ చేసింది. ఆజ్ కీ రాత్ అంటూ సాగిపోయే ఈ పాటలో తమన్నా తన నడుము ఒంపులు, కళ్లు చెదిరే డ్యాన్స్ మూవ్స్ తో అదరగొట్టింది. ఈ సాంగ్ బుధవారం (జులై 24) ప్రేక్షకుల ముందుకు రాగా.. దీనిపై ఫ్యాన్స్ నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది.

నిజానికి ఆరేళ్ల కిందట వచ్చిన స్త్రీ మూవీకి ఇది సీక్వెల్. ఆ సినిమాలో నోరా ఫతేహి ఓ స్పెషల్ సాంగ్ చేసింది. కమరియా అంటూ సాగిన ఆ పాట అప్పట్లో ఓ పెద్ద సంచలనం. ఇప్పుడు తమన్నా ఈ సీక్వెల్లో అలా ఓ ఐటెమ్ సాంగ్ చేసింది. అయితే అప్పటి కమరియాతో పోలిస్తే ఇదేమంత బాగాలేదంటూ కొందరు అభిమానులు కామెంట్స్ చేశారు.

తమన్నా, మాడక్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఇన్ స్టాగ్రామ్ లో ఈ పాటను షేర్ చేస్తూ '#AajKiRaat హోగీ తబాహి కీ రాత్! అనే క్యాప్షన్ ఉంచారు. అయితే మేకర్స్ ఊహించినంత రెస్పాన్స్ మాత్రం రాలేదని కొందరి కామెంట్స్ వల్ల అర్థమవుతోంది.

"స్త్రీ మూవీలోని కమరియాతో పోలిస్తే ఏమీ లేదు" అని ఓ అభిమాని కామెంట్ చేశారు. మరో యూజర్ 'అన్నింటికంటే చెత్త పాట' అని అనడం గమనార్హం. 'పూర్తిగా డిజాస్టర్ సాంగ్ బ్యాడ్ మ్యూజిక్ అండ్ సింగర్ అండ్ వైబ్' అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

తమన్నా డాన్స్ పై అభిమానుల ప్రశంసలు

ఈ పాటలో తమన్నా డ్యాన్స్ పై మరికొందరు అభిమానులు మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు నెగిటివ్ రివ్యూల పట్ల వాళ్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మొదటి పార్ట్ లోని పాట కంటే కూడా ఇది బాగుందని కూడా అనడం విశేషం.

ఇక స్త్రీ2 మూవీ గురించి చెప్పాలంటే.. అమర్ కౌశిక్ హారర్-కామెడీకి సీక్వెల్ గా ఈ మూవీ వస్తోంది. రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠీ, అపర్ శక్తి ఖురానా, అభిషేక్, శ్రద్ధా కపూర్ తొలి పార్ట్ లోని తమ పాత్రలనే ఇందులోనూ పోషించారు. ఈ సీక్వెల్ లో సర్కటే అనే ఓ కొత్త దెయ్యాన్ని మేకర్స్ పరిచయం చేస్తున్నారు. దీనిని ఆ స్త్రీ ఎలా ఎదుర్కొంటున్నది సినిమాలో చూడాలి. ఈ సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. మరి స్త్రీలాగే ఈ స్త్రీ2 కూడా ఆకట్టుకుంటుందా లేదా అనేది చూడాలి.

Whats_app_banner